Sunday, December 5, 2010

నాదాన్ని చూసుకుని నేనే నమ్మలేకపోయా ;నమిత...!!!

               సినిమా తారలు సన్నగా, మెరుపు తీగల్లా ఉంటేనే వారికి అభిమానుల ఆదరణ మెండుగా లభిస్తుందనే       వాదనని తప్పు అని నిరూపించింది…బొద్దుగుమ్మ నమిత.  నా శరీరం నా ఇష్టం. నేనిలానే ఉంటా అని ఖరాకండిగా చెప్పే నమితకి అభిమానుల ఫాలోయింగు ఏమైనా తక్కువ ఉందంటే….మీరు పొరబడినట్టే..టాప్ హీరోయిన్లను తలదన్నేలా ఇంటర్నెట్ లో ఎక్కువ ప్రజాదరణ పొందిన (సెర్చుల  పరంగా) హీరోయిన్ నమిత అంటే నమ్మేవారు తక్కువే అయినా….ఇది నమ్మక తప్పని నిజం.   ఈ సూరత్ సుందరికి ఆ మధ్య ఓ వీరాభిమాని ఓ భారీ  ఫొటో ఆల్బమ్ ఒకటి బహుమతిగా ఇచ్చాడట. . అంత పెద్ద ఆల్బమ్ తిరగేయాలంటే కనీసం రెండు, మూడు గంటలైనా పడుతుందని భావించిన నమిత అంత సమయం దొరికినప్పుడు చూడొచ్చులే అని భద్రంగా ఆల్మరాలో పెట్టేసిందట .ఇటీవల కొంత తీరిక చిక్కడంతో ఆ ఆల్బమ్ చూడటం మొదలుపెట్టిందట. . సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి ఈ మధ్య వరకు నమిత పాల్గొన్న వేడుకల్లోని కొన్ని ఫొటోలు, ఆమెకు సంబంధించిన సినిమా ఫొటోలు.. ఇలా రకరకాల సందర్భాల్లోని ఫొటోలు ఉండటం చూసి నమిత ఆశ్చర్యానందాలకు గురయ్యిందట. . కానీ.. కొన్ని ఫొటోలు మాత్రం నమితను ఇబ్బందిపెట్టాయని కూడా వినికిడి. 70ఏళ్ల వయసులో  ఈ సుందరి ఎలా ఉంటుందో  ఊహించి సదరు అభిమాని బొమ్మలు గీయిన్చాదట . బెంగళూరులో ఉన్న ఓ ఆర్ట్ హౌస్లో ప్రత్యేకంగా గీయించిన బొమ్మలు అవి. వయసు పెరిగే కొద్దీ మన రూపు రేఖలు ఎలా మారతాయో ఊహించి గీయడం ఆ ఆర్ట్ హౌస్‌లోని చిత్రకారులకు కుంచెతో పెట్టిన విద్య. ఈ ఫొటోలు చూసుకుని.. నమిత ఆనందపడాలో, బాధపడాలో తెలియక రెండు రకాల ఫీలింగ్స్‌ను వ్యక్తపరించింది అని  సమాచారం. వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది కదా.. బహుశా నమిత ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయి ఉంటుందేమో…మామూలు వాళ్ళకే అలాంటివి అసలు మింగుడు పడవు….ఇక సినిమా వాళ్ళు,అదీ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా?

No comments:

Post a Comment