Wednesday, December 15, 2010

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రిన్సిపాల్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకువచ్చిన ఒక విద్యార్థిని కాలేజీలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వచ్చి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రిన్సిపాల్ ప్రతి విషయానికి తమని వేధిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. తమ తల్లిదండ్రులను కూడా అవమానిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్రిస్టియన్ మిషనరీ కాలేజీ అని, వారు హిందూ మత సాంప్రదాయాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తారని చెప్పారు. ఇప్పుడు తమ పేర్లు అన్నిటినీ తీసుకువెళ్లి ఇంటర్ బోర్డు నుంచి తమకు హాల్ టిక్కెట్లు రాకుండా చేస్తారని వారు భయపడుతున్నారు.

No comments:

Post a Comment