జీసెస్ రూమ్

కులము కులము అంటూ కూడికలు ఎందుకు ?
మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ?
సమానత్వమనే భావనతో సరి తూగలేరా ?
వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ?
నువ్వొచ్చినాక పుట్టలేదు ఈ కులము 
నువ్వు పోయేటప్పుడు నీ వెంట రాదు ఏ మతము 
అన్ని దేశములలో గొప్పది కదా మన దేశము 
భిన్నత్వంలో ఏకత్వమున్న ప్రాంతీయ దేశము 
పరాయివాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటుంటే
కులమంటూ నొచ్చుకుంటూ నీవు - ఈ వెలివేత ఎందుకు ?
జాతులెన్ని ఉన్నా మన నీతి ఒకటేకదా 
భాషలెన్ని ఉన్నా వాటి భావం ఒకటే కదా 
తెలియనిది ఏముంది నీకు ?
మనుషులమే కదా మనసు పెట్టి చూడు 
తరతరాలుగా ఈ కులగజ్జి ఎందుకు ?
ఇష్టంగా నీ ఆత్మీయతను పంచి చూడు 
ఐకమత్యము మనమెరిగిన మతము 
మానవత్వము మనలోని సుగుణము  
ఏ కులమూ గొప్ప కాదు 
ఏ మతమూ అధికము కాదు 
మనదంతా ప్రజాకులము 
మనమంతా మనుషులము 
స్వార్డంతో కూడియున్న  కులపిచ్చిని వదలండి
వెర్రితత్వంతో  మగ్గియున్న మతపీడను మానండి
అందంగా ఆలోచించగల హృదయం మనది 
అందరం ఒక్కటే అని మరువకండి 
  




















































క్రిస్టమస్


క్రిస్టమస్
క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7 న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
 ఫ్రెండ్స్ మీ అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలా ఇలా చేరి క్రిస్మస్ పండుగ రానే వచ్చేసింది. ఇక నుంచి అందరు క్రిస్మస్ హడావిడిలో మునిగిపోతారు. ఆమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో అయితే ఇంకా ముందుగానే క్రిస్మస్ సంభరాలు మొదలైపొయాయి. ఇక నుంచి మనం కొత్త బట్టలు కొనడం, క్రిస్మస్ కేకులు తయారుచేయడం,పిండివంటలు చేయడం,క్రిస్మస్ తాత వేషాలు వేసి క్యారల్స్ తిరగడం చాలా సంతోషంగా ఉంటుంది. మన పాపాలను కడగడాని కొరకు అయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఎన్నొ శ్రమలను అనుభవించి మన కొరకు శిలువలో ఆయన ప్రాణాలను విడిచాడు. కనుక మనము ఆయన జన్మ దినాన్ని చాలా సంతోషంగా ఆనంద భరితంగా జరుపుకుందాం. 
క్రిస్మస్ రహస్యం

ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించు పండు గ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనా అని అర్ధం. డిసెం బర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తా రు. మొట్టమొదటి సారిగా క్రిస్మస్ అను మాట క్రీ.శ. 1038లో ప్రాచీన ఇంగ్లీషులో కనుగొనబడింది. అయితే యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించాడా? సర్వశక్తిమంతుడైన దేవుడు క్రిస్మస్ అను పండుగను ఆచరించమని ఆజ్ఞాపించినాడా? మరి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?
        సత్యం ఏమిటంటే మొట్టమొదటి క్రైస్తవులు(యేసు క్రీస్తు యొక్క శిష్యులు) పుట్టినరోజు పండుగ లను పాటించలేదు. అలాగే యేసు క్రీస్తు జన్మదిన పండుగను కూడా ఆచరించలేదు. క్రైస్తవశాస్త్రం క్రీ.శ. 185-232 ప్రకారం "పాపాత్ములు మాత్రమే జన్మదినా న్ని పండుగలాగా ఆచరించినట్లు దేవునివాక్యంలో ఉంది". క్రీస్తు జన్మించినప్పుడు కొందరు గొర్రెల కాపరు లు రాత్రివేళ పొలములో తమ మందను కాచుకొనుచు న్నట్లు( లూకా 2:8) దేవుని వాక్యం చెపుతుంది. ఇశ్రాయేల్ దేశంలో అక్టోబర్ నెల నుండి బాగా చలి మరియ వర్షాకాలం. చలికాలంలో అక్కడ బాగా వర్షాలు కురుస్తా యి. అక్టోబర్ నెల వరకు గొర్రెల కాపరులు తమ మందలను పొలములలో కొండలలో మేపేవారు. కనుక క్రీస్తు డిసెంబర్ 25న జన్మించడానికి వీలులేదు. మరియు క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడని దేవుని వాక్యంలో ఎక్కడ వ్రాయబడలేదు. అయితే మరి క్రీస్తు పుట్టుకకు డిసెంబర్ 25కు ఉన్న సంబంధం ఏమిటి?
క్రైస్తవ మతము
             చరిత్ర ప్రకారం క్రీస్తు మరణించిన తరువాత 300 సంవత్సరాల వరకు క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉండి చాలా శ్రమలకు హింసలకు గురిఅయి నారు. అనేక ప్రభుత్వాల చేత హింసింపబడినారు. అయితే క్రీ.శ. 313 లో "కాన్ స్టాన్ టైన్" అనే రోమా చక్ర వర్తి క్రైస్తవ మతమును అంగీకరించిట వలన క్రైస్తవుల పరిస్థితి మారిపోయింది. ఈ చక్రవర్తి కాలం నుండి క్రైస్తవ్యము పెద్ద ఎత్తున పాశ్యత్య దేశాలలోకి పాకిపో యింది. స్థిరపడి పోయింది. "కాన్ స్టాన్ టైన్" కు ముందు వందల సం|రాల క్రితం నుండి రోమా సామ్రాజ్యము వారి మత పండుగలు ఆచరించేవారు. వారి మతంలో (బబులోను మతం) డిసెంబర్ 17-23 వరకు సాటర్నలియా(SATURNALIA) అనే పండుగను ఆచరించేవారు. ఈ పండుగలో ఒకరికొకరు కానుకలు(గిఫ్టులు) ఇచ్చుకొని సంతోషించేవారు. తరువాత డిసెంబర్ 25న మిత్రా(MITHRA) అనే పేరుగల దేవుని జన్మదిన పండుగ ను ఆచరించేవారు. మిత్రా అంతే నీతిమంతుడైన సూర్య భగవానుడు అని వారి అర్ధం. అంతేకాకుండా రోమియుల నూతన సంవత్సరం పండుగ (జనువరి 1) ఆచరించేవారు. ఆ దినమున గృహాలు దీపాలతో అలంకరించుకొని గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొనేవారు(Encyclopedia Brtanica).ఇప్పటికి ఆచరింస్తున్నది ఈ పండుగే.
             రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యమును అంగీకరించక మునుపు రోమామతం(బబులోను మర్మపు మతం) ఈ పండుగలను ఆచరించేవారు. ఈ పండగలు క్రైస్తవ్యములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలుగా మార్చబడినాయి. ఈవిధంగా సూర్య భగవానుడు లేదా మిత్రా అను రోమా మత దేవుని జన్మదినం, డిసెంబర్ 25న క్రీస్తు ఆరాధనకు అంటే క్రిస్మస్ గా మార్చబడినది. ముందుగా తెలిపినట్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకొనె సాంప్రదాయం క్రీస్తు కంటే ముందుగానే ఉన్నది. అయితే తూర్పుదేశపు జ్ఞానులు రాజును దర్శించడానికి వచ్చారు కనుక కానుకలు తెచ్చారు. అయితే ఇది ఇచ్చిపుచ్చుకొనె సందర్బం కాదు. కేవలం సమర్పించారు కాని పుచ్చుకొనలేదు. మరి శాంతక్లస్ లేదా St. నికోలస్ లేదా క్రిస్మస్ తాత మాటేమిటి? క్రిస్మస్ తాత రోమా మతంలో ఉన్న నిమ్రోదు అనే వ్యక్తి. ఇతని గురించి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నయి. "నికోలాయితుల బోధను క్రీస్తు ద్వేషించాడు"( ప్రకటన 2:15 ). ఆ బోధ క్రిస్మస్ తాతకు సంభందించిన బోధ.
        క్రిస్మస్ పండుగను ఆచరించువారు ఎన్నో రకరకాల కారణాలు చెపుతారు. " మేము డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినాన్ని గుర్తుచేసుకొని ఆరాధిస్తన్నాం" అని కొందరంటే " క్రీస్తు సువార్త ప్రకటించటానికి ఈ రోజును ఉపయోగిస్తున్నాం. మేము కేవలం క్రీస్తు జన్మదినాన్ని గౌరవిస్తున్నాం" మరికొందరు సాకులు చెపుతారు.
అబద్దబోధ
             యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించ లేదు. అసలు ఏ రోజున జన్మించాడో దేవుని వాక్యంలో లేదు. చరిత్రలో కూదా లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. యేసు క్రీస్తు తన జన్మదినమును పండుగ లాగా ఆచరించమని ఆజ్ఞాపించనూ లేదు. యేసు క్రీస్తు మొదటి శిష్యులు ఆచరించినట్లు దేవుని వాక్యంలో లేదు. క్రీస్తు తన మరణ దినాన్ని జ్ఞాపకం(1 కొరింథీ 11:24-27) చేసుకోమన్నాడు (ఇదీ ఈస్టర్ పండుగ కాదు) కాని జన్మదినాన్ని కాదు.
        క్రైస్తవులు యేసు క్రీస్తు నియమించిన మరియు ఆచరించమనిన ఆజ్ఞలు, పండుగలు విస్మరించి దేవుడు ఆజ్ఞాపిచనటువంటి వాటిని చేయుచున్నారు. "మనుష్యలు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్దముగా ఆరాధించు చున్నారు (మత్తయి 15:9)". మరియు యేసు ఇలా చెప్పె ను "ప్రభువా ప్రభువా అని నన్నుపిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందు న్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును (మత్తయు 7: 21)". కాబట్టి సత్యమును గ్రహించి నిజ దేవుని వైపు తిరిగి సత్యముతో దేవుని ఆరాధించవలెను. 
*************************************************

బైబిలు- విశ్లేషణ

రచయిత : బ్రదర్ ఆర్. ఇశ్రాయేలు

బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది. బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బైబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39, కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగా వేదకాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు. 1 పాత నిబంధన,2 కొత్త నిబంధన,3 కేథలిక్కు బైబిల్, 4 తెలుగులో బైబిలు [మార్చు]పాత నిబంధన బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు, ఆజ్ఞలు, సామెతలు, కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి: ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము, యెహూషువ,న్యాయాధిపతులు,రూతు, దానియేలు, కొత్త నిబంధన రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, I కొరంథీలకు పత్రిక II కొరంథీయులకు పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలొస్సైయులకుపత్రిక థెస్సలొనీకైయులకుపత్రిక ,II థెస్సలొనీకైయులకు పత్రిక, I తిమొతికి పత్రిక, II తిమొతికి పత్రిక, తీతుకు పత్రిక్, ఫిలేమోనుకు పత్రిక హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, I పేతురు పత్రిక, II పేతురు పత్రిక, I యోహాను పత్రిక, II యోహాను పత్రిక, III యోహాను పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంధము, [మార్చు]కేథలిక్కు బైబిల్, ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 14 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.

బైబిలు - పరిచయము

బైబిలు గ్రంధమును రెండు నిబంధనలుగా విభజింపవచ్చును. మొదటిది పాతనిబంధన, రెండవది క్రొత్తనిబంధన.
క్రీస్తుకు పూర్వపు సంగతులు పాతనిబంధనగా ఉన్నది.
క్రీస్తు జననము నుండి జరిగినవి క్రొత్తనిబంధనగా ఉన్నది.
పాత నిబంధన యందు 39
క్రొత్త నిబంధన యందు 27
మొత్తము 66 పుస్తకములు బైబిలు గ్రంధమందు ఉన్నది.
పాతనిబంధన గ్రంధము పంచకాండములు, చరిత్రలు, సామెతలు, కీర్తనలు, ప్రవక్తల గ్రంధములు అని మరల విభజింపబడినది.
పంచకాండములు : 5
చరిత్రలు : 13
కీర్తనలు : 1
సామెతలు, ఇతర రచనములు : 3
ప్రవక్తలు : 17
క్రొత్త నిబంధన గ్రంధము సువార్తలు, కార్యములు, పత్రికలు, ప్రత్యక్షతలు అని మరల విభజింపబడినది
సువార్తలు : 4
కార్యములు : 1
పత్రికలు : 21
ప్రత్యక్షతలు : 1
బైబిలు గ్రంధమును గూర్చిన పూర్తి విశ్లేషణ - ప్రాముఖ్య వ్యక్తులు - సంఘటనలు - వాస్తవాలు - పరిశీలనలు అనుభవపూర్వకముగా అందించబడుతాయి.

*****************************
క్రైస్తవ ప్రార్ధన

క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతాడు, కాగా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడేందుకు వీలు కలుగుతుందని క్రైస్తవుల నమ్మిక.బైబిల్లో పలు విధాల ప్రార్థనలు ప్రస్తావించ బడ్డాయి.తొలి మానవుడైన ఆదాము కుమారుడైన షేతుకు ఎనోషు అనే కుమారుడు పుట్టినప్పటినుండి యెహోవా నామమున ప్రార్థన చెయ్యటం ప్రారంభమైందని ఆదికాండం నాలుగో అధ్యాయం చివరి వచనంలో చెప్పబడింది.
బైబిల్లోని రెండో భాగమైన నవ నిబంధనలో యేసు క్రీస్తు శిష్యులు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించమని ప్రభువును అడిగినప్పుడు ఇలా ప్రార్తించమంటూ యేసు నేర్పిన ప్రార్థన "ప్రభువు ప్రార్థన" గా బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం ఎక్కడొ ఓ చోట ఈ ప్రార్థన ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ వ్యాసంలో "ప్రభువు ప్రార్థన"తో పాటు దానిపై ప్రొటెస్టంట్ ఉద్యమ నిర్మాణకుడైన ఆచార్య మార్టిన్ లూథర్ వివరణను ఇవ్వటం జరిగింది.
దేవుడ్ని పిలవటం
పరలోకమందున్న మా తండ్రీ
అర్ధం: ఆయనే మనకు నిజమైన తండ్రి అని, మనం ఆయన స్వంత బిడ్డలమని నమ్మటానికి ఈ మాటల్తో దేవుడు మనల్ని మ్రుదువుగా ఆహ్వానిస్తున్నాడు. అందుకనే ఇస్టమైన పిల్లలు తమ ప్రియమైన తండ్రిని గట్టి నమ్మకంతో, ధైర్యంగా అడిగినట్టు మనం ఆయనకు ప్రార్థన చేస్తాం.
మొదటి మనవి
నీ నామము పరిశుద్ధ పరచ బడును గాక
అర్ధం: దేవుని నామం ఎప్పటికీ పరిశుద్ధమైందే. అసలు ఆ నామంలోనే పరిశుద్ధత ఉంది. అయితే ఆ పవిత్ర నామాన్ని పరిశుద్ధ పరచేందుకు మనక్కూడా శక్తి కావాలని ఈ మనవిలో అడుగుతాం.
'నీ నామము పరిశుద్ధ పరచ బడును గాక''

:అర్ధం: దేవుని నామం ఎప్పటికీ పరిశుద్ధమైందే. అసలు ఆ నామంలోనే పరిశుద్ధత ఉంది. అయితే ఆ పవిత్ర నామాన్ని పరిశుద్ధ పరచేందుకు  మనక్కూడా శక్తి కావాలని ఈ మనవిలో అడుగుతాం.

దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచాలి?

:దేవుని వాక్యం స్పష్టంగా, సత్యంగా బోధించబడ్డప్పుడు, అలాగే మనం ఆయన బిడ్డల్లా వాక్యానుసారమైన పవిత్ర జీవితాన్ని గడపటంద్వారా దేవుని నామం పరిశుద్ధ పరచ బడుతుంది. పరలోకమందున్న మా ప్రియ తండ్రీ! ఇలా చెయ్యటానికి మాకు సాయంచెయ్యి. అయితే దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ అలా నడుచుకొనేవాళ్ళు దేవుని నామాన్ని మనమధ్య అవమాన పరుస్తున్నారు. పరలోకమందున్న ప్రియ తండ్రీ! అలా చెయ్యకుండ మమ్మల్ని కాపాడు.
రెండో మనవి===

''నీ రాజ్యము వచ్చును గాక!''

:అర్ధం: మన ప్రార్థనతో నిమిత్తం లేకుండానే దేవుని రాజ్యం దానంతటదే కచ్చితంగా వస్తుంది. అయితే ఈ విన్నపంలో ఆ రాజ్యం మన మధ్యక్కూడా రావాలని కోరుకుంటాం.

దేవుని రాజ్యం ఎలా వస్తుంది?

:మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మను దయచేసినప్పుడు దేవుని రాజ్యం మన మధ్యకొస్తుంది. కనుక ఆయన కృపను  బట్టి పరిశుద్ధ వాక్యాన్ని నమ్మి దైవ చిత్తానుసారమైన ఆ జీవితాన్ని ఇప్పుడు భూమ్మీద, నిరంతరం పరలోకంలో జీవిస్తాం.
మూడో మనవి===

నీ ''చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక''

:అర్ధం: మన ప్రార్థనతో నిమిత్తం లేకుండానే దేవుని కృపగల చిత్తం దానంతటదే నెరవేరుతుంది. అయితే ఆ దయగల చిత్తం మన మధ్యకూడా నెరవేరాలని ఈ విన్నపంలో వేడుకుంటాము.

దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది?

:దేవుని పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేస్తూ, ఆయన రాజ్యం రాకుండా ఆటంకపర్చే సాతాన్ని, లోకాన్ని, అలాగే మన పాప శరీరపు ప్రతీ దుష్ట పన్నాగాన్ని, ఉద్దేశ్యాన్ని ఆయన ఓడించి నాశనం చేసినప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. మనం బ్రతికినంత కాలం దేవుడు తన వాక్యంలో, విశ్వాసంలో మనల్ని బలపర్చి, స్తిరపరుస్తున్నప్పుడు ఆయన చిత్తం నెరవేరుతుంది. ఇదే ఆయన కృపగల చిత్తం, దయగల మనస్సు.
నాలుగో మనవి
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము
అర్ధం: మనం అడక్కుండానే ఆయన మనతోపాటు, చెడ్డవాళ్ళక్కూడా ప్రతిరోజూ ఆహారాన్నిస్తున్నాడు. ఈ నిజాన్ని మనం తెలుసుకొని, కృతజ్ఞతా పూర్వకంగా దాన్ని పొందే మంచి బుద్ది మనకివ్వాలని ఈ మనవిలో దేవుడ్ని వేడుకుంటాం.
అనుదినాహారమంటే ఏంటి?
మన శరీర క్షేమానికవసరమైన ప్రతిదీ అనుదినాహారమే. అంటే - మన అన్నపానాలు, బట్టలు, జోళ్ళు, ఇల్లు, సంసారం, పాడి పంటలు, డబ్బు, దైవభక్తి కలిగిన మంచి భార్య లేదా భర్త, పిల్లలు, మంచి పనివాళ్ళు, దేవుని భయం కలిగిన నమ్మకస్తులైన అధికార్లు, మంచి ప్రభుత్వం, చక్కటి వాతావరణం, శాంతి సమాధానాలు, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు, మంచి స్నేహితులు, నమ్మకస్తులైన పొరుగువాళ్ళు - వీటన్నిటినీ అనుదినాహారమనే అనొచ్చు.
[మార్చు]అయిదో మనవి
మా యెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమింపుము
అర్ధం: నిజానికి మనం అడిగే వాటిల్లో ఏ ఒక్కటి పొందటానిక్కూడా మనకు యోగ్యత లేదు, అడిగే అర్హతకూడా లేదు. ఎందుకంటే మనం ఏ రోజుకారోజు మరింతగా పాపం చేస్తూ, శిక్ష మాత్రమే పొందాల్సిన వాళ్ళమై ఉన్నాం. అయినప్పటికీ మన పరలోకపు తండ్రి మన పాపాలకేసి చూడకుండా, వాటినిబట్టి మన మనవుల్ని కొట్టెయ్యకుండా తన క్రుపను ప్రేమను చూపించి మన మడిగేవన్నీ ఇవ్వాలని ఈ మనవిలో కోరుకుంటాం. అలాగే మనం కూడా మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళని మన్స్ఫూర్తిగా క్షమించి సంతోషంగా వాళ్ళకి మేలు చేయాలి.
[మార్చు]ఆరో మనవి
మమ్ము శోధన లోనికి తేకుము
అర్ధం: నిశ్శయంగా దేవుడెవర్నీ పాపం చేసేలా శోధించడు. అయితే సైతాను, శరీర సంబంధమైన కోర్కెలు మనల్ని మోసం చెయ్యకుండా, అలాగే తప్పుడు బోధల వైపుకు, నిరాశలోకి, లజ్జాకరమైన మహా పాపంకేసి మళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడి తన కృపలో నిలిపి ఉంచాలని ఈ మనవిలో అడుగుతాం. ఒకవేళ వాటి చేత మనం శోధింప బడ్డప్పటికీ, శోధనలోంచి బయటపడి విజయాన్ని పొందటానికి శక్తి నివ్వమని ప్రార్థిస్తాం.
[మార్చు]ఏడొ మనవి
కీడు నుండి మమ్మును తప్పించుము
Add caption
అర్ధం: ముగింపులో - మన శరీరాత్మల్ని, ఆస్తిని, పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేసే ప్రతీ కీడు నుండి మనల్ని తప్పించి కాపాడాలని ఈ మనవిలో వేడుకొంటాం. చివరిగా, చావు గడియ వచ్చినప్పుడు దీవెనకరమైన మంచి మరణాన్నిచ్చి ఈ ఏడ్పుగొట్టు లోకంలోంచి పరలోకంలొ ఉన్న ఆయన దగ్గరికి కృపతో చేర్చుకోవాలని ఈ మనవిలో అడుగుతాం.
[మార్చు]దైవ స్తుతి
రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్!
అర్ధం: ఈ మనవులన్నీ పరలోకమందున్న మన తండ్రికి ఇష్టమైనవేనని, ఆయన వాటిని విన్నాడని కచ్చితంగా నమ్ముతాం. ఎందుకంటే ఇలా ప్రార్థన చెయ్యమని మన కాజ్ఞాపించిన దేవుడు తప్పకుండా వాటిని వింటానని ప్రమాణం చేశాడు. అందుకనే - “ఆమేన్” అంటే “అలాగే జరుగుతుంది”, అని చెప్పి మనం ప్రార్థన ముగిస్తాం.
ప్రతిరోజూ చేసే ప్రార్థనలు ఆచార్య మార్టిన్ లూథర్ చిన్న ప్రశ్నోత్తరి నుంచి
అత్యంత సులభమైన పద్ధతిలో ఇంటి యజమాని తన ఇంట్లో వాళ్ళందరికీ నేర్పించాల్సింది.
ప్రొద్దున్నే చేసే ప్రార్థన
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరి శుద్ధాత్మ యొక్కయు నామమున, ఆమేన్.
మా పరలోకపు తండ్రీ! గడిచిన రాత్రంతా సమస్త కీడుల్నుండి అపాయాల్నుండి నన్ను కాపడి నందుకు నీ ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను చేసే అన్ని పనులు, ఇంకా నా జీవితమంతా నీకు ఇస్టమైందిగా ఉండేలా ఈ రోజంతా ప్రతి విధమైన కీడు నుండి పాపం నుండి నన్ను కాపాడు. నా శరీరాత్మల్ని నాకు కలిగిన సమస్తాన్ని నీ చేతుల కప్పగిస్తున్నాను. కపట శత్రువుకు నా మీద ఎలాంటి అధికారం ఉండకుండా నీ పరిశుద్ధ దూతను నాకు తోడుగా ఉంచు. ఆమేన్.
సాయంకాలం చేసే ప్రార్థన
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, ఆమేన్
మా పరలోకపు తండ్రీ, ఈ రోజంతా నన్ను నీ కృపలో కాపాడి నందుకై నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా పాపాలన్నీ క్షమించి ఈ రాత్రంతా నీ కృపలో భద్రం చెయ్యి. నా శరీరాత్మల్ని నా కున్న సమస్తాన్నీ నీ చేతుల కప్పగిస్తున్నాను. కపట శత్రువుకు నా మీద ఎలాంటి అధికారం ఉండకుండా నీ పరిశుద్ధ దూతను నాకు తోడుగా ఉంచు. ఆమేన్!
దీవెన అడుగుతూ చేసే ప్రార్థన (భోంచేసేప్పుడు చెప్పుకోటానికి)
ఓ దేవా! అందరి కళ్ళూ నీవైపే చూస్తాయి. తగిన సమయంలో కావాల్సిన అహారాన్ని నువ్వు వాళ్ళకిస్తావు. ఇంకా నువ్వు గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి కోరికా తీరుస్తావు, ఆమేన్. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రీ నీ అపారమైన కృపలోంచి మేము పొందిన ఈవుల ద్వార మమ్మల్ని దీవించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అడుగుతున్నాం. ఆమేన్.
కృపావచనం
యోహోవాకు స్తుతి చెల్లించుడి. ఆయన ఉత్తముడు. ఆయన కృప నిరంతరముండును, ఆమెన్.
ప్రభువైన దేవా, పరలోకపు తండ్రీ, నీవిచ్చిన ఈవులన్నిటి కోసం నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంటున్నాం. ఆమేన్.
[మార్చు]ఇవికూడా చూడండి

అపోస్తలుల విశ్వాస ప్రమాణం
క్రైస్తవ మతము
వర్గం: క్రైస్తవ మతము
లోనికి ప్రవేశించండి / ఖాతాని సృష్టించుకోండివ్యాసముచర్చచదువుమార్చుచరిత్రని చూడండి


************************************************************************
దేవుని విశ్వసించినవాడు. దేవుడిని ప్రార్థించేవాడు పరిస్థితులు ఎంత విషమించినా ఓటమిని అంగీకరించడు. అతని నమ్మకమే ధైర్యమిస్తుంది. విజయాన్నిస్తుంది.ఓటమి ఎంతో కుంగదీస్తుంది. తాము ఊహించనిరీతిలో భయంకరంగా మోసపోయిన ఓటమిని ఎదుర్కోవాలంటే దుఃఖం సహజం. ఎలాంటి దారి కానరాని స్థితిలోను యేసు 'నేనే మార్గము' అంటున్నాడు. దేవుని మార్గంలో వెళ్లు - విజయం నీదే - రాజైన దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుందాం. దావీదు అతని జనులను మూడవ దినమందు సిగ్లకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదకు సిగ్లకు మీద పడి, కొట్టి దీన్ని తగులబెట్టి, ఘనులనేమి అల్పుల నేమి అందులోనున్న ఆడవారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయిరి. దావీదును అతని జమలును పట్టణములోనికి కొనపోబడి యుండుటయు చూచి, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికి ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నేను ఈ దండును తరిమిన యెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలసికొని తప్పక నీవారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. (1 సమూయేలు 30: 1విశ్వాసంతో అభయంపై ఉదంతంలో దావీదు అతని జనుల సిగ్లకులో ఎంత బాధ, దుఃఖము అనుభవించారో. దావీదును నమ్మి అతనితో వెళ్లినవారు తిరిగి వచ్చేసరికి తమ భార్యలు, పిల్లలు శత్రువులు చెరలోకి తీసుకొని వెళ్లడం చూశాక, ఎవరు మాత్రం దుఃఖానికి గురవరు? తమ ఆనందం కూలిపోయిందని అందరూ ఏడ్చారు. ఒక దశలో తమకు ఇంత దుర్గతి కలిగించిన తమ నాయకుడు దావీదునే రాళ్లు రువ్వి చంపాలనుకున్నారు. వారిలాగే దావీదు ఏడ్చాడు.చాలామంది ఎవరైనా ఏడిస్తే.. అది వారి బలహీనత అనుకుంటారు. హేళన చేస్తారు. ఇక్కడ దావీదు కూడా మిక్కిలి దుఃఖపడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ నిరాశకు గురవుతారు. అంతా పోయాక ఇంకేమి మిగిలి వుంటుందని వైరాగ్యానికి లోనవుతారు. కాని, అందరిలాంటి వాడు కాడు దావీదు. దేవుని విశ్వసించినవాడు. దేవుడిని ప్రార్థించేవాడు పరిస్థితులు ఎంత విషమించినా ఓటమిని అంగీకరించడు. అతని నమ్మకమే ధైర్యమిచ్చింది. ప్రయోజనం లేదని తెలుస్తున్నా తన నమ్మకాన్ని వదులుకోలేదు.
సర్వమూ దక్కింది!దేవుని నమ్మిన బిడ్డకు కష్టాలు రావొచ్చు. పరిస్థితులు భయంకరంగా ఉండవచ్చు. సర్వమూ కోల్పోయి ఉండవచ్చు. కాని, దేవుని నమ్ముకొన్నవారు ఓడిపోరు. దేవుని వద్ద విచారణ చేశాడు. తమ భార్యాపిల్లలను, పశుసంపదను కొల్లగొట్టిన వారిని తరిమితే దొరుకుతారా? అని. దేవుడు వెళ్లు - నీవు తప్పక నీ వారందరినీ దక్కించుకుంటావన్నాడు. 18, 19 వచనాలలో దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను.
మరియు అతని వారిని రక్షించుకొనెను. దావీదు పోగొట్టుకొన్నదానికన్నా ఎక్కువే పొందగలిగాడు. మనం దేవుని యెదుట మన ఓటమిని ఒప్పుకొని, దుఃఖపడితే, ఆయన మనం పోగొట్టుకున్న సమస్తాన్ని ఇస్తాడు. కొంచెంగా కాదు, సంపూర్తిగా! యేసులో నీ విశ్వాసం నిన్ను సమస్తమును పొందేలాగున - నీవు పోగొట్టుకున్న ఆనందం తిరిగి నీ హృదయం తట్టేలాగా చేస్తుంది. నిరాశ కాదు - యేసునందలి విశ్వాసం - నిన్ను ధైర్యవంతుడిని చేస్తుంది.


బ్లాగ్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు