Saturday, December 11, 2010

వైఎస్సార్‌కు శనిలా పట్టుకున్న కేవీపీ వల్లే అనర్థాలు;కొండా

దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ ప్రాణస్నేహితుడు కేవీపీ వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డికి చెడ్డపేరు వచ్చిందని మాజీమంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొన్నాలను వెంటబెట్టుకుని, ఆయన వెన్నంటి ఉన్నవారందరికీ జలయజ్ఞం కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. అసలు కేవీపీ రామచంద్ర రావు నిర్లక్ష్యం వల్లనే మహానేత వైఎస్సార్ మృత్యువాత పడ్డారంటూ ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ మరణించిన తర్వాత కూడా కేవీపీ భద్రతా సలహాదారు పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, దానికి పూర్తి బాధ్యత కేవీపీదేనని ఆమె పేర్కొన్నారు. ఎటొచ్చీ కేవీపీ, జగన్ కుటుంబానికి మంచి కంటే కీడే ఎక్కువ చేశారన్నారు. అధిష్టానం చేతిలో పావుగా మారి వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చారంటూ మండిపడ్డారు. మొత్తమ్మీద గత కొంతకాలంగా కేవీపీ - జగన్ ల మధ్య అంతరం పెరిగిందంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ నేడు కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు నిజాలు తెలుసుననీ, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. ఇకపోతే, ప్రస్తుతం వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఉవ్వెత్తున కెరటంలో వస్తున్నారనీ, ఇది చూసిన ఇతర పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయన్నారు.

No comments:

Post a Comment