Tuesday, March 19, 2013

అక్షర బ్రహ్మం' ఇకలేరు


అక్షర బ్రహ్మం' ఇకలేరు (సినిమా విజయంలో వాల్ పోస్టర్ దే కీలకపాత్ర)

తెలుగుచిత్ర సీమలో అక్షర బ్రహ్మగా పిలవబడే బ్రహ్మం కన్నుమూత ఆయన అక్షర బ్రహ్మ. సినిమా పేరును పోస్టర్లపై రాయడంలో ఆయనదే పైచేయి. నాలుగు దశాబ్దాలుగా సినిమా పోస్టర్ రూపకల్పన కూడా కళగా మార్చిన అద్భుత కళాకారుడు.ఆయనే కొసన బ్రహ్మానందరావు. తెలుగుచిత్ర సీమలో అక్షర బ్రహ్మగా పిలవబడే బ్రహ్మం కన్నుమూసారు.తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప పబ్లిసిటీ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందరావు (బ్రహ్మం) చెన్నయ్ లో మృతి చెందారు. ప్రముఖ డిజైనర్ ఈశ్వర్ కు బ్రహ్మం సోదరుడు. కొన్ని వేల చిత్రాల లోగోలు బ్రహ్మం రాశారు. అలాగే ప్రస్తుత తెలుగు పత్రికల్లో మనం చూస్తున్న అక్షరాలు చాలావరకు బ్రహ్మం సృష్టించినవే. అందుకే ఆయనను సినీ పరిశ్రమలో అందరూ 'అక్షర బ్రహ్మ'గా పిలుస్తారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అక్షర ఆకృతులు బ్రహ్మం సృష్టే. పాలకొల్లులో జన్మించిన బ్రహ్మానందరావు తన సోదరుడి దగ్గరే చాలాకాలం పనిచేశారు. కొసన బ్రహ్మానందరావు మృతి పట్ల చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.