Tuesday, December 14, 2010

శాసనసభ నుంచి టిఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్: విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ఆందోళన చేస్తూ పోడియం వద్దకు వచ్చిన 9 మంది టిఆర్ఎస్ సభ్యులను ఉదయం శాసనసభ సమావేశాల నుంచి ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ సస్పెండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించి, అంత తీవ్రంగా లేనివాటిని, వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పినప్పారు. అందుకు కొంత సమయం కావాలని మంత్రి రెండు సార్లు కోరారు. అయినప్పటికీ టిఆర్ఎస్ సభ్యులు వినలేదు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. మంత్రి వివరణ ఇచ్చారు, ఇక రైతు సమస్యలు చర్చిద్దామని ఉపసభాపతి కోరినా వారు వినలేదు. దాంతో ఆందోళన చేస్తున్న టిఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి సభలో తీర్మానం ప్రవేశం పెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ, ఉదయం సమావేశం నుంచి వారిని సస్పెండ్ చేశారు. దాంతో వారు శాసనభ గేటు వద్ద నినాదాలు చేశారు. మార్షల్స్ వారిని బయటకు తీసుకువచ్చారు. దాంతో టిఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తాము లేకుండా లోపల సభ జరుపుతున్నారు, రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని చూసుకుంటారన్నారు. 

No comments:

Post a Comment