Saturday, December 4, 2010

జామ కాయ బరువు కిలో ..

పాయకరావుపేట; జామ చెట్టుకు మరో విశేషం ఏమిటంటే కొమ్మకు రెండు చొప్పున కాయలు కాస్తున్నాయి. కాసిన జామ కాయలు బరువు ఎక్కువ కావడంతో చెట్టు కొమ్మలు విరిగిపోతున్నాయన్నారు. ఏడాదికి 200 కాయలు వరకు దిగుబడి వస్తున్నాయన్నారు. వేసవిలో దిగుబడి తగ్గినా బరువుమాత్రం తగ్గడం లేదని వివరించారు. వీటిని పరిశీలించిన ఉద్యానవన శాఖాధికారి అనిత కుమారి మాట్లాడుతూ ఇంటి పెరట్లో పెరగడం వలన వ్యర్థపదార్థాలు ఎక్కువగా వేయడం వలన అధిక బరువుతో ఇవి కాసాయన్నారు. ఒక్కొక్క జామ కాయ బరువు కిలో ఉండడం విశేషమేనన్నారు.విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలోని గెడ్డం సత్యనారాయణ అనే ఉపాధ్యాయుని ఇంటి పెరట్లోని జామ చెట్టుకు కిలో బరువున్న కాయలు కాస్తున్నాయి. సాధారణంగా జామ కాయ 100 నుండి 150 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అయితే ఈ జామ కాయలు కొబ్బరి కాయ సైజులో ఉండి కిలో నుండి కిలో 100 గ్రాముల వరకు బరువు తూగుతున్నాయి. దీంతో వీటిని ప్రజలు వితంగా చూస్తున్నారు. ఇంత బరువు తూగుతున్న ఈ జామ కాయలు కాస్తున్న చెట్టుకు ప్రత్యేకంగా ఎరువులు ఏమీవేయలేదని, మేకల గెత్తం మాత్రమే ఉపయోగించానని ఆ ఉపాధ్యాయుడు తెలిపారు. ఈజామ చెట్టుకు మరో విశేషం ఏమిటంటే కొమ్మకు రెండు చొప్పున కాయలు కాస్తున్నాయి.

No comments:

Post a Comment