Wednesday, December 29, 2010

జగన్ నుంచి దృష్టి మళ్లించడమే అధిష్టానం ఏకైక అజెండా!!

కాంగ్రెస్ మాజీ యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అధిష్టానం భయపడుతోందా? జగన్ గాలిని ఎలా బ్రేకులు వేయాలో తెలియక తలలు పట్టుకుంటోందారై? తు సమస్యలపై సమరశంఖం పూరించిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలని భావిస్తుందా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏరీతిలో వెనక్కి నెట్టి ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాత్రం పై ప్రశ్నలకు 'ఎస్' అనే సమాధానం చెపుతున్నారు. 
అందుకే 'టెన్ జన్‌పథ్' పక్కా ప్రణాళికను రూపొందించింది. సొంత పార్టీకి చెందిన ఎంపీలనే రోడ్లపైకి పంపేలా చేసింది. అధిష్టానం మాటను కలలో కూడా జవదాటని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో రాజకీయ క్రీడకు తెరలేపింది. సొంత పార్టీ ప్రభుత్వం మీదికే సమరానికి కాలుదువ్వేలా ప్రోత్సహించింది. అవసరమైతే ప్రభుత్వాలను కూల్చి వేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయించేలా చేసింది. నిన్నమొన్నటి వరకు గుప్‌చిప్‌గా ఉన్న ఈ ఎంపీలు రాత్రికిరాత్రి వీధిన పడటంలో ఆంతర్యమేమిటి? ఇది దేనికి సంకేతం? 
విద్యార్థులు కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ.. డిమాండ్ల సాధనకు దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దీక్ష ద్వారా అనేక ఫలితాలు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు వాదిస్తుండగా... మరికొందరు దీనిని తోసిపుచ్చుతున్నారు. 
ప్రధానంగా.. తెలంగాణ వచ్చనా రాకపోయినా... జగన్ వల్ల జరుగనున్న నష్టాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ తరహా ఆందోళనకు ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. తెలంగాణ ప్రాంతంలో కొంత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ దీక్ష కదలిక తెచ్చేలా చేసింది. అలాలగే, తెరాస, తెదేపాలను ఇరుకున పెట్టేలా చేసింది. పైపెచ్చు.. తమ మాటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపేలా చేసేందుకు తెలంగాణ ఎంపీలు తమ దీక్ష ద్వారా చేశారు. 
దీంతో పాటు.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రపథంలో ఉన్న తెరాసను వెనక్కి నెట్టేందుకు, రైతు సమస్యల అజెండాతో ముందుకు దూసుకెళ్తున్న తెదేపాను అడ్డుకునేందుకే అధిష్టానం వ్యూహాత్మకంగానే ఎంపీలతో పోరుబాట పట్టించినట్టు అభిప్రాయపడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వస్తున్న నేపథ్యంలో... ఇప్పటికిప్పుడు తెలంగాణలో గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ నేతలకు ఉంది. ఈ పరిస్థితి మారాలంటే పోరాడక తప్పదంటున్నారు. వీటితో పాటు... పక్కలోబల్లెంలా తయారైన జగన్‌కు చెక్ పెట్టాలంటే ఇలాంటివి చేయించాలన్నది అధిష్టానం వ్యూహంగా ఉంది. 
ప్రస్తుతం తెలంగాణ నేతలతో చేయించిన హైకమాండ్.. తదుపరి సీమాంధ్ర నేతలను పురిగొల్పే అవకాశాలు లేకపోలేదన్నారు. అవసరమైతే వచ్చే యేడాది నుంచి స్వయంగా రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్‌లో సుడిగాలి పర్యటనలు చేయించేలా రూపకల్పన చేస్తోంది. అయితే, అధిష్టానం చేస్తున్న ఈ చర్యల వల్ల పార్టీకి కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదనే వాదనలూ వినొస్తున్నాయి.

ఎక్కువ మంది ప్రజలను సంతృప్తి పరిచేలా నివేదిక: శ్రీకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై తాము చేసిన అధ్యయనంలో తాము సేకరించిన అంశాలను క్రోఢీకరించి ఎక్కువ మంది ప్రజలు సంతృప్తిచెందేలా నివేదికను తయారు చేశామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఛైర్మన్ జస్టీ శ్రీకృష్ణ తెలిపారు. ఈ కమిటీ సభ్యులు మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమ నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. తమ 11 నెలల విస్తృత అధ్యయనంలో కమిటీకి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. 
రాష్ట్ర విభజన అంశంపై తాము చేసే సూచనలు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయన్నారు. నివేదికను రూపొందించడం ప్రసవవేదనలా ఉంటుందన్నారు. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లవాడా? అనే విషయం తెలుసుకోవాలని సహజంగానే అందరికీ ఆతృత ఉంటుందన్నారు. నివేదికలోని అంశాల గురించి ఆరాతీయడానికి ప్రయత్నించవద్దని ఆయన మీడియాకు ముందుగానే విజ్ఞప్తి చేశారు. 
నివేదికలో పేర్కొన్న అంశాలను కేంద్రమే వెల్లడిస్తుందని, ఇందుకోసం మరో నాలుగైదు రోజులు వేచి ఉండాలన్నారు. తాము ముందుగా ప్రకటించినట్టుగానే గడువులోగానే అంటే డిసెంబరు 31వ తేదీన తుది నివేదికను కేంద్ర హోంమంత్రి చిదంబరానికి సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న అన్ని అంశాలను పరిశీలించినట్లు శ్రీకృష్ణ తెలిపారు. 
అయితే, శాంతిభద్రత పరిరక్షణ బాధ్యత మాత్రం రాజకీయనేతలపైనే ఉందన్నారు. నివేదిక అనుకూలంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా శాంతిభద్రతలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. నివేదిక సమర్పించిన తరువాత ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. 
ఇకపోతే.. కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్ మాట్లాడుతూ.. తమ కమిటీ చేసిన సిఫారసులు నిష్పక్షపాతంగా ఉంటాయన్నారు. నివేదికను రెండు భాగాలుగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. నివేదిక భారీగా ఉంటుందని ఆయన తెలిపారు. నివేదిక రూపొందించడం కోసం తాము అన్ని జిల్లాలు తిరిగామని చెప్పారు. ప్రతి అంశాన్ని తూలనాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.

Tuesday, December 28, 2010

తెలంగాణా నేతల సామూహిక రాజీనామా - నిరాహార దీక్ష


కే.కే మాట్లాడుతూ తెలంగాణకు మద్దతు ఇచ్చేవారు ఎవరైనా ( ఏ పార్టీ ) వారు తమకు మిత్రులే నని చెప్పారు. ఏ సందర్భంగా తెలంగాణా నేతలందరూ ఒకే త్రాటి పై వచ్చి పోరాడాలని పేర్కొన్నారు.ఇప్పటి వరకూ తెలంగాణా లో ఎటువంటి గొడవలు గాని, నిరసనలు గాని, మరెటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు పెల్లుబీకలేదని కాని కేంద్రం నుంచి అదనపు బెటాలియన్లు, దళాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని చెప్పారు.

హైకోర్టులో నిత్యానందా పిటీషన్

కామెడి కింగ్ రాజేంద్ర ప్రసాద్ నిత్యానంద స్వామీ పాత్రలో ప్రేక్షకులను అలరించాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అయ్యారే అని పేరు కూడా ఖరారైంది.డైలాగ్ కింగ్ సాయికుమార్, శివాజీ తదితరులు రాజేంద్ర ప్రసాద్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని తక్షణమే ఆపివేయాలని నిత్యానందా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకని హైకోర్టు ప్రశ్నించగా ఈ సినిమా తన పాత్రను కించ పరిచే విధంగా ఉండబోతుందని , తన అనుమతి లేకుండా తన పాత్రను తీసుకోవడం తగదని నిత్యానంద తన తరపు వకీలు ద్వారా పేర్కొన్నారు.

మీకు రాష్ట్ర భవిష్యత్తు ఏంటో తెలుసా??

ఎంతటి రాజకీయ మేధావి అయినా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు.అంతెందుకు అందరి తల రాతలు రాసిన ఆ బ్రహ్మ దేవుడిని అడిగినా ఆయన నోరు కూడా మూగాబోవాల్సిందే.!
రేపో మాపో క్రొత్త సంవత్సరం రాబోతోంది ఇది ఊరికే రాకుండా అనేక సందిగ్ధ ప్రశ్నలను మోసుకొని వస్తోంది.
అనేక మంది రాజకీయ నేతల భవితవ్యం కూడా ఈ క్రొత్త సంవత్సరంలోనే తేలనుంది.


తెలంగాణా వస్తుందా ? రాదా?
వచ్చేవరకూమన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండబోతోందా?
వస్తే హైదరాబాద్ గతేంటి? కేంద్రపాలిత ప్రాంతమా? తెలంగాణా రాజదానా?రెండింటికి రాజదానా?
కోస్తా,రాయలసీమ పరిస్తితులేంటి? వీటికి రాజధాని ఏది?
కోస్తాని ,రాయలసీమలను కూడా ముక్కలు చేస్తారా?
కే.సి.ఆర్ తెలంగాణకి సి.యం అవుతాడా?(తెలంగాణా ఇస్తే )
సీమంధ్ర సి.యం ఎవరు?(తెలంగాణా ఇస్తే )
తెలంగాణలో కాంగ్రేస్ ఉంటుందా?
సీమంద్రాలో కాంగ్రేస్ పరిస్థితి ఏంటి?
జగన్ కొత్త పార్టీ సీమంధ్రలో ఎంత వరకూ విజయం సాధిస్తుంది?
తెలంగాణలో కూడా జగన్ పార్టీ ఊపండుకున్తుండా?
తెలుగుదేశం పార్టీ గతి ఏంటి?
ప్రజారాజ్యం పేరుకే పరిమితమా?
కిరణ్ సి.ఎం పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా?
ఇది మన రాష్ట్రంలో పరీక్షలకి సిద్దం చేసిన ప్రశ్నా పత్రం.ముందే లీక్ అయిపోయినా సమాధానాలు దొరకని దుస్థితి.ఇన్ని ప్రశ్నలు మరెన్నో జవాబులు రాబోవు రోజులే నిర్ణయిస్తాయి.
పొరపాటున మీకు తెలిస్తే నాక్కూడా చెప్పండి చచ్చి మీ కడుపునా పుడతా .(రాజకీయ నాయకుడిగా మాత్రం కాదండోయ్ )
చూద్దాం రాష్ట్రం ఎలా ఉండబోతోందో?

తెలంగాణలో ఉనికి కోసం కాంగ్రేస్ పాట్లు

తెలంగాణా కాంగ్రేస్ నేతన్నడూ లేని విధంగా, క్రొత్తగా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు. లేక పోతే తెలంగాణా లు ఎఎంపీలందరూ దీక్ష చేయడం ఏమిటి?
 వారికి MLC,MLA లందరూ మద్దతు ఇవ్వదమేమిటి?
విద్యార్థులను విడిపించడంలో ఇన్ని రోజులూ వాళ్ళు చేసిందేమిటి?  
తెలంగాణా విద్యార్థులను విదిపించడానికో లేకపోతే తెలంగాణలో కోల్పోతున్న తమ ఉనికిని దీన్ని అడ్డంగా పెట్టుకుని కాపాడుకోవడానికో భలే పన్నాగం పన్నారు.
తెలంగాణా ఆవిర్భవించడానికి తాము మాత్రమె కారకులని , కాంగ్రెస్స్ మాత్రమె తెలంగాణని ఇవ్వగలదని ప్రజలలో మెప్పు పొందడానికి ఇలా చేస్తున్నారని అనడంలో వింతేమీ లేదు.
కాంగ్రేస్ కుళ్ళు , కుతంత్రాలలో ఇది ఒక భాగం అని చెప్పవచ్చును.ఇదంతా డిల్లీ పెద్దలకు కూడా తెలిసే ఉంటుంది.బహుశా ఈ నాటకానికి రూపకర్తలు వారే అయిఉంటారు. కాంగ్రేస్ తెలంగాణా ఇచ్చి ప్రజల మన్ననలను పొందాలని అనుకుంటుందేమో పాపం కాని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని విశ్వశించరు. తెలంగాణా రావడానికి సృశి చేసిన క్రెడిట్ T.R.S కి దక్కకుండా ముందస్తు జాగ్రత్తలు బాగానే తీసుకుంటోంది.
T.R.S కాంగ్రేస్ నాయకులపై ఎటువంటి వ్యూహాలతో ఎదురుదాడి చేస్తుందో చూడాలి.      

సమైఖ్యాంధ్ర ఉద్యమం ఉదృతం - SVU విద్యార్థి సమాఖ్య

శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణ పైన ఒక నిర్దిష్ట  నివేదిక ఈ నెల 31 న విడుదల చేయనుంది.ఈ నేపద్యం లో  S.V ఉనివర్సిటి సీమంధ్ర ఉద్యమకారులు సమైఖ్యాంధ్ర వాదాన్ని శ్రీ కృష్ణ కమిటి వారు ద్రువీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణాకు అనుకూలంగా ప్రకటనలు వెలువడితే సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణా కాంగ్రేస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల కొరకు దీక్ష చేపట్టారని . అవసరమైతే సీమాంధ్ర నీతలు కూడా రాజీనామాలకు వేనుకాదకూడదని పిలుపునిచ్చారు. దమ్ముంటే సీమాంధ్ర వాసులను ఒప్పించి తెలంగాణా ను సాధించాలని చెప్పారు.

నవ్విపోదురు గాక మాకేంటి.. ఇదేనా 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర?!!


125 ఏళ్ల ఘనమైన చరిత్ర అని గొప్పగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఎ సర్కార్ కుంభకోణాలమయంగా మారింది. దేశ ఖజానాను యధేచ్చగా లూఠీలు చేస్తున్నా.. తెలిసీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. కేంద్రంలో పరిస్థితి ఆ విధంగా వుంటే.. మన రాష్ట్రంలో ఆ పార్టీ పరువు బజారున పడిందనే చెప్పొచ్చు. 
తెలంగాణా ఉద్యమంతో మానసికంగా నిట్టనిలువునా చీలిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడటం ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయింది. వీరిని ఎలాగోలా సర్దుకుంటూ వచ్చిన హైకమాండ్‌కు వైఎస్‌.జగన్ తిరుగుబావుటా పెద్ద గుదిబండలా మారింది. జగన్ ఆ పార్టీ, ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ మాటల మాయో.. వైఎస్సార్ పట్ల సానుభూతో... కాంగ్రెస్ పార్టీపట్ల వ్యతిరేకతో తెలియదు కానీ జగన్ ఎక్కడ సభ పెట్టినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
పార్టీ నుంచి బయటకు వెళ్లిన జగన్ వెంట అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగా నడుస్తున్నారు. పైపెచ్చు అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అంతగా మాట్లాడితే రాజీనామా చేయడానికైనా సిద్ధమని తెగేసి చెపుతున్నారు. ఇంత జరుగుతున్నా హైకమాండ్ చేష్టలుడిగి చూస్తుండిపోవడం తప్పించి ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. 
ఇదిలావుండగా తాజాగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రాంత ఎంపీలు విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నది... కాంగ్రెస్ పార్టీనా...? లేదంటే ప్రతిపక్ష పార్టీనా..? అని సామాన్య పౌరుడిలోనూ ఒక చిన్న సందేహం కలుగుతోంది. అధికారం తమ చేతిలోనే ఉన్నా... ఆ అధికార పార్టీకే చెందిన ఎంపీలు దీక్ష చేపట్టడంతో పాటు ప్రభుత్వం కళ్లు ఉన్న కబోదిలా మారిపోయిందనీ, చెవులున్నా చెముడు ఉన్నట్లు ప్రవర్తిస్తోందనీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. 
కొసమెరుపు ఏమిటంటే... అధికార పార్టీకి చెందిన ఎంపీలు చేస్తున్న దీక్షకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ప్రకటించడం. అంటే ప్రభుత్వంలోనూ గ్రూపులు... లుకలుకలున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరమాంకంలో ఉన్నదేమో అనిపిస్తోంది... ఏదేమైనా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ ఆ పార్టీ అసలు రూపు ఏమిటో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకూ ఇంకా ఎన్ని రకాల మలుపులు కుదుపులకు లోనవుతుందో వేచి చూడాల్సిందే. ఇదే.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పండు ముదుసలి కాంగ్రెస్ పరిస్థితి.

స్థల వివాదంలో మాజీ సీఎం రోశయ్య

ఓ స్థల వివాదానికి సంబంధించి మాజీ సీఎం రోశయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా సీబీఐ కోర్టు పోలీసులను ఆదేశించింది. అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద రూ. 200 కోట్ల విలువగల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మాజీ సిఎంతోపాలు మరి కొందరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది.

తెలంగాణ ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం కావు: జేపీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే అది పొరపాటే అవుతుందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన సోమవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటితో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. 
ఈ నేతల రాజకీయ స్వార్థం ఏదో ఒక రోజున బయటపడుతుందన్నారు. ఆ రోజున జరిగిన నష్టాన్ని తలచుకుని బోరున విలపించక తప్పదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలోనే మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఇరు ప్రాంతాల వాసులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. 
ఇకపోతే.. రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. ముందుచూపులేని ప్రభుత్వాల వల్లనే రైతులకు, ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందన్నారు.

దీక్ష విరమించండి... సబిత: వల్లంటే వల్లకాదు: ఎంపీలు

విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్ష బూనిన తెలంగాణా ఎంపీలను రాష్ట్ర మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. స్వయంగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దీక్షా శిబిరానికి తరలి వచ్చి, ప్రభుత్వం ఆ కేసులపై ఆలోచన చేస్తుందోననీ, దీక్ష విరమించాలని అభ్యర్థించినప్పటికీ ఎంపీలు ససేసిమిరా అన్నారు. 
విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తేనే తాము దీక్షను విరమిస్తామని ప్రకటించారు. దీంతో చేసేది లేక మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రేపు ఉదయం ఎంపీల డిమాండ్లకు అనుగుణంగా ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 
ఇదిలావుంటే కాంగ్రెస్ ఎంపీల దీక్షను తెరాస కొట్టిపారేసింది. తెలంగాణా ఉద్యమానికి సంబంధించి క్రెడిట్ ను తాము కొట్టేయాలన్న తపనలో కాంగ్రెస్ పార్టీ ఉందనీ, అందులో భాగంగానే ఈ దీక్షా నాటకాలని విమర్శించింది. 
కాంగ్రెస్, తెదేపాలు ఎన్ని నాటకాలాడినా ప్రజలకు అసలు సంగతి తెలుసని తెరాస నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ చేసి ప్రజల అభిమానాన్ని పొందలేరన్నారు.

Sunday, December 26, 2010

కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ప్రజాప్రతినిధులు అల్టిమేటం!!!

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే ప్రతిపాదన పెట్టగా, దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఫలితంగా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. 
అంతేకాకుండా, విద్యార్థులు, ఉద్యమకారుల పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేసే వరకు రేపటి నుంచి గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీలంతా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 11 గంటలకు సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు తెలంగాణ అంశంపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించారు. 
ఈ భేటీ అనంతరం సీనియర్ నేత కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని తాము చేసిన డిమాండ్‌కు గడువు నేటితో ముగిసిందన్నారు. పాక్షికంగా కాకండా పూర్తిస్థాయిలో కేసులు ఎత్తివేసే వరకూ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31 తర్వాత పరిణామాలను బట్టి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటమ్ జారీ చేసినట్టు చెప్పారు.

రాణించని రాజకీయ పార్టీలు

విశాఖపట్నం:ఈ ఏడాది జిల్లాలోని ఏ రాజకీయ పార్టీకి కూడా అంతగా కలిసిరాలేదు. ప్రధాన పార్టీలన్నీ వివిధ సమస్యలతో సతమతమవుతూ... అస్థిర పరిస్థితులను చవిచూడాల్సి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొని ఉంటే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోరాటాలతో ప్రజల వద్దకు వెళ్ళేందుకు విఫలయత్నం చేసింది. ప్రజారాజ్యం పార్టీ దశ....దిశ ఏమిటో తెలియని దుస్థితిలో కొనసాగింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి దేశ, రాష్ట్ర రాజధానుల నుంచి నేతలు దిగివచ్చినా అది సాధ్యం కాలేదు. లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది తమ ఉద్యమాలను కాస్తంత తగ్గించి, దేశ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత ఏడాది నవంబర్‌లో రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఏర్పడిన ప్రతిష్ఠంభన జిల్లాలో మరింత ఎక్కువగా కనిపించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాకు పలుసార్లు వచ్చినా ఇక్కడి ప్రజలకు ఒక్క ఉపకారం కూడా చేయలేకపోయారు. రోశయ్య అసమర్థతను స్థానిక ఎమ్మెల్యేలు దిగమింగుకుంటూ వచ్చారు. నిధులు లేక, ప్రజల వద్దకు వెళ్ళలేక ఎమ్మెల్యేలు సతమతమైపోయారు. అకస్మాత్తుగా రోశయ్యను మార్చి, ఆ స్థానంలో కిరణ్‌కుమార్ రెడ్డిని అధిష్ఠానం ప్రతిష్ఠించడంతో స్థానిక నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా కొనసాగుతున్న బాలరాజుకు తిరిగి పదవి దక్కుతుందో లేదోనన్న టెన్షన్ కొంత కాలం కొనసాంది. ఇంతలోనే జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అనకాపల్లి ఎం.పి.సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వగైరాలు జగన్‌కు దన్నుగా నిలిచారు. జిల్లాలో జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్ర విజయవంతం చేసే బాధ్యతను వీరిద్దరు తమ భుజాలకెత్తుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, మాజీలను ఒక్కర్కొక్కరుగా జగన్ వైపు లాగేందుకు ముమ్మర ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి పార్టీతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా స్తబ్దత ఏర్పడింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. నగర పాలక సంస్థలో అధికార పార్టీకి చెందిన మేయర్ పులుసు జనార్దనరావుకు ఈ ఏడాదీ పదవీ గండం ఏర్పడింది. అయితే ఆయనకు అదృష్టం ఎప్పటికప్పుడు కలిసివస్తుండడంతో ప్రస్తుతానికి ఆ గండం నుంచి కాస్తంత తప్పించుకున్నట్టు కనిపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ఈ సంవత్సరం ఆఖరులో జిల్లా పర్యనకు వచ్చారు. ఆయన జిల్లాలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు ఎదురవడం గమనార్హం.ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఈ ఏడాది అంతా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉంది. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పల్లె పిలుపు కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి వెళ్ళినా, పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఈ ఏడాది జిల్లా పార్టీలో పెను మార్పులు సంభవించాయి. అర్బన్, రూరల్ జిల్లాలను కలిపేసి ఒకే కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా అయ్యన్నపాత్రుడిని నియమించారు. ఆయనకు, బండారు సత్యనారాయణమూర్తికి ఉన్న విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతునే ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు టిడిపి స్పందించినా, అందుకు తగినట్టుగా ప్రజలు స్పందించకపోవడంతో వీరిలో నీరసం ఆవహించింది.




ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే... ఈ పార్టీ ఎటువైపు పయనిస్తోందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నా, పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేకపోయారు. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చినా పార్టీ ఏమాత్రం ఎత్తిరిల్లకపోవడం గమనార్హం. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు స్పష్టమైన కార్యాచరణను పార్టీ అధిష్ఠానం, కనీసం జిల్లా పార్టీ నాయకత్వమైనా రూపొందించకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించింది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్న పీఆర్పీ ఎమ్మెల్యేలకు నిరాసే మిగులుతోంది. జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినందు వలన గంటా శ్రీనివాసరావు మంత్రి అవుతారన్న ప్రచారం జరగడం.. కొంత కాలం తరువాత కాంగ్రెస్ నుంచి పిలుపురాలేదని తేలడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీలో పదవులు పొందిన వారైనా ప్రజా సమస్యలపై కచ్చితమైన కార్యాచరణను రూపొందించకపోవడం వలన పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.

Saturday, December 25, 2010

రాజా, కల్మాడీ ఇళ్ళల్లో సిబిఐ కి దొరికినవి ? (బ్రేకింగ్ న్యూస్)

స్కాం విలువ ఆధారం గా, మొదట రాజా గారి ఇంట్లో దొరికినవి మనవి చేసుకుంటున్నాను. 

1. గత వారం మోర్ సూపర్ మార్కెట్ లో ఉల్లిపాయలు కొన్న రసీదు. 
2. బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్న అబ్బాయి ప్రొగ్రెస్స్ రిపోర్ట్ 
3. కరుణానిధి గారి వంశ వృక్షం ఫోటో కాపీ. 
4. ఓ ఐదేళ్ళ క్రితం కనిమొళి గారు పంపిన గ్రీటింగ్ కార్డు 
5. నగర శివార్లలో ఉన్న ఓ దళిత స్కూలుకు రాజా గారు ఇచ్చిన లక్షా డెభ్భై ఆరువేల రూపాయల (ఈ సంఖ్య ఎక్కడో విన్నట్టుంది ? ) విరాళానికి సంభందించిన రసీదు
6. రోబో ఆడియో కాసేట్ మరియు CD కూడాను. 
7. మధు కోడా నుంచి వచ్చిన ఒక ప్రశంసా పత్రం. 

ఇవి కాక, కరంట్ బిల్లులు, పన్ను రసీదులు, మెడికల్ రిపోర్టులు (రాజా గారివి, మరియు కరుణానిధి భార్య గారివి కూడా), పయనీరు పేపర్ కట్టింగులు, నీరా రాడియా పెళ్లి ఫోటోలు మరియు పెటాకుల ఆర్డరు లభించాయి. ఈ పత్రాల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, సిబిఐ వాటిని జప్తు చేసేందుకు హైకోర్టు అనుమతికోసం ఎదురు చూస్తోంది. సిబిఐ కి ఆ హక్కు లేదని, అది చాలా అన్యాయమని, ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు, ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.
దాదాపుగా కల్మాడి గారి ఇంట్లోనూ, ఇలాంటి పత్రాలే లభించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఎవరో సోనియా, రాహుల్ పేర్లమీద ఉన్న ఎకౌంటు స్టేట్మెంట్స్ దొరికాయి కానీ, ఆ వివరాలు ఈ కేసుకి సంభందించినవి కావని సిబిఐ తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసుని ఇంకా డీప్ గా శోధించడానికి సిబిఐ ప్రత్యేక బృందం, కల్మాడి గారి అమ్మమ్మ గారి ఊరుకి బయలుదేరినట్టు సమాచారం. అక్కడైనా ఆయన స్టడీ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ లాంటి కీలక పత్రాలు దొరకాలని ఆశిద్దాం.
ఇప్పుడే అందిన మరో ముఖ్యమైన వార్త, కేవలం స్కాం నాయకుల కోసం అపోలో ఆసుపత్రి వారు ఢిల్లీ లో సిబిఐ ఆఫీసు ప్రక్క సందులో ఓ ప్రత్యేక బ్రాంచ్ ని మొదలు పెడుతున్నారు. అదే విధం గా, నిమ్స్ లో నిరాహార దీక్షల వార్డుని వేరే గా మొదలు పెట్టాలని, ఆ వార్డు కేటరింగు కాంట్రాక్టు నాకే ఇవ్వాలని నేను నా బ్లాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.

జగన్ఽవివేక డబుల్ గేమ్ ,కాంగ్రేసుకు హడల్

వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డికి మద్య సత్సంభందాలు లేవని ఇప్పటివరకు అందరికి తెలుసు.కాంగ్రేస్ తనకిచ్చిన మంత్రి పదవిని వదులుకోలేని వివేక, జగన్ కు సహకరించలేదు.తాజాగా వీరిద్దరి మద్య జరిగిన సంధి సఫలం అయింది.పులివెందులలో క్రిస్మస్ సందర్భంగా భేటి అయిన వీరిరువురి మద్య సానుకూల వాతావరణం నెలకొంది.
వై.ఎస్ రాజశేకర్ రెడ్డి పై కాంగ్రేస్ నేతలైన డి.ఎల రవీంద్రా రెడ్డి, డి.శ్రీనివాస్ , బొత్సా సత్యనారాయణ మరియు తదితర నేతలు అవినీతి ఆరోపణలు చేయడం వంటి విషయాల వల్ల వై.ఎస్ వివేకానంద రెడ్డి కలత చెందారు.కాంగ్రేస్ తనను జగన్ మోహన్ రెడ్డి విష్యం లో పావుగా మార్చి౦దన్న విషయం కూడా వివేకా గ్రహించినట్టున్నాడు.
ఇది ఒక కోణం లోనుంచి విశ్లేషిస్తే మాత్రమె, ఇంకో కోణం లో అయితే వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అస్త్రంగా చెప్పవచ్చు.ఇది వీరిరువురూ కావాలనే కాంగ్రేస్ కి షాక్ ఇచ్చే ప్లాన్ చేసినట్టు కొందరు అనుకుంటున్నారు.
ఇంకొంత కాలం వివేకా మంత్రి పదవిలో కొనసాగి తరువాత జగన్ పార్టీ లో చేరే అవకాశం ఉంది.ఏది ఏమైన ఇక రాష్ట్రంలో కాంగ్రేస్ కి గడ్డుకాలమే.

ఉల్లి మరింత ఘాటు

న్యూఢిల్లీ : ఉల్లి ధర మరింత ఘాటెక్కింది. చెన్నై రిటైల్ మార్కెట్‌లో మంగళవారం కేజీ రూ. 85కు చేరింది. మిగతా మహానగరాల్లోనూ రూ. 50-80 మధ్య పలికింది. ఇప్పట్లో ధర తగ్గించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్ నియంత్రణపై నిస్సహాయత వ్యక్తం చేసింది. ధర ఘాటు మరో మూడు వారాల వరకు కొనసాగనుందని ‘ఉల్లి’ పేల్చింది. పరిస్థితిని కాస్తయినా చక్కదిద్దేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. ధర తగ్గించేందుకు పటిష్ట, సత్వర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఈ రెండు శాఖలకు లేఖలు రాసింది. ‘ధరను అందుబాటులో ఉంచాలని ప్రధాని కోరారు. పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. హోల్‌సేల్, రిటైల్ ధరల గురించి కూడా ఆయన లేఖల్లో ప్రస్తావించారు’ అని ఓ అధికారి చెప్పారు. ధర పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా స్పందించారు. ‘రెండు, మూడు వారాల వరకు ఉల్లి ధర భారీగానే ఉండబోతోంది. ఆ తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది’ అని ఢిల్లీలో అన్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధం వల్ల ధరలు తగ్గుతాయన్నారు. ధర పెరుగుదలకు కారణాలేమిటో కూడా వివరించారు. ‘మహారాష్టల్రోని నాసిక్ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల నుంచి రెండు మూడువారాల్లో పంట రావాలి. తర్వాత ధరలు తగ్గుతాయి’ అని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి గురించి ఇప్పుడేమీ ఆలోచించట్లేదన్నారు. పాక్ నుంచి సోమవారం 450 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నామని, పంజా బ్ సరిహద్దులో కేజీ ధర రూ. 18-20 మధ్య ఉందని తెలిపారు. కాగా, అక్రమ ఉల్లి నిల్వలపై దాడులు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి రూ. 70-80, ముంబైలో 55-60, కోల్‌కతాలో రూ. 60-70 మధ్య పలికింది. కొన్ని రోజుల కింద ఈ నగరాల్లో ఉల్లి రూ. 35-40 మధ్య ఉండేది. ఉల్లి ధర చుక్కలనంటడానికి కారణం ప్రభుత్వ విధానాలేనని బీజేపీ సహా పలు విపక్షాలు విరుచుకుపడ్డాయి. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా మార్కెట్ శక్తులకు లొంగిపోయిందని, ఫలితంగా ఉల్లితోపాటు పలు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఢిల్లీలో ఆరోపించారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని దుయ్యబట్టారు. అధికధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్లమెంటు తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్థిక విధానాలు, కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే ఉల్లి ధర మండుతోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఉల్లి ధర కొండెక్కిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోపించారు. అధిక ధరలకు తాము వ్యతిరేకమని యూపీఏ భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్థా ఛటర్జీ కూడా నిర్మొహమాటంగా చెప్పారు. 

Wednesday, December 22, 2010

ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న "దీక్షా"కాలం

వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం "మూడు దీక్షలు ఆరు బంద్"లతో గడగడలాడిపోతోంది. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన పగ్గాలను చేపట్టి నాలుగు నెలలు తిరగకుండానే వైఎస్సార్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇక అప్పట్నుంచి రాష్ట్రంలో రకరకాలు ఉద్యమాలు, ఆ వెంటనే దీక్షలు... అటు పిమ్మట కదిలిస్తే బంద్‌లు. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి.
రాజకీయ కురువృద్ధునిగా పేరు గాంచిన రోశయ్యను పీఠాన్ని అధిష్టింపజేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుదామన్న కాంగ్రెస్ హైకమాండ్‌కు అనూహ్యరీతిలో అనేక చిక్కులు ఎదురయ్యాయి. గత ఏడాది డిసెంబరులో తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణాకోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను వణికించారు.
ఆ వేడిలో కేంద్రం తెలంగాణాపై ప్రకటన చేయడం, ఆ వెంటనే సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు రేగడంతో రాష్ట్రం అతలాకుతలమైంది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఏడాది లోపు ప్రకటన చేస్తామని చెప్పడంతో అటు తెలంగాణా ఇటు సీమాంధ్రలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ వెంటనే వైఎస్ జగన్ ఓదార్పు. 
ఈ ఓదార్పు యాత్ర ప్రభుత్వానికే పెను సవాల్‌గా మారింది. ఈ యాత్రపై అధిష్టానం, జగన్‌ల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయభేదాలు తీవ్రరూపం దాల్చి జగన్ కాంగ్రెస్ నుంచి వైదొలిగే పరిస్థితి తలెత్తింది. పార్టీ నుంచి వెలుపలికి వచ్చిన జగన్ అవిశ్రాంతంగా రాష్ట్రంలో... ముఖ్యంగా కోస్తాంధ్రను చుట్టేస్తున్నారు. మొన్నటి వర్షాల్లో దెబ్బతిన్న రైతులను పరామర్శించిన జగన్, నష్టపోయిన రైతులకు రూ. 5 వేలు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వం తన డిమాండ్‌కు అనుగుణంగా స్పందించకుంటే 48 గంటలు దీక్ష చేపడతానని ప్రకటించారు. 
అంతకుముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూనే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తమ పార్టీ చేసిన డిమాండ్‌ను తీర్చాలని నిరవధిక దీక్షకు పూనుకున్నారు. అటు బాబు ఇటు వైఎస్ జగన్ దీక్షల దెబ్బకు అదిరిపోయిన ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పరిహారాల చిట్టాను అటు టీవీల్లోనూ ఇటు పత్రికల్లోనూ ఏకరవు పెడుతోంది.
ఎంత చేసినా తాము చేసిన డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరిస్తేనే దీక్షను విరమిస్తామని తెదేపా అంటుంటే, కృష్ణానది తీరంలో 48 గంటల లక్ష్యదీక్షను చేస్తున్న జగన్ దీక్ష మాత్రం రైతులకై చేసేదిగా కాక రాజకీయ దీక్షగా మారిందనే అపప్రదను మూటగట్టుకుంటోంది. మొత్తమ్మీద తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసమే బాబు - జగన్‌లు ఈ "దీక్ష"ల నాటకాలాడుతున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. మరి ప్రజల మాటేమిటో...?!!

జగన్మోహన్ 'లక్ష్యదీక్ష' ఎఫెక్ట్: కాంగ్రెస్ వెన్నులో వణుకు!!!

ఆయన పేరు వైఎస్.జగన్మోహన్ రెడ్డి. దివగంత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు. వైఎస్ జీవించి ఉన్నంత వరకు తండ్రిచాటు బిడ్డగానే పెరిగారు. బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డి త్యాగం, తండ్రి ప్రోత్సాహంతో కడప పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబ వారసుడిగానే కాకుండా, రాజకీయ వారసుడిగా తెరచాటున ఎదుగుతున్న సమయంలో తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 

వైఎస్ హఠాన్మరణంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఒక్కసారి మారిపోయాయి. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల సంఖ్యలో తనువు చాలించారు. వీరి కుటుంబాలను ఆదుకునేందుకు తాను చేపట్టాల్సిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అంది. అయినా.. ఓదార్పు యాత్రను కొనసాగించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టాలను చవిచూశారు. 
చివరకు తన బాబాయ్‌కు మంత్రిపదవి ఆశచూపి వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నింది. దీంతో తన ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించారు. తన తల్లితో కూడా రాజీనామా చేయించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. మరో 30 లేదా 45 రోజుల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతలో రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 
ఈ వర్షాలధాటికి రైతాంగానికి అపారనష్టం వాటిల్లింది. రైతుల పరామర్శ పేరుతో ప్రజల మధ్యకు వెళ్లిన జగన్.. రైతుల పడే కష్టాలు చూసి చలించి పోయారు. అక్కడికక్కడే రైతుల పక్షాన 48 గంటల పాటు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సమయం రానే వచ్చింది. విజయవాడ పట్టణంలోని కృష్ణానదీ తీరం లక్ష్య దీక్షకు వేదికగా నిలిచింది. 
దీనికి రాష్ట్ర ప్రజలు, రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిన్నమొన్నటి వరకు తెరచాటున ఉండి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు లక్ష్యదీక్ష వేదికపై ప్రత్యక్షమయ్యారు. అలా.. ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు వేదికపైకి వచ్చారు. వీరిలో ఒకరిద్దరు తెదేపా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఈ సంఖ్య మరో 50 మందికి చేరుకోవచ్చని అంచనా. ఇది కాంగ్రెస్ అధినాయకత్వం వెన్నులో వణుకు పుట్టించింది. ఎలాంటి పదవులు, అధికారంలేని ఒక సాధారణ వ్యక్తి వెనుక ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయింది. పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఒక వ్యక్తి వెంట ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండటమేమిటని ముక్కున వేలేసుకుంది. భవిష్యత్‌లో తలెత్తే పరిణామాలపై ఆరా తీసింది. 
ఆ తర్వాత ఆగమేఘాలపై రాష్ట్రానికి చెందిన ఎంపీల బృందం ప్రధానితో సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు 400 కోట్ల రూపాయలను అడ్వాన్స్ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్ష తొలి రోజునే తన లక్ష్యాన్ని కొంతమేరకు సాధించిందని చెప్పొచ్చు.

Tuesday, December 21, 2010

రైతులపట్ల తప్పు చేసినందుకే చంద్రబాబుకు అధికారం ఇవ్వలేదు: నారాయణ

విజయవాడ; రైతులపట్ల అప్పుడు తప్పు చేసినందువల్లే చంద్రబాబుకు అధికారం రాలేదు, అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేసి అధికారం కోల్పోనుందని సీపీఐ కె.నారాయణ అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లో నిరవధిక దీక్షకు దిగిన చంద్రబాబును సోమవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విజయవాడలో సీపీఐ 85 వ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన పామీదత్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబును అగౌరవపరిచే ఉద్దేశం లేదు

ఆయన మా జిల్లా నేత: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ; తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును అగౌరవపరిచే ఉద్దేశం ఎవరికీ లేదని ఆయన ఆరోగ్యం రీత్యానే ఆయనను అరెస్టు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేముందు విలేకరులతో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా, ముఖ్యంగా తన జిల్లాకు చెందిన నేతగా ఆయనంటే తనకెంతో గౌరవం ఉన్నదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి ఎంత గౌరవం లభిస్తుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే గౌరవం లభిస్తున్నదని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆయనను అరెస్టు చేసినప్పుడు పెనుగులాటలో ఏం జరిగిందో తనకు తెలియదని కిరణ్ అన్నారు. చంద్రబాబుతో తాను స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నించానని, 15 నిమిషాలు ఆయన ప్రక్కన ఉన్నవారు, సిఎస్ఓతో మాట్లాడానని, అయినప్పటికీ ఆయన లైన్‌లోకి రాలేదని కిరణ్ చెప్పారు. ఆరోగ్యమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా అవినీతిపై ప్లీనరీ సందేశాన్ని తుచ తప్పకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు చెందాల్సిన పథకాలు వారికే చెందాలని తాను ముఖ్యమంత్రి కాగానే తొలి పత్రికా సమావేశంలో ప్రకటించానని అన్నారు. వ్యవస్థను అవినీతి నుంచి ప్రక్షాళన చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే తగిన సమాచారం ఇవ్వమని పార్టీ కార్యకర్తలకు ప్లీనరీలోసోనియా పిలుపు ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు.కాగా పొగాకు, ప్రత్తి, పామాయిల్ ఇతర పంటలకు జరిగిన నష్టం గురించి రాష్ట్ర ఎంపిలు కెఎస్ రావు, రాయపాటి ప్రభృతులు తనను కలిశారని చెప్పారు. జౌళి శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి, సిసిఐ సిఎండితో కూడా చర్చించానని చెప్పారు. త్వరలో జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ కూడా కలుసుకుని తగిన పరిష్కారం సాధిస్తామని అన్నారు. 

Monday, December 20, 2010

శోభారాణి స్టైలే వేరు

చిరు వ్యాఖ్యలకు భిన్నంగా బాబు దీక్షకు మద్దతు
హైదరాబాద్; రైతుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ పీఆర్పీ అధినేత చిరంజీవి గుంటూరు పర్యటనలో మండిపడ్డారు. ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు కూడా దీక్షను తప్పుపట్టారు. కానీ ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ శోభారాణి మాత్రం దీనికి భిన్నంగా బాబు దీక్షకు మద్దతు తెలిపా రు. బాబు తలుచుకుంటే రైతుల డిమాండ్లు వీలైనంత త్వరలో తీరిపోతాయం టూ కితాబునిచ్చారు. 
చిరంజీవి, చంద్రబాబు కలిస్తే.. అంటూ సరికొత్త సమీకరణ ప్రస్తావన కూడా తెచ్చారు. గతంలోనూ అనేక సార్లు ఆమె పీఆర్పీ తీరును బహిరంగంగానే ప్రశ్నించిన సందర్భాలున్నాయి. అయితే తాజా వ్యవహారం పట్ల ఆ పార్టీ నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాగా.. తమ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించుకునే స్వేచ్చ ఉంటుందని గతంలో చిరంజీవి పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

రైతుకు న్యాయం జరిగేవరకూ నిరాహారదీక్ష ఆగదు,

రైతుకు న్యాయం జరిగేవరకూ నిరాహారదీక్ష ఆగదు,
నన్ను బలవంతంగా ఎత్తుకువచ్చారు,
ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం,
ప్రభుత్వపద్ధతిపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్; రైతు సమస్యలు తీరేవరకూ నిరాహారదీక్ష ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు స్పష్టం చేశారు. సోమవారం తె ల్లవారుఝామున పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకువచ్చారని, ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం అని ఆయన తీవ్రంగావిమర్శించారు.
నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రే మూడుసార్లు ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు తమ వ్యూహాన్ని వాయిదా వేసుకున్నారు. అనంతరం తెల్లవారుఝామున పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులమధ్య బాబును అరెస్టు చే సి నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.ఆస్పత్రిలో సైతం బాబు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష విరమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆయన త్రోసిపుచ్చారు. రైతులకు న్యాయం జరిగేవరకూ దీక్ష కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఆస్పత్రినుంచే బాబు రైతులకు ఒక బహిరంగా లేఖ రాస్తూ ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని, తెలుగుదేశం మీ వెన్నంటి ఉంటుంది అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని సంఘటితంగా ఎదిరించి డిమాండ్లు సాధించుకుందాం అని కూడా ఆయన ఆ లేఖలో పిలుపు ఇచ్చారు.
హైడ్రామా నడుమ చంద్రబాబు దీక్ష భగ్నం, అరెస్టు
క్షీణించిన ఆరోగ్యం.. నిమ్స్‌కు తరలింపు
రైతు సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. అనంతరం అరెస్ట్ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణంచటంతో నిమ్స్‌కు తరలించారు. చంద్రబాబును తరలిస్తున్న సమయంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.నేతలు పోలీసులను అడ్డుకోవడంతో స్వల్ప లాఠీచార్జీ జరిగింది. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు గాయాలయ్యాయి. ఈ తోపులాటలో చంద్రబాబు తనయుడు నారాలోకేష్ నాయుడుని కూడా పోలీసులు ఈడ్చీవేశారు. దీంతో లోకేష్ నుదిటిపై స్వల్పగాయమయింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పోలీసులు నిర్లక్షంగా ప్రవర్తించడంతో ఆయనను స్ట్రెచర్‌పై తరలిస్తుండగా జారిపడ్డారు.బాబుపై ఐపీసీ సెక్షన్ 309 కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయగా, అరెస్ట్‌ను అడ్డుకున్నందుకుగాను నారా లోకేష్, దీక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి నుంచి దీక్షా శిబిరం వద్ద పోలీసులు జరిగిన ఘటనకు, అరెస్టులు, కేసుల నమోదుకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, సోమవారం రాష్ట్రవ్యాప్తబంద్‌కు పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు అరెస్ట్‌ను సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్ పార్టీ నేతలు ఖండించారు. ఈరోజు బంద్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నారాయణ, రాఘవులు, మందకృష్ణ మాదిగలు పిలుపు నిచ్చారు.

బాబు దీక్ష విరమించాలి: హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, ఇంతకన్నా నష్ట పరిహారాన్ని ఏ రాష్ట్రమూ చేయలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇకనైనా చంద్రబాబు తను చేపట్టిన నిరాహారదీక్షను విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని ఆమె స్పష్టం చేశారు. రైతుల మనోస్తైర్యం దెబ్బతినకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉందని ఆమె అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని సబితా ఇంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.

నా తండ్రి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండేదా: వైఎస్.జగన్ ప్రశ్న!!

తన తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బతికిబట్ట కలిగేదా అని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తన తండ్రి మండుటెండలో రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర పార్టీకి పునర్జీవం కల్పించారన్నారు. అందుకే 2004లో ప్రజలు పట్టంకట్టారన్నారు. ఆ తర్వాత ఆయన ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మెచ్చి 2009లో ప్రజలు మళ్లీ అధికారాన్ని అప్పగించారని జగన్ చెప్పుకొచ్చారు. సోమవారం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వల్లే కేంద్ర రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి ఎంతో కష్టపడటమే కాకుండా ప్రాణాలు కూడా వదిలారన్నారు. తన తండ్రి మరణాంతరం ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవడం ఆయన పుత్రునిగా తన ధర్మమన్నారు. అందుకే పావురాళ్ళ గుట్టపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించినా సహించానన్నారు. తన వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపించినా ఊరుకున్నానని అన్నారు. కానీ తన కుటుంబాన్ని చీల్చేందుకు సోనియా గాంధే స్వయంగా కుట్ర పన్నడాన్ని జీర్ణించుకోలేక పోయినట్టు చెప్పారు. గత ఏడాదిన్నర కాలంలో తనను, తన కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. వాటన్నింటినీ దిగమింగి పార్టీలోనే కొనసాగానన్నారు. అయితే, తన బాబాయికి మంత్రిపదవి ఆశచూపి తనను అణగదొక్కేందుకు ఎపుడేతే కుట్ర పన్నారో ఇక ఆ పార్టీలో కొనసాగరాదని నిర్ణయించుకుని బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. ఏదిఏమైనా.. మరో నెలరోజుల్లో మన పార్టీ వస్తుందన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో సొంత పార్టీపైనే పోటీ చేస్తామన్నారు. ఆ తర్వాత మూడేళ్లు ఓపిక పడితే తర్వాత 30 ఏళ్లు వైఎస్ రాజశేఖరుని పాలన అందించడమే కాకుండా, వందేళ్ళ పాటు వైఎస్ఆర్‌ను మర్చిపోకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అప్పటి వరకు కార్యకర్తలు, నేతలు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Sunday, December 19, 2010

21 నుండి వేద పండితులకు మౌఖిక పరీక్షలు

దేవాలయాల్లో వేదపండితుల నియామకానికి ఈ నెల 21 నుండి 28 వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక పరిషత్తు ఒక ప్రకటనలో తెలిపింది. మౌఖిక పరీక్షలకు హాజరు కాబోరు అభ్యర్థులు హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుమతి దేవస్థానానికి రావాలని కోరింది. అభ్యర్థులు www.apendowents.gov.. నుండి హాల్‌ టికెట్లను పొందవచ్చును.

Saturday, December 18, 2010

సీనియర్లూ.. నోరు మూసుకుని కూర్చోండి: కాంగ్రెస్ వార్నింగ్

మీలాంటి సీయర్ నేతల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇకపై నోరుమూసుకుని కూర్చోవాలని రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మీ మాటలు విని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని తాము తక్కువ అంచనా వేశామని పెద్దలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు చెవిలో జోరీగాలా కొంత మంది సీనయర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి అసత్యాలు చెప్పి వైఎస్‌ కుటుంబానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ జగన్‌పై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేయగా, దీన్ని ముందే గ్రహించిన జగన్ తానే స్వయంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. ఆ వెంటనే ప్రజల మధ్యకు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం.. జగన్ విషయంలో తప్పు చేసినట్టు గ్రహించి పునరాలోచనలో పడింది. జగన్‌పై సీనియర్ల మాటలు విని ఆయనను బయటకు సాగనంపేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినందుకు ఇప్పుడు బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో సీనియర్లకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఇకపై నోరు మెదిపితే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అందువల్లే నిన్నమొన్నటి వరకు రోజుకు రెండుమూడుసార్లు తమ నివాసాలకు విలేకరులను పిలుపించుకుని మీడియా ముందు ప్రగల్భాలు పలికిలి వారంతా ఇపుడు గుప్‌చిప్‌గా ఉన్నట్టుట సమాచారం. ఇలాంటి వారిలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, అమలాపురం ఎంపీ హర్షకుమార్‌తో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు శంకర్ రావు, సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంథా జగన్నాథం తదితరులు ఉన్నారు. ఇకపై జగన్ అంశంపై మీడియా ముందుకు ఎవరూ వెళ్లడానికి వీలులేదంటూ వీరికి కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసినట్టు ఆ పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి. అదేసమయంలో జగన్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వెనువెంటనే గ్రహించిన హైకమాండ్.. ఆయనతో రాజీ యత్నాలు చేసే దిశగా అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం.


రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికే అరిష్టం: వైఎస్.జగన్మోహన్


దేశానికి అన్నం పెడుతున్న రైతన్న కన్నీరు పెడితే రాష్ట్రానికే అరిష్టమని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో తలపెట్టిన సామూహిక దీక్ష యధావిథిగా కొనసాగుతుందని జగన్ ప్రకటించారు. ఇదే అంశంపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతు సమస్యలపై తాను చేసిన ఆచరణ సాధ్యమైన డిమాండ్లలో ప్రభుత్వం కొన్నింటినే పరిష్కరించిందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన పంటనష్ట ప్యాకేజీ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. బాధిత అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఔదార్యాన్ని కనబర్చనందుకు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో లక్షలాది మంది రైతులు, నేతన్నలతో కలిసి సాముహిక దీక్షను యధావిథిగా కొనసాగించనున్నట్టు ప్రకటించారు. రైతులను ఆదుకునే విషయంలో దివంగత ప్రజానేత వైఎస్సార్ అనుసరించిన మార్గాలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శనీయమన్నారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమని ఆయన చెపుతుండేవారని జగన్ గుర్తు చేశారు. అందువల్ల రైతుల కష్టాలు తీర్చి, వారిని ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

అధికారం కోసమే చంద్రబాబు దీక్ష: చిరంజీవి మండిపాటు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మండిపడ్డారు. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగారని ఆయన ఆరోపించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఇప్పటికైనా ఆయన మానుకోవాలని చిరంజీవి హితవు పలికారు. చిరంజీవి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ నానాటికీ దిగజారి పోతున్న తన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు దీక్షకు దిగారన్నారు. తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు.. వ్యవసాయమే దండగ అని పేర్కొన్నారు. ఇపుడు రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకపోతే.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరి రైతులకు రూ.200 బోనస్ ఇవ్వాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని, అందువల్ల దీనిపై సమీక్ష చేసి కొత్త ప్యాకేజీని ప్రకటించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యలకు బాసటగా బాబు నిరవధిక దీక్ష


         రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు
        తిలకం దిద్ది హారతి ఇచ్చిన సతీమణి భువనేశ్వరి 
       రైతుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానంలో
      మార్పు రావాలని చంద్రబాబు డిమాండ్‌
      పసుపుమయమైన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌
ముందు ప్రకటించిన విధంగానే రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం ఇక్కడి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌(ఆదర్శ్‌నగర్‌)లో ప్రారంభించారు. ఉదయం 10.20 నిమిషాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఓ చెట్టు కింద దీక్షను ప్రారంభించగా, సంఘీభావంగా మరో పదిమంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు చంద్రబాబుతో పాటు దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు సతీమణి భువనేశ్వరి చంద్రబాబుకు నుదుట తిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చి దీక్షకు సాగనంపారు. తనయుడు నారా లోకేష్‌, కోడలు బ్రాహ్మణి, బావమరిది, లోక్‌సభ సభ్యుడు హరికృష్ణ చంద్రబాబు ప్రయాణించే వాహనం దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికారు. అక్కడినుంచి నేరుగా అసెంబ్లిdకి వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్ళి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావుకు ఘననివాళులర్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు వెంటరాగా, చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. పార్టీ సీనియర్లు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దనరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, విజయరామారావు, తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌, రేవంత్‌రెడ్డి, వై.ఎల్లారెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, అరవింద్‌కుమార్‌గౌడ్‌, వర్ల రామయ్య, గరికపాటి మోహన్‌రావు, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పిఎల్‌ శ్రీనివాస్‌, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు దీక్షా శిబిరంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వేలాదిగా నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరానికి తరలిరావడంతో ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అంతా పసుపుమయమైంది.

కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పులు రావాలి : చంద్రబాబు

నిరవధిక నిరాహారదీక్షలో కూర్చున్నాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు రావలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్‌ చేశారు. విధి లేని పరిస్థితుల్లో తాను గాంధీబాటలో నిరవధిక దీక్షలో కూర్చున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. రైతులను ఆదుకోవాలని గత ఏడు రోజులుగా అనేక విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోవడంతో విధి లేక దీక్ష బాట పట్టానని చంద్రబాబు పేర్కొన్నారు. శాంతియుత మార్గాన్ని ఎంచుకొని నిరాహారదీక్ష చేస్తున్నానని, కనీసం ప్రభుత్వంలో ఇప్పటికైనా మార్పు వచ్చి పేద రైతులను, ప్రజలను ఆదుకుంటుందన్న విశ్వాసం ఉందని ఆయన అన్నారు. వర్షాలు, తుఫాను, వాయుగుండం, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000, వాణిజ్య పంటలు పండించిన రైతులకు రూ.15,000 పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, భారత ఆహారసంస్థను తక్షణమే రంగంలోకి దింపాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో రైతాంగం ముందెన్నడూ లేనంతగా కష్టాల్లో ఉందని, చరిత్రలో ఎప్పుడూ రానంతంగా విపత్తు వచ్చిపడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాదిలోనే ఐదుసార్లు తుఫాన్లు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అరవై లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని చెప్పారు. మరోవైపు పంటలకు తెగుళ్ళు కూడా వచ్చాయని, అయితే తెగుళ్ళ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వరదల వల్ల పంటలన్నీ సర్వనాశనమయ్యాయని, రైతులకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, వరికి ఎకరాకు రూ.15,000 ఖర్చు పెట్టగా, వాణిజ్య పంటలకు రూ.30,000 నుంచి 40 వేల రూపాయలు ఎకరాకు రైతులు ఖర్చు పెట్టారని చంద్రబాబు చెప్పారు. పొగాకు, మిరప పంటలకు అయితే రూ.70 వేల నుంచి 80 వేలు ఖర్చుచేశారని, ఇందులో రైతులు కొంతమంది ఉండగా, కౌలుదారులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. వ్యవసాయంపై రైతులు ఖర్చు పెట్టే డబ్బే కాకుండా పదినుంచి ఇరవై వేల రూపాయలు కౌలుకు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన విపత్తు వల్ల రైతులు, కౌలుదారులు ఇద్దరూ పూర్తిగా మునిగిపోయారనీ, దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, వారి కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, చేతి వృత్తులు, కులవృత్తులు కూడా వర్షాల వల్ల బాగా దెబ్బతిన్నారని, వారిని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయాలకతీతంగా పోరాడుతున్నా..

తాను చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ఎటువంటి రాజకీయాలు లేవని, రైతులను ఆదుకునేందుకే ఈ దీక్షను ప్రారంభించానని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా తాము పోరాడుతున్నామనీ, రాజకీయ లబ్ధి ఎంతమాత్రం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేవని, తాము కోరుతున్నది న్యాయమైన డిమాండ్లు అని గుర్తుచేశారు. సున్నితమైన రైతు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ లక్ష్యసాధనలో ప్రతిఒక్కరు తనతో కలిసి రావాలని ఆయన కోరారు.

బాబు అరెస్టుకు యత్నం

అడ్డుకున్న ఎమ్మెల్యేలు లీ స్పీకర్‌ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్న

రైతుల సమస్యలపై ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నిరవధిక నిరాహారదీక్షలో కూర్చునేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును సెంట్రల్‌జోన్‌ పోలీసులు క్వార్టర్స్‌ ప్రధాన ద్వారం వద్ద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, రేవంత్‌రెడ్డి, ధూళిపాల నరేంద్ర అడ్డుకోవడంతో డీసీపీ అకున్‌ సబర్వాల్‌ వెనక్కి తగ్గారు. ఎన్‌టిఆర్‌ ఘాట్‌కు వెళ్ళి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి వస్తున్న సమయంలో చంద్రబాబును డీసీపీ సబర్వాల్‌ మరికొంత మంది పోలీసులు అడ్డుకొని అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో అక్కడే ఉన్న కేశవ్‌, రేవంత్‌లు చంద్రబాబు వాహన శ్రేణి వద్దకు చేరుకొని తమ నేతను అరెస్టు చేసే అధికారం లేదంటూ ఆయనకు తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ప్రాంతమని, ఈ ప్రాంతం శాసనసభ స్పీకర్‌ పరిధిలో ఉంటుందని, ఒకవేళ అరెస్టు చేయాలంటే స్పీకర్‌ నుంచి అనుమతి తీసుకురావాలని ఎమ్మెల్యేలు డీసీపీకి చెప్పడంతో ఆయన చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. చంద్రబాబు దీక్షకు సంబంధించిన వార్తలను సేకరించేందుకు వచ్చిన పాత్రికేయులను, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు రంగప్రవేశం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చేందుకు సంబంధించిన ఓబి వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనికి అనుమతించమని పోలీసులు హెచ్చరించడంతో పార్టీ నేతలు అడ్డుకొని ఇదెక్కడి నిబంధనలు అంటూ దుయ్యబట్టారు. తమకు ఎలాంటి షరతులు వర్తించవని, ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారని, ఎటువంటి అనుమతి లేకుండానే తాము దీక్షను ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని పచ్చిక బయళ్లలో నిరవధిక దీక్షను ప్రారంభించిన చంద్రబాబు ఆ తర్వాత దీక్షకు సంబంధించి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడంతో ఆయన మూడు గంటల తర్వాత ఆ ప్రాంతానికి మారారు. దీక్ష చేసేందుకు అనువైన పెద్ద వేదికను పార్టీ సీనియర్లు గరికపాటి మోహన్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, యనమల రామకృష్ణుడు తదితరులు ఏర్పాటు చేయించారు. తనను చూసేందుకు వచ్చే పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను క్యూ ద్వారా వచ్చే ఏర్పాట్లను ప్రత్యేకంగా చేశారు. నిరాహారదీక్ష సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఎన్‌ఎస్‌జి రక్షణను కూడా పటిష్టం చేశారు. బయట నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి శిబిరానికి పోలీసులు పంపిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Friday, December 17, 2010

రైతు సమస్యలపై నేటినుంచి బాబు దీక్ష

రైతాంగ సమస్యలపై అందరూ అనుకున్నట్లే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారో లేదో..ఆరోగ్యం సహకరిస్తుందో లేదో ఈ వయస్సులో దీక్ష చేపట్టడంపై పునరాలోచించుకోండంటూ పార్టీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. గురువారం శాసనసభ సమావేశాలు ముగిశాక నిరవధిక దీక్ష చేపట్టే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలతో అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు సుదీర్ఘంగా సమాలోచన చేశారు. అనంతరం సమావేశం వివరాలను టీడీ ఎల్పీలో సీనియర్లు కే. యర్రన్నాయుడు, వేణుగోపాలాచారిఎల్‌. రమణ, దాడి వీరభద్రరావు, పల్లె రఘు నాథరెడ్డిలు విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం సచివాలయం సమీపంలో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చంద్రబాబు సహా పలువురు సీనియర్‌ నేతలు ఉదయం 10.30 గంటలకు నిరవధిక నిరహార దీక్ష చేపడతారన్నారు. మిగిలిన నేతలు రోజుకు కొందరు చొప్పున దశల వారీగా దీక్షలో చేరుతారన్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చుంటారని యర్రన్నాయుడు తెలియజేశారు.దీక్ష కూర్చోడానికి ముందుగా చంద్రబాబు తొలుత అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి, ట్యాంక్‌బండ్‌ వద్ద నున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిస్తారని, అక్కడి నుండి హుస్సేన్‌ సాగర్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు ఆయన శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుండి నేరుగా ఆదర్శ్‌నగర్లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని నిరవధిక నిరాహార దీక్షను చేపడతారని యర్రన్నాయుడు వెల్లడించారు. దీక్షకు ముమ్మరంగా ఏర్పాట్లుచంద్రబాబు దీక్షకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. రాష్ట్ర జాతీయ మీడియా కవరేజీలో నిమగ్నం కానుండడంతో నేతలు టీవీ ఛానళ్ల ప్రతనిధులకు సంపూర్ణ సహకారాలు అందించేం దుకు కృషి చేస్తున్నారు. దీక్షకు వివిధ జిల్లాల నుండి తరలి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు తమ వాహనాలను ఇందిరాపార్కు వద్ద నున్న ఎన్టీఆర్‌ స్టేడియంలో పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే దీక్షకు తరలి వచ్చే వారు బస చేసేందుకు ఇందిరాపార్కు వద్దే ఉన్న పలు కళ్యాణమండపాలను బుక్‌ చేశారు. భోజనం ఇతర సౌకర్యాలను పార్టీ నేతలు చూసుకుంటున్నారు.కాగా మీడియాను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి అనుమతిస్తారా ? లేదా అన్న విషయంపై ఇంకా సందిగ్థం వీడలేదు. ఇది వరకు తెలంగాణ జేఏసీ కార్యాలయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉండడం, మీడియా లైవ్‌ టెలికాస్ట్‌ చేసే ఓబీ వాహనాలను ఆదర్శ్‌నగర్‌ ప్రధాన రోడ్డుపైనే నిలుపడంతో అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌ వద్ద ఓబీ వాహనాలు నిలిపేందుకుగానీ వీల్లేదంటూ అక్కడ నిషేధాన్ని విధిం చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీక్షపైనా ప్రభుత్వం అదే విధానం అనుసరిస్తే టీవీ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాల సంగతేంటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలకు వినియోగించే ఓబీ కార్లను అక్కడ నిలిపేందుకు అనుమతించక పోతే ఏంటన్న అంశంపైనా నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరుపు తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుండి సచివాలయం వరకు ఓఎఫ్‌సీ కేబుల్‌ వేసి సెక్రటేరియట్‌ నుండి ప్రత్యక్ష ప్రసారా లను అందించే విధంగా ఏర్పాట్లు చేయవచ్చంటున్నారు.

నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ...

నటీనటులు: విక్టరీ వెంకటేష్‌, అనుష్క, కమలినీముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌, శరత్‌బాబు, ప్రభ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌. నారాయణ, రక్ష, పూనమ్‌కౌర్‌, సుజ తదితరులు. కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: రమా రాజమౌళి, విజువల్స్‌: విన్‌సెంట్‌ స్టూడియో, సంగీతం: గురుకిరణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వాసు, నిర్మాత:బెల్లంకొండ సురేష్‌. పాయింట్‌: చనిపోయిందనుకున్న చంద్రముఖి మళ్ళీ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళిపోయింది. అన్నది పాయింట్‌. మొదటి పార్ట్‌ చంద్రముఖి చూసిన ఫీలింగ్‌తో ఈ సినిమా చూస్తే అంతగా అనిపించదు. ఏదో మిస్‌ అయిందనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్‌గా రజనీకాంత్‌ నటన, మాడ్యులేషన్‌, లకలకలక.. అనే పదాలు తెలీని వైబ్రేషన్‌ ప్రేక్షకుడిలో క్రియేట్‌ చేసింది. నాగవల్లిలో వెంకటేష్ మాడ్యులేషన్‌.... 'ఔరా ఔరా..' అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాగవల్లి ఎవరు? అనేది సస్పెన్స్‌ కలగజేయడంలో దర్శకుడు బాగానే చేశాడు. టోటల్‌గా విక్టరీ వెంకటేష్‌ 25 సంవత్సరాల కెరీర్‌లో కొత్తగా చేసే ప్రయత్నంలో అతను బాగానే చేశాడనే చెప్పాలి. కథ: చంద్రముఖి పెయింటింగ్‌ గాలిలో కొట్టుకుంటూ వచ్చి ఓ పెయింటర్‌కు దొరుకుతుంది. దాన్ని ఇంటిలో తీసుకుని పెట్టుకుంటాడు. తనదికాని దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య అడిగితే దానికి ససేమిరా అంటాడు. అయితే అతను తెల్లారేకల్లా చనిపోయి వుంటాడు. ఈ పెయింట్‌ను ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. కట్‌చేస్తే.... విజయనగర సంస్థానదీశుల వారసులైన శరత్‌బాబు ప్యాలెస్‌కు చేరుతుంది. ఆమె కుమార్తె కమలినీముఖర్జీ నాట్యశాస్త్ర పోటీల్లో బహూమతిగా ఇస్తారు. దాన్ని తెస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు.ఇదిలాఉండగా, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. తనింటిలో 34 అడుగుల పాముందని తెలుసుకుని ఆఖరికి ఓ స్వామిజీ దగ్గరకు వెళతాడు. అతను మీ ఇంటి సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. అయితే... ఇటువంటి సమస్యను సాల్వ్‌ చేసే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఉన్నారంటూ.. డా|| ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు. ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను పిలిపిస్తారు. అతను వచ్చినప్పటి నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటి తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు. అయితే ఈ క్రమంలో శరత్‌బాబుకున్న మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరిని చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడు. అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు. తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా|| విజయ్‌ ఎలా కనిపెట్టాడు? చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది? అన్నది కథ.ఈ చిత్రంలో డాక్టర్‌గా, రాజుగా, అఘోరాగా విక్టరీ వెంకటేష్‌ నటించాడు. మూడు భిన్నమైన పాత్రల్ని పోషించాడు. 'రాజును చూసిన కళ్ళతో మొగుడ్నిచూసి మొత్తినట్లు...'అన్న సామెత చందంలా రజనీకాంత్‌ను చూసిన కళ్ళతో వెంకటేష్‌ను చూడలేకపోయారు ప్రేక్షకులు. కానీ వెంకటేష్‌ నటన బాగుంది. 'చుమ్మా... అనే పదం ఆయన్ను అనుసరించినట్లుంది. అసలు సినిమా మొత్తం చంద్రముఖిని చూసినట్లే ఉంది. కొత్తగా కన్పించింది మాత్రం నటీనటులే.కమలినీ ముఖర్జీ నాట్యంలో బాగా రాణించింది. శ్రద్దాదాస్‌ పాత్ర నామమాత్రమే. చంద్రముఖిగా అనుష్క చేసినా... ఆమె డాన్స్‌ సరిగ్గా చేయలేక పోవడం మైనస్‌గా ఉంది. నాగవల్లి పాత్రలో రిచా గంగోపాధ్యాయ అమరింది. దెయ్యంగా ఆమె చేసిన హావభావాలు కుదిరాయి. బ్రహ్మానందం కామెడీ సపోర్ట్‌గా ఉంది. స్వామీజీగా చంద్రముఖిలో చేసిన కన్నడ నటుడే చేశాడు. ముఖ్యంగా సౌండ్‌ ఎఫెక్ట్‌ చిత్రానికి కీలకం. ఛాటో కె. నాయుడు కెమెరా పనితం బాగుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి. పాటలపరంగా అన్నీబాగానే ఉన్నాయి. 25 ఏళ్ళ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని.. 'అభిమానులు లేనిదే హీరోలు లేరురా.. అనుచరులు లేనిదే లీడర్లు లేరురా..' రాసిన పాట పర్వాలేదు. గురుకిరణ్ సంగీతం సరిపోయింది. ముఖ్యంగా చెప్పాల్సింది వాసుగారి దర్శకత్వం.. స్క్రీన్‌ప్లే.... చంద్రముఖి నాగవల్లిగా ఎలామారిందనే పాయింట్‌ను చెప్పే క్రమంలో లింకులు బాగున్నాయి. కానీ, చివరికి వచ్చేసరిక స్క్రీన్‌ప్లే తేలిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. సమస్యను సాల్వ్‌ చేయాల్సిన డాక్టర్‌ విజయ్‌ చేయకపోవడమే కాక... ఏదో అదృశ్య శక్తి వచ్చి సాల్వ్‌ చేస్తుంది. అది ఎలా అనేది క్లారిటీ లేదు. మహిళా ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

జగన్‌ చుట్టూ ఐటి ఉచ్చు సో'నయా' అస్త్రం

 ప్రఅకస్మాత్తుగా రంగంలోకి దిగిన ఆదాయపు పన్ను శాఖ జగన్‌కు చెందిన 15 కంపెనీలపై దృష్టిరాజకీయంగా చెక్ పెట్టేందుకే సోనియా నిర్ణయం జగన్‌ విశ్వసనీయతనుశ్నార్ధకం చేయడమే లక్ష్యం...?
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు, ఎంపి పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసి 2జి స్కామ్‌ పాత్రధారిగా అపవాదు మూటగట్టుకున్న ఎ.రాజా, ఆయన సన్నిహితుల ఇళ్లపై సిబిఐ వరుస దాడులు నిర్వహించిన నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న యువనేత జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారానికి కూడా చెక్‌ పెట్టేయాలని, తద్వారా రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఇమేజ్‌ను దెబ్బతీసి జనంలో ఆయనకున్న విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేయాలన్నదే కాంగ్రెస్‌ అధిష్టానం ఎత్తుగడగా చెబుతున్నారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ మీడియాలో గురువారం విస్త్రతంగా ప్రసారాలు సాగాయి.డిఎంకె మిత్రపక్షమైనప్పటికీ, తలనొప్పిగా మారిన ఆ పార్టీకి చెందిన రాజాను ఇంటికి సాగనంపడంలో కాంగ్రెస్‌ చొరవ తీసుకుంది. అంతేకాకుండా, సిబిఐ దాడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అవినీతిని సహించేది లేదని, అవినీతికి ఎవరు పాల్పడినా రాజా గతే పడుతుందని స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యుపిఎ చైర్‌పర్సన్‌సోనియాగాంధీకృతకృత్యులయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా పరిణమించారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే, కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగలేదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం సీనియర్‌ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల ఆయన్ని తప్పించి స్పీకర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సిఎం పీఠంపై అధిష్టానం కూర్చొబెట్టింది. అప్పటివరకు మౌనంగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి, తన మీడియా ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి పైనే ఎదురుదాడికి దిగారు. దీంతో కాంగ్రెస్‌ అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించింది. జగన్మోహన్‌ రెడ్డి పినతండ్రి వివేకానందరెడ్డికి రాష్ట్ర కేబినెట్‌లో స్థానం కల్పించి సమరానికి సిద్ధపడింది. అప్పటివరకు చేస్తున్న ఓదార్పు యాత్రలను కొనసాగించేందుకే జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు సంభవించే ముప్పేమీ లేదని గ్రహించిన ఆయన అనుచరవర్గం పార్టీలో ఉంటూనే, జగన్‌తో ఓదార్పు యాత్రల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే, జగన్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం ఆదాయపు పన్ను అస్త్రాన్ని ఎంచుకుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒక్కసారిగా ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడం రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించింది. జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని వివిధ మార్గాల్లో అక్రమంగా కోట్లాది రూపాయిలను ఆర్జించారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు ఎప్పటినుంచో అధిష్టానానికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే, యువనేతను కట్టడి చేసి పార్టీ పటిష్టతకు ఉపయోగించుకోవాలని రాజశేఖరరెడ్డి అభిమానులు మరోవైపు కోరుతుండడంతో అధిష్టానం వేచి చూసే ధోరణిని అవలంభించింది. చివరకు జగన్‌ తనదారి తాను చూసుకోవడంతో ఇక రాజకీయంగా కూడా ఢిల్లిd నేతలు ఎదురుదాడి చేయాలని, రాష్ట్రంలో కిరణ్‌ ప్రభుత్వానికి ఎటువంటి తలనొప్పులు లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం.ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగినట్టు భావిస్తున్నారు. జగన్‌కు చెందిన 'సాక్షి' మీడియా సంస్థలతో పాటు, భారతి సిమెంట్‌, తదితర 16 కంపెనీల లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పట్టిపట్టి చూస్తోంది. ఆయా కంపెనీలకు పెట్టుబడులన్నీ ఒకే దారిలో అంటే షేర్ల రూపంలో వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన కంపెనీలన్నింటిపైనా గత ఏడాదిగా నిఘా ఉంచినట్టు సమాచారం. అంతేకాకుండా, జగన్‌ గత ఏడేళ్లుగా కడుతున్న పన్నుల మొత్తం ఏవిధంగా ప్రతిఏటా విపరీతంగా పెరిగిందీ కూడా ఆదాయపను పన్ను శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. షేర్ల రూపంలో జగన్‌ కంపెనీల్లోకి వచ్చిపడిన భారీ మొత్తాలను చూసి అధికా రులు అవాక్కైనట్టు సమాచారం. సాంకేతికంగా అది ఎలా సాధ్యపడినప్పటికీ, అంత పెద్ద మొత్తాలను ఆయా కంపెనీలు జగన్‌ కంపెనీల షేర్లు కొనాల్సిన అగత్యంపై కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాంకీ, మ్యాట్రిక్స్‌, సరస్వతి పవర్‌, పివిపి, హెటిరో హెల్త్‌ కేర్‌, జగతి పబ్లికేషన్స్‌, క్లాసిక్‌ రియాల్టిd, తదితర కంపెనీల్లో పెట్టుబడులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. 2010 ఏడాదికి సంబంధించి 81 కోట్ల ముందస్తు పన్ను చెల్లింపు పైనా దృష్టి పెట్టారు. 2003-2004లో కేవలం తొమ్మిది లక్షల 91 వేల 951 రూపాయిలను తన ఆస్తిగా చూపిన జగన్‌, భారతి సిమెంట్స్‌ కంపెనీ నుంచి 50 శాతం షేర్లను పార్ఫిసిమ్‌ అనే ఫ్రెంచ్‌ కంపెనీకి రూ.3053 కోట్లకు అమ్మి రూ.416 కోట్ల లాభాన్ని ఆర్జించడంపై వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే జగన్‌ కంపెనీల్లో పెద్ద మొత్తాలను వెచ్చించి షేర్లు కొన్న కంపెనీలకు నోటీసులను జారీ చేయడం తెలిసిందే.కాగా, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన సమర్పించిన ఆదాయపు పన్ను డిక్లరేషన్లను ఆ శాఖ అధికారులు పరిశీలిస్తే అందుకు కాంగ్రెస్‌ ఎలా బాధ్యత వహిస్తుందని అంటున్నాయి. ఆయనపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాయి. అయితే, తమ నేత ఆదాయపు ప న్ను శాఖ నుంచి దాచిందేమీ లేదని, ఎప్పటికప్పుడు ముందస్తు పన్నుతో సహా చెల్లిస్తున్నారని జగన్‌ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితో కూడుకున్నదేనని, అయినప్పటికీ జగన్‌ ఇమేజ్‌ను ఏవిధం గానూ దెబ్బతీయలేరని వారు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు.