Wednesday, December 21, 2016

బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి..

బ్లిసిటి కావాలంటే చాలా మార్గాలున్నాయి. ఒంటిపై బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి. కావలసినంత పబ్లిసిటీ వస్తుంది  అంటూ మీడియా‌పై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరిక్కర్. సదరు మంత్రి అలా నోరు ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ పారేసుకున్నారంటే.. గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పారిక్కర్.. మీడియా తన హద్దులను గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. 
ఎప్పుడో 1970ల్లో వాటర్‌గేట్‌ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్‌… రిచర్డ్‌ నిక్సన్‌కే సలహాలు ఇస్తూ, పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మళ్లీ ఇప్పుడు అదే నిక్సన్‌ కోసం మరాఠీలో ఎడిటోరియల్ రాస్తామంటే ఎలా అని నిప్పులు చెరిగారు.  మీడియాలో ఉన్న కొందరు వ్యక్తులు తమ పరిధిని గుర్తించకుండా పదేపదే గోల చేస్తున్నారన్నారు మంత్రి. ఇటువంటి గొడవలన్నీ పబ్లిసిటీ స్టంట్ కోసమేననీ, దీనికి ఇంత కష్టపడాల్సిన అవసరంలేదని డ్రస్ లేకుండా  డ్యాన్సులు వేయాలని సలహా ఇచ్చేశారు. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోని పత్రికలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ తెచ్చుకునేందుకు వెంపర్లాడుతున్నాయంటూ ఒక లోకల్‌ పత్రికపైన ఇలా విరుచుకుపడ్డారు మంత్రి మనోహర్ పరిక్కర్.