Saturday, December 4, 2010

జర్నలిస్టులకు వృద్ధాప్య పింఛను : డికె అరుణ

వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి బాగోలేని జర్నలిస్టులకు నెలకు రూ.1000 పింఛన్‌ను ఇవ్వనున్నట్లు సమాచార, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి డికె అరుణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి బాగోలేని జర్నలిస్టులకు నెలకు రూ.1000 పింఛన్‌ ఇచ్చే ఫైలుతో పాటు, విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం చేసే ఫైలుపై సంతకాలు చేశారు. ఈసందర్భంగా మంత్రి డికె అరుణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియా వారధిగా వ్యవహరిస్తుందన్నారు. సంక్షేమపథకాలను ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర నూతన మంత్రివర్గంలోని 9మంది మంత్రులు శుక్రవారం సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. పాతవారంతా తమ పాత చాంబర్లనే ఎంచుకున్నారు. మంత్రుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలతో సచివాలయం శుక్రవారం కళకళ లాడింది. రోశయ్య రాజీనామాతో బోసిపోయిన అమాత్యుల కార్యాలయాలు తిరిగి పూర్వకళను సంతరించుకున్నాయి. ఈనెల 1న మంత్రులు ప్రమాణస్వీకారం చేసినా, గురువారం రోజు భారీనీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తప్ప మిగతా మంత్రులెవరూ బాధ్యతలు స్వీకరించలేదు.  

No comments:

Post a Comment