Friday, March 16, 2018

తెలుగు నూతన సంవత్సరం....

గాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాదిఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.ఉగాది”, మరియు యుగాదిఅనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగఅనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది”. ‘యుగముఅనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
కొత్త సంవత్సరాన్ని కొంగొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నాయి. నూతనత్వానికి నాంది పలుకుతూ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. తెలుగు సంవత్సరాదికే ఎందుకు ఈ ప్రత్యేకత? ఆ సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? వాటికి అర్థాలేంటి? వంటి విశేషాలు తెలుసుకుందాం..
కోకిలమ్మ రాగాలు, ఘుమఘుమ వంటకాలు, షడ్రుచుల పచ్చడి ఉగాది పర్వదినాన్ని ఆనందమయం చేస్తున్నాయి. ఉగాదిని ఈ సంవత్సరం శ్రీ విలంబి నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. గత ఉగాదిని హేవిళంబి నామంగా పిలుచుకున్నాం. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నాం. ఈ పేర్ల వెనుక ఓ పురాణ గాథ ఉంది. అదేంటంటే విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓ యుద్ధంలో వారంతా చనిపోతారు. నారద మహర్షి విష్ణుని ప్రార్థించగా ఆయన కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారు, ఆ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయంటూ వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా వాడుకలో  ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేమలంబ, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ లుగా ఇలా కాలచక్రంలో నారథ పుత్రులను తలుచుకుంటున్నాం.
అరవై వసంతాలు..
ఈ ఏడాది వచ్చిన శ్రీ విలంబి నామ అర్థమేంటంటే.. "ఘోర''అని అర్థం.ఘోరం అనే పథాన్ని ఎక్కువగా పెద్ద చిక్కు వచ్చేటప్పుడే వాడుతుంటాం!ప్రపంచ పరిస్థితి విషమంగా ఉండవచ్చును. పంటలు కూడా అనుకున్నంతగా ఫలించకపోవచ్చు,అలాగే్ నిత్యం చేసుకునే పూజా కార్యక్రమాల సంకల్పములలో ఉన్న సంస్కృత పదం విలంబ అని ఉంది,
1. ప్రభవ నామ సంవత్సరం : యజ్ఞములు ఎక్కువగా జరుగుతాయని అర్థం.
2. విభవ : ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు.
3. శుక్ల : సమృద్ధిగా పంటలు పండుతాయనే సంకేతమిస్తుంది.
4. ప్రమోదూత : అందరికీ ఆనందం పంచుతుందని అర్థం.
5. ప్రజాపతి : అన్నింటా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది.
6. ఆంగీరస : భోగభాగ్యములు కలగాలనే అర్థాన్నిస్తుంది.
7. శ్రీముఖ : వనరులన్నీ సమృద్ధిగా అందుతాయని అర్థం.
8. భావ : సద్భావనలు, ఉన్నత భావాలు కలిగి ఉండాలని తెలుపుతుంది.
9. యువ : సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి.
10.ధాత : అనారోగ్య బాధలు తొలుగుతాయని, ఔషధాలు ఫలిస్తాయని చెబుతుంది.
11.ఈశ్వర : అందరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్థం.
12. బహుధాన్య : దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది.
13. ప్రమాది : వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి.
14. విక్రమ : సమృద్ధిగా పంటలు పండిస్తూ, అన్నింటా విజయం సాధిస్తారని అర్థం.
15.వృష : వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలుపుతుంది.
16. చిత్రభాను : అంచనాలకు అందని ఫలితాలు పొందుతారు.
17. స్వభాను : ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం.
18. తారణ : సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి.
19. పార్ధివ : సంపద సిద్ధిస్తుంది.
20.వ్యయ : అతివృష్టి, అధిక ఖర్చులని సూచిస్తుంది.
21. సర్వజిత్తు : ప్రజలకు అనుకూలించే వర్షాలు కురుయును.
22. సర్వధారి : అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థం.
23. విరోధి : వర్షాలు తక్కువగా కురుస్తాయి.
24. వికృతి : అశుభ, ప్రతికూల ఫలితాలు సూచిస్తుంది.
25. ఖర : సామాన్య పరిస్థితులు ఉంటాయి
26. నందన : ప్రజలు ఆనందంతో ఉంటారు.
27. విజయ : శత్రువుపై విజయం సాధిస్తారు.
28. జయ : కార్యసిద్ధి, రుగ్మతలను జయిస్తారు.
29. మన్మధ : భోగభాగ్యాలు సిద్ధించి, ఆరోగ్యంగా ఉంటారు. బాధలు తొలిగిపోతాయి.
30. దుర్ముఖి : ఇబ్బందులున్నా క్షేమకర ఫలితాలు పొందుతారు.
31. హేవిళంబి : ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
32. విళంబి : అంతా సుభిక్షంగా ఉంటారిని అర్థం.
33.వికారి : శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
34. శార్వరి : పంటల దిగుబడి సాఽధారణంగా ఉంటుంది.
35. ప్లవ : నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి.
36. శుభకృత : ప్రజలు సుఖంగా జీవిస్తారు.
37. శోభకృత : సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.
38. క్రోధి : కోప స్వభావంతో సామాన్య ఫలితాలు పొందుతారు.
39. విశ్వావసు : ధనం సమృద్ధిగా లభిస్తుంది.
40. పరాభవ : ఓటములు ఎదురవుతాయి.
41. ప్లవంగ : నీరు సమృద్ధిగా లభించును.
42. కీలక : పంటలు విశేషంగా పండుతాయి.
43. సౌమ్య : అందరికీ శుభాలు కలుగుతాయి.
44. సాధారణ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
45.విరోధికృత: ప్రజల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి.
46. పరీధావి: భయాలు కలుగుతాయి.
47. ప్రమాదీచ: ప్రమాదాలు ఎక్కువగా సంభవించును.
48. ఆనంద: అంతా ఆనందమయమేనని అర్థం
49. రాక్షస: క ఠినత్వం పెరగుతుంది. దుస్సంఘటనలు సంభవిస్తాయి
50. నల: సస్య సమృద్ధి కలుగుతుంది
51.పింగళ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
52.కాళయుక్తి: కాలానికి అనుగుణమైన ఫలితాలు వస్తాయి
53.సిద్ధార్థి: అన్ని కార్యాలు సిద్ధిస్తాయి
54.రౌద్రి: బాధలు కలుగుతాయి
55.దుర్మతి: సామాన్య వర్షాలు కురుస్తాయి
56.దుందుభి: ధాన్య సమృద్ధితో పాటు అంతా క్షేమంగా ఉంటారు.
57.రుధిరోద్గారి: ప్రమాదాలు అధికం
58. రక్తాక్షి : అశుభాలకు సంకేతం, సామాన్య ఫలితాలు వస్తాయి
59.క్రోధన: అన్నింటా విజయం సిద్ధిస్తుంది.
60.అక్షయ : అధిక సంపదలను సూచిస్తుంది.