Friday, December 3, 2010

శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీ ?

విశాఖపట్నం; ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీతో నడుపుతున్న బస్ సర్వీసులకు భక్తుల నుండి విశేష స్పందన కనిపిస్తోంది. రెండు వారాల నుండి ఇంతవరకు 54 బస్సు సర్వీసులను నడపగా తద్వారా 55 లక్షల రూపాయలకు పైబడి సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకుంది. భక్తుల రద్దీని బట్టి వారు కోరిన చోట నుండి 5,6,7,9 రోజుల పాటు ప్రయాణం సాగే యాత్రలకు బస్సులను అద్దె ప్రాతిపదికన అందజేస్తామని ఆర్టీసీ రూరల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎ.వీరయ్య చౌదరి  తెలిపారు. ఈ సత్వర యాత్ర వివరాలు, టిక్కెట్ చార్జీలు ఈ విధంగా ఉన్నాయి.ఐదురోజుల సత్వరయాత్రలో..విశాఖ నుండి విజయవాడ, మేల్‌మరుతూర్, ఎరుమెలి, పంబా సన్నిధానం, శ్రీపురం, తిరుపతి మీదుగా గమ్యానికి చేరుకోవడానికి టిక్కెట్ చార్జీ సూపర్ లగ్జరీ 2,500 రూపాయలు, డీలక్స్ 2,275 రూపాయలుగా నిర్ణయించారు.ఏడురోజుల యాత్రలో...విశాఖ, విజయవాడ, బెంగుళూరు, మైసూర్, గురువాయుర్, ఎరుమెలి, పంబా సన్నిధానం, తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, ద్వారపూడి, అన్నవరం, విశాఖపట్నం చేరడానికి టిక్కెట్ చార్జి సూపర్ లగ్జరీ 2900 రూపాయలు, డీలక్స్ 2,650 రూపాయలు చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.అదే విధంగా ఏడురోజుల మరో సత్వరయాత్రలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, పళని, ఎరుమెలి, పంబా సన్నిధానం, తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖపట్నానికి టిక్కెట్ చార్జి సూపర్ లగ్జరీ, డీలక్స్ 2650 రూపాయలుగా ఆర్టీసీ నిర్ణయించింది.ఆరు రోజుల యాత్రలో...విశాఖ, విజయవాడ, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమెలి, పంబా సన్నిదానం నుండి తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం మీదుగా విశాఖపట్నానికి చేరుకోవడానికి టిక్కెట్ చార్జి సూపర్ లగ్జరీ 2650 రూపాయలు, డీలక్స్ 2420 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
తొమ్మిది రోజుల యాత్రలో..విశాఖ, విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, గురువాయూర్, ఎరుమెలి, పంబా సన్నిధానం వరకు, తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నానికి టిక్కెట్ చార్జి సూపర్ లగ్జరీ 3,550 రూపాయలు, డీలక్స్ 3,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మండల యాత్రకు, మకర విళక్కు, మకరజ్యోతికి ప్రత్యేక ప్యాకేజీ టూర్ ప్రయాణించే వారు అద్దె ప్రాతిపదికన బస్సులు కావాల్సిన భక్తులు సమీపంలోని డిపోల్లోగాని, ద్వారకా బస్ కాంప్లెక్స్‌లోన శబరిమలై టూర్ ప్యాకేజీ రిజర్వేషన్ కౌంటర్‌లో సంప్రదించాలని డిప్యూటీ సి.టి.ఎం. వీరయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment