Sunday, December 23, 2012

రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు


రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు





రాజకీయంగా జగన్‌మోహన రెడ్డిని ఎదుర్కోలేక జైలుపాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్టన్రాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.  జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి  అగనంపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గున్నంటి పూర్ణానంథ శర్మ ఆద్వర్యంలో  జగన్‌మోహన రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ  మాట్లాడుతూ ప్రజాబలం మెం డుగా ఉన్న జగన్‌మోహనరెడ్డిని ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐను అడ్డం పెట్టుకుని జగన్‌మోహనరెడ్డిని జైలుపాలు చేశారన్నారు. రైతు కళ్లలో ఆనందభాష్పాలను చూడాలన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆకాంక్షను తీర్చేందుకు వైఎస్ జగన్‌మోహన రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆయనకు జన్మదిన కానుక గా సహకార సంఘాల ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిపించి అందించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనా, నాయకులపైనా ఉందన్నారు. జగన్ పిలుపుకోసం రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యే లు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను 700రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయలుగా అందించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. అలాగే అమ్మఒడి పేరుతో పిల్లలను ఆదుకుంటామన్నారు. రైతులకు, విద్యార్థులకు, పేదలను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు సాగు, తాగునీటికి పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. అంతకుముందు జగన్ జన్మదిన సందర్భంగా కేక్‌ను కట్‌చేసి స్వీట్లు పం చిపెట్టారు. వృద్ధులకు దుప్పట్లు  పంచిపెట్టారు.  అనంతరం 2013నూతన క్యాలండర్ ను కొణతాల రామకృష్ణ చేతులు మీదుగా అవిస్కరించారు, ఈ కార్యక్రమంలో నగర అథికారప్రతినిది తిప్పలనాగిరెడ్డి,కొయ్యప్రసాద్ రెడ్డి,చొప్పానాగరాజు,గొలగానిశ్రీను,ఇల్లపు ప్రసాద్, గుర్రంశ్రీను,గళ్ళ అప్పారావు,జె సోమినాయ్డు(సమరా),తులసి,కాతా నూకరాజు, పాల్గొన్నారు

Thursday, December 6, 2012

ఎన్టీఆర్ విగ్రహం మహాచార్య శిల్పి చెక్కనున్నారా ?


తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్‌కు చెందిన మహాచార్య అనే శిల్పి చెక్కనున్నారు. విగ్రహాన్ని తామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీపడినా, చివరకు ఆ అవకాశం మాత్రం పురందశ్వరికే దక్కింది. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు.