Sunday, December 12, 2010

జగన్‌ పార్టీలో చేరనున్న గుడివాడ నాగమణి...?

విశాఖజిల్లాలో తిరుగులేని కాంగ్రెస్‌పార్టీ నాయకుడిగా ముద్రపడిన,రాష్ట్ర సాంకేతిక శాఖా మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు సతీమణి .గుడివాడ నాగ మణి జగన్‌ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు ఆమెకు అత్యం త సన్నిహిత వర్గాలు సమాచారం....గుడివాడ గురు నాధరావు స్వర్గస్తులెన తర్వాత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్‌ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. అదే తరుణంలో ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగా లనే విధంగా గుడివాడ అభిమానులు,అనుచరులు నిర్ణయం తీసుకున్నారు. అదే తరుణంలో పెందుర్తి నియోజకవర్గానికి గాను మాజీ ఎం.పి ఎం.వి.వి.ఎస్‌.మూర్తి గుడివాడ నాగమణికి తెలుగదేశం పార్టీ టిక్కెట్‌ కేటాయించి ఎన్నికల బరిలో దిగా రు. అయితే ఆ ఎన్నికల్లో గుడివాడ నాగమణి పోటీ చేసినా కాంగ్రెస్‌పార్టీ అభిమానులను కాస్తంత ఇరకాటానికి గురిచేసింది. అదే విధంగా మూడు రంగుల జెండాల్లో నిత్యం కనిపించే ఆయనను పసుపు రంగు జెండాలో చూడడానికి అభి మానులు ఇబ్బంది పడ్డారు. ఆ కారణంగానే విజయానికి చేరువుగా వచ్చిన ఆమె ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవడానికి కారణమైంది. అయితే తదనం తరం 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు తిరిగి పశ్చిమ నియోజక వర్గం నుంచి టిక్కెట్‌ కేటాయించినా ఫలితం లేకపోయింది. నాటి నుంచి నేటి వర కు ఆమె తెలుగుదేశంపార్టీలో తిరుగులేని నాయకురాలిగా చలామణి అయినా, పార్టీ కేడర్‌లో పట్టుసాధించలేకపోయారు. అయితే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే పనిలో ఆపార్టీ జిల్లా కన్వీనర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఆమె చేపడుతున్న పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తప్పించారు. దీంతో ఆమె మనస్థాపానికి గురెందనే వాదనను ఆమె అనుచర గణం వినిపిస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ కుటుంబానికి చేసిన నష్టమే, తమ కుటుం బానికి చేసిందనే ప్రచారాన్ని ఆమె అనుచరులు ముమ్మరం చేస్తున్నారు. ఇదే కారణంగా ఇటు గాజువాక, అటు పశ్చిమ నియోజకవర్గాల్లో వె.ఎస్‌.జగన్‌ పార్టీకి బలమైన నాయకత్వం చేపట్టే అవకాశాలు వున్న కారణంగానే ఆమె జగన్‌ పార్టీలో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment