Monday, September 22, 2014

అక్రమ లే ఔట్లపై ఏపీ సర్కార్ కొరడా...!

గుంటూరులో జరుగుతున్న అక్రమ లే ఔట్లపై ఏపీ ప్రభుత్వం కొరడా గులిపించింది. కమర్షియల్ లే ఔట్ లను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ రోజే ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రియల్టర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు
.విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న రియల్టర్లు రెచ్చిపోయారు. అక్రమ లే ఔట్లను సృష్టిస్తూ భూములను ఇష్టమొచ్చినట్లుగా విక్రయించడంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నక తప్పదు. దీనిపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఉడా అనుమతులున్నాయి..దరఖాస్తు చేసుకున్నామని..తొందరలోనే పర్మిషన్ వస్తుందని నమ్మబలుకుతూ భూములను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రియల్టర్ల ఆగడాలకు గండి పడుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే కొందరు  ప్రభుత్వం జారీ చేసిన జీవోను సక్రమంగా అమలు చేయాలంటున్నారు.