Sunday, August 23, 2015

సినిమా చేస్తున్నా.....చిరంజీవి...!


ష్టిపూర్తి వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్న మెగాస్టార్ చిరంజీవి తన 60వ బర్త్‌‌డే ని పురస్కరించుకుని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన రాజేకీయ, సినీ విశేషాలను పంచుకున్నారు.తన 150వ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన చిరంజీవి..భారీ అంచనాలు, అసాధారణ పరిస్థితులు ఉన్నందువల్లే కథను ఎంచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదన్నారు, పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో ఫస్టాఫ్ అందరికీ నచ్చిందని, కానీ సెకండాఫ్ పూరికి కూడా నచ్చలేదని చిరు తెలిపారు. కథలో మార్పు చేశాక మా ఇద్దరికీ నచ్చితే ఆయనే (పూరీయే) డైరెక్ట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
 ఇక ప్రేక్షకులు నా నుంచి కోరేది డ్యాన్స్..కాబట్టి డ్యాన్సులు తప్పనిసరి..బన్నీ, రామ్ చరణ్‌‌ల డ్యాన్సుల దూకుడు నిజమే..వాటిని ఛాలెంజింగ్‌‌గా తీసుకుంటా.. కమాన్.. రమ్మనండి.. వాళ్ళని..రఫ్ఫాడిస్తా ..నిజానికి నేను వస్తుంటే వాళ్ళే భయపడుతున్నారు అని మెగా స్టార్ హుషారుగా చమత్కరించారు. సినీ ప్రస్థానం తర్వాత రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అయితే ఈ రంగంలో ఏర్పడిన స్తబ్దత వల్లే తాను సినిమా చేయాలని అధిక శాతం మంది ప్రేక్షకులు కోరుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమయాన్ని అందుకే వాడుకోవాలని అనుకుంటున్నానని చెప్పిన ఆయన.. రాజకీయాల్లో ఎదురు పోరాటాలు, దెబ్బలు సహజమని, అది నిరంతర పోరాటమని అన్నారు.తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన చిరంజీవి-తామిద్దరం ఎప్పుడూ రాజకీయాలగురించి మాట్లాడుకోమని, 
అది తమ మధ్య కుదిరిన ఒప్పందమని తెలిపారు. తన అభిరుచులు, అభిప్రాయాలు నాకన్నా భిన్నమైనవి..అయితే వ్యక్తిగతంగా నాకు  రామ్‌‌చరణ్ ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతే..పవన్ కూడా నా బిడ్డే అని చిరు వ్యాఖ్యానించారు.కాగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ఏపీకి కావలసింది ప్రత్యేక హోదాయేనని, ఎన్ని నిధులు, ప్యాకేజీలు ఇస్తామన్నా అది కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడినట్టే తప్ప..హక్కుగా సాధించుకోలేమని తాను, తమపార్టీ హోదా కోసం పట్టుబడుతున్నామని ఆయన చెప్పారు. 
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజు కొంటుందన్న విశ్వాసాన్ని చిరు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నారు. గతంలో రెండు సీట్లున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది..కాంగ్రెస్ కూడా తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో పరిణతి చెందారని, మీడియా కూడా ఇదే విషయాన్ని అంగీకరించిందని చిరంజీవి చెప్పారు.

Thursday, March 5, 2015

మాట నిలబెట్టుకోవాలి

రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని విశాఖపట్టణం(వైజాగ్),తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్య నాయుడు అప్పట్లో పార్లమెంట్‌లో ‌పోరాటం జరిపారు. ఇప్పుడు మోదీ తనమాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.అయితే ఆంధ్రలో బాజాప పుంజుకుంటుదన్న సమయంలో తప్పులు దిర్లిస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో వున్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు విభజనకే మొగ్గు చూపాయి. అయితే, రెండు రాష్ర్టాలకు సమ న్యాయం చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండని అప్పట్లో చంద్రబాబునాయ్డు సూచించినప్పటికీ అందరూ తన మాటని పెడచెవిన పెట్టారు.రాష్ర్ట విభజన తో ఒక్క కాంగ్రేస్ పార్టీనే యావత్ తప్పు పడుతున్నప్పటికిని దానంతటికి కారణం బాజాప అనక తప్పదు..ఇలాగే వ్యవహరించుకు పోతుంటే వాళ్ళకి  పట్టిన గతే పడతాది.

Tuesday, March 3, 2015

అర్ధనగ్నంగా రేవ్ పార్టీ... ఫైనాన్షియర్లు, యువతులు అరెస్ట్


రేవ్ పార్టీల సంస్కృతి క్రమంగా దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది.రేవ్ పార్టీ కల్చర్ బీచ్ సిటీ వైజాగ్‌కి కూడా పాకింది. బీచ్ పరిసరాలతోపాటు నగర శివార్లలోని కొన్ని రిసార్ట్స్, ఫామ్ హౌజ్‌లలో తరచూ రేవ్ పార్టీలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఫామ్ హౌజ్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో  తాజాగా, విశాఖపట్నంలోని ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ సమీపంలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు, గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. ఆరుగురు మహిళలను, నలుగురు ఫైనాన్షియర్లను అరెస్టు చేశారు. మరో 40 మంది పరారయ్యారు. హైదరాబాద్ శివార్లలో గత కొంతకాలంగా ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతుండటం తెలిసిందే. ఇప్పడు ఈ రేవ్ పార్టీల కల్చర్
విశాఖలోనూ కనిపించడంతో సామాజికి వేత్తలను కలవరపెడుతుంది.


Wednesday, February 18, 2015

దగ్గుపాటి రామానాయుడు ఇకలేరు

రామానాయ్డు గారితో ఎడిటర్ ఎమ్ ఎ రాజు(బాబు) పైల్ పొటో...
ప్రముఖ నిర్మాత,మాజీ ఎంపి దాదాసాహెబ్ ఫాల్కె, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామానాయుడు ఇక లేరు. కొంత
కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుముశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి రాముడు భీముడు, ప్రేమ్‌నగర్, జీవన తరంగాలు, ఇంద్రుడు చంద్రుడు, సర్పయాగం, దేవత, సంఘర్షణ, కలియుగ పాండవులు, ఆహనా పెళ్లంట, గణేష్, బొబ్బిలిరాజా, తాజ్ మహల్, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా వంటివి ఆయన హిట్ సినిమాల జాబితాలో కొన్ని మాత్రమే.రామానాయుడు 1999లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి తేదేపా తరపున ఎంపీగా గెలుపొందారు.మూవీమోఘల్‌గా ప్రఖ్యాతి గాంచిన రామానాయుడకు భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 9న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి గౌరవించింది. రామానాయుడు మృతి పట్ల చిత్ర, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం పరుస్తున్నారు.. 1936 జూన్ 6న గుంటూరు జిల్లా కారంచేడులో జన్మించిన రామానాయుడు భారతీయ భాషలన్నింటిలో చిత్రాలు నిర్మించిన ఘనతని సొంతం చేసుకున్నారు. 50 ఏళ్ల కెరీర్ లో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ అన్ని తరాల హీరోలతో సినిమాలు చేసిన అనుభవజ్ఞుడు రామానాయుడు. అంతేకాకుండా.. 100కుపైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఏకైక నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం.అయితే రామానాయ్డుగారికి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్ ప్రకటించిన సమయంలో. విశాఖపట్నంలోనే ఉన్నారు అదేరోజు సాయింత్రం స్పేస్ జెట్ విమాణం కోసం ఎయిర్ పోర్ట్ లో విఐపి లాంజ్ లో ఉన్న సమయంలో...సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు(బాబు) రామానాయ్డు గారితో ఇంటర్యూ చేసిన తరువాత ఆయనతో పొటోస్ తీసుకున్నాం.

Monday, February 2, 2015

తెదేపాలో లోకేష్‌ పైనే చర్చ...!!

టీడీపీలో ప్రస్తుతం ఎన్నికల వేడీ రాజుకుంది. దశాబ్ద కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పార్డీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. టీడీపీలో పార్టీ సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు చట్టసభల ఎన్నికల స్థాయిలో జరుగుతాయి. సమర్థవంతులైన వారికే చంద్రబాబు బాధ్యతలు అప్పగిస్తారు. నాలుగు నెలల పాటు జరిగే ఈ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ ఎన్నికలు జరుగుతాయి. తొలుత గ్రామ కమిటీల ఎంపిక, తర్వాత మండల కమిటీలు… జిల్లా కమిటీలు.. చివరగా రాష్ట్ర కమిటీల నియామకం జరుగుతుంది. అయితే పార్టీలో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. గతంలో సమైక్యాంధ్ర కాస్త ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను ఎన్నుకోవాలి. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఎన్నిక కావడం లాంఛనమే.
అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అందరి దృష్టి యువనేత లోకేష్‌పైనే ఉంది. చంద్రబాబు ఆయనకు ఏ బా«ధ్యతలు అప్పగిస్తారన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా లేదా కొద్ది రోజుల పాటు ఆయనకు వెయిటింగ్ తప్పదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. వచ్చే ఎన్నికల బరిలో లోకేష్ ఉండడం ఖాయంగా కనిపిస్తుండడం… చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి రావడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ ఎన్నికల కోసం ఏపీలో ఉన్న 175 నియోకవర్గాలకు 105 మంది పరిశీలకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మే 29న మహానాడు ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది.
– ఫిబ్రవరి 6-28 గ్రామ, వార్డు స్థాయి కమిటీల ఎన్నికలు
– మార్చి 23-ఏప్రిల్ 7 మండల, పట్టణ, డివిజన్ స్థాయి కమిటీల ఎన్నికలు
– ఏప్రిల్ 20-30 జిల్లా కమిటీ ఎన్నికలు
– మే 27,28,29 మహానాడు, రాష్ట్రాలు, జాతీయ అధ్యక్షుడి ఎంపిక

Saturday, January 31, 2015

బీజేపీలో చేరేందుకు చర్చలు : జయప్రద

సినీనటి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత  బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఆమె బీజేపీలో చేరేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.  అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉంటానని…ఎలాంటి ఎన్ని
కల్లో పోటీ చేయనన్నారు జయప్రద. కేజ్రీవాల్ పై పోటీకి దిగుతానని గతంలో చెప్పారన్న విషయంపై ఆమె మాట్లాడుతూ…అలాంటి కామెంట్లు ఎప్పుడూ చేయలేదని చెప్పింది. మోడీ లీడర్ షిప్ లో పనిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జయప్రద ప్రకటించారు. అయితే బీజేపీ నేతలతో తాను మాట్లాడటం లేదని…అమర్ సింగ్ మాట్లాడుతున్నారని చివర్లో మరింత క్లారిటీ ఇచ్చారు జయప్రద.ఈ విషయాన్ని గతంలోనూ వెల్లడించినా ఆమె తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు  తెలుస్తోంది.  ఇకనుంచి డర్టీ పాలిటిక్స్‌కు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన రాజకీయాలను మాత్రమే చేయదలచుకున్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే బీజీపీలో చేరడానికి సిద్ధమని తెలిపారు.