జిల్లావార్తలు




విశాఖ పట్నం జిల్లా వివరణ
మండలాలు ( 42 )
జిల్లా కేంద్రం : విశాఖ పట్నం
వైశాల్యము : 11,161 చ.కి.మీ
రాష్ట్ర వైశాల్యములో ఈ జిల్లా వైశాల్యము : 4:06 శాతం
జనాభా (2001 ) : 38,16,820
పురుషులు : 19,23,999
స్త్రీలు : 18,92,821
జనసాంద్రత : 339 ( 9వ స్థానం)
జనాభా నిష్పత్తి ( స్త్రీ ,పురుష ) : 984 :1000
జనాభా పెరుగుదల : 27 శాతం
అక్షరాశ్యత : : 60.59శాతం
పట్టణ ప్రాంత అక్షరాశ్యత : : 70.38 శాతం
గ్రామాల్లో అక్షరాశ్యత : : 28.54 శాతం
పురుషులలో అక్షరాశ్యత : : 69.81 శాతం
స్త్రీలలో అక్షరాశ్యత : : 51.23 శాతం
ఓటర్లు పురుషులు (1998 ) : 12,01,822
ఓటర్లు స్త్రీలు : 12,12,331
షెడ్యూల్ద్ కులాలు : 2,56,936
షెడ్యూల్ద్ తెగలు : 4,68,886
పార్లమెంటు నియోజక వర్గాలు : 2 ( విశాఖ పట్నం, అనకాపల్లి )
అసెంబ్లీ నియోజక వర్గాలు : 13
మున్సిపాలిటీలు : 13
ప్రాధమిక ఉన్నత పాఠశాలల సంఖ్య : 3806
సెకండరి పాఠశాలల సంఖ్య : 421
బ్యాంకులు : 235
కార్పోరేషన్ : 1) విశాఖపట్నం
వర్షపాతం : 1085 మి.మీ
అడవులు : 4,77,791 హెక్టారులు
ఆసుపత్రులు : 48
వైద్యుల సంఖ్య : 502
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 48
డిస్పెన్సరీలు : 31
పోస్టాఫీసులు : 700
మండలాలు : 39
జిల్లా పరిషత్ ( జడ్పీటీసీ )లు : 39
మండల పరిషత్ ( ఎంపీటీసీ ) లు : 596
ప్రధాన పట్టణాలు : 9
గ్రామాలు : 3,692
గ్రామ పంచాయితీలు : 1,064
చిన్న తరహా పరిశ్రమలు : 7080
భారీ మద్య తరహా పరిశ్రమలు : 61
సాగు భూమి : 4.73 లక్షల హెక్టార్లు
రెవెన్యూ డివిజన్లు : 3. (1. విశాఖ పట్నం 2.నర్సీపట్నం, 3.పాడేరు )
రవాణా :
కలకత్తా నుంచి మద్రాసు పోయే 5వ నంబరు జాతీయ రహదారి 109 కి.మీ ప్రయాణం చేస్తుంది. జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 1357 కి.మీ రోడ్లు వున్నాయి.
ముఖ్య నదులు :
గోస్తనీ, వరాహ, మాచ్ ఖండ్, శారద, తాండవ, వర్ష, చంపావతి, నెల్లిమర్ల, గంభీరాల గడ్డ, నరవగడ్డ
ముఖ్యపంటలు : వరి, రాగులు, పెసలు, ఉలవలు, వేరుశనగ,నువ్వులు, చెరకు, జనుము, నీరుల్లి
ఖనిజములు: మాంగనీసు, గ్రాఫైటు, ఇనుము, మాగ్నటైట్, బాక్సైట్
ముఖ్య పరిశ్రమలు :
బెల్లం, చెక్కెర, జనపనార, ఎరువులు, సిమెంటు, ఓడల నిర్మాణము, పెట్రోలు శుద్ది కర్మాగారము, ఉక్కు కర్మాగారము మొదలగునవి.
ప్రధాన పట్టణాలు : విశాఖపట్నం, భీమునిపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి
శాసన సభ నియోజక వర్గాలు :
  • 1. భీమునిపట్నం,
  • 2. విశాఖపట్నం - I,
  • 3.విశాఖపట్నం - II,
  • 4. పెందుర్తి,
  • 5. మాడుగుల,
  • 6. ఛోడవరం,
  • 7. అనకాపల్లి,
  • 8. పరవాడ,
  • 9.యలమంచిలి,
  • 10. పాయకరావు పేట,
  • 11. నర్సీపట్నం,
  • 12. పాడేరు,
  • 13. చింతపల్లి.
చూడదగ్గ ప్రదేశాలు :
బి.హెచ్.పి.వి, ఓడరేవు, హిందూస్తాన్ షిప్ యార్డ్, కోరమాండల్ ఎరువుల కర్మాగారము, అరకులోయ, బొర్రాగుహలు, అనంతగిరి, భీమునిపట్నం, కశింకోట, ఆర్.కె. బీచ్, ఋషికొండ, విశాఖపట్నం నౌకాశ్రయం, సింహాచలం (వరహ నరసింహ స్వామి దేవాలయం)
జిల్లా సరిహద్దులు :
ఉత్తరాన విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఒరిస్సారాష్ట్రం.
జిల్లా చరిత్ర :
స్వాతంత్రానికి పూర్వం ఈ జిల్లా దేశంలోనే అతి పెద్ద జిల్లాగా ఉండేది. ఈప్రాంతాన్నిపూర్వం మౌర్యులు, శాతవాహనులు ,విష్ణుకుండినులు, చాళుక్యులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు పరిపాలించారు. చివరగా ఇది బ్రిటీషువారి పాలనలోనికి వచ్చింది. 1879లో వీరయ్య దొర ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు, 1922లో కొండజాతివారైన సవరల విప్లవం జరిగాయి. అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో రంప చోడవరం, అడ్దతీగెల, నర్సీపట్నం ప్రాంతాలలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మన్యం తిరుగుబాటు వంటి ఉద్యమాలు మొత్తందేశ ప్రజలను ఉత్తేజపరిచాయి. బ్రిటీషు ప్రభుత్యం ఉద్యమ నాయకులను పాశవికంగా కాల్ఛివేసింది. స్వాతంత్ర్యం తరువాత ఈ జిల్లా రెండుసార్లు విభజింపబడి కొన్ని ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు బదిలీ చేయబడినాయి.
జిల్లాలో 42% అడవులు విస్తరించి వున్నాయి. అనంతగిరి, చింతపల్లి, సీలేరు, మినుమలూరు, అరకులోయ, భీమునిపట్నం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఏటికొప్పాక గ్రామం ఆట బొమ్మల తయారీకి ప్రసిద్ది వహించింది. కాశీపట్నం ప్రాంతంలో 86,364 మెట్రిక్ టన్నుల అపెటైట్ ఖనిజం ఉన్నట్లు కనుగొనబడింది. చింతపల్లి వద్ద బాక్సైట్, కాశీపట్నం వద్ద వెర్మిక్యులేట్, నక్కపల్లి వద్ద బంకమట్టి లభిస్తున్నాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లా తరచుగా తుఫాన్ తాకిడికి గురవుతూ ఉంటుంది. మొత్తం భూమిలో 30% సాగుచేయబడుతుంది. 40% భూములకు నీటి సౌకర్యం ఉంది.
1933లో విశాఖపట్నంలో ఓడరేవు నిర్మించబడింది. విశాఖపట్నంలో ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించబదినాయి. దేశంలోకెల్లా అత్యంత సహజమైన ఓడరేవుగా విశాఖపట్నం ప్రసిద్దిగాంచింది. సింహాచలం పుణ్యక్షేత్రం ఈ జిల్లాలోనే ఉంది. నౌకా, విమాన, రక్షణ యంత్ర పరికరాలు, చమురు శుద్ధికి సంభందించిన రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించబడినాయి.

*******************************************



 ****************************************

మోదకొండమ్మ జాతరకు పటిష్ట చర్యలు

పాడేరులో వచ్చేనెల 15 నుంచి 17వ తేదీ వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మోదకొండమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు ఆదేశించారు. స్థానిక పి.ఎం.ఆర్.సి. కా ర్యాలయంలో వివిధ శాఖల అధికారు లు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మోదకొండమ్మ ఉత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి లోపాలు సంభవించకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విశాఖ మన్య ప్రాంతానికే ఎంతో వనె్న తీసుకువస్తున్న అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో అన్ని వర్గాల వారు భాగస్వాములై తమవంతు సహకారాన్ని అందించాల్సి ఉందని చెప్పారు. మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాడేరులో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాముఖ్యతను ఇవ్వాలని, పట్టణ వీధులలో ఎక్కడా అపారిశుధ్యం లేకుండా చూడాలని ఆయన చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను చేపట్టాలని, హోటళ్లలో కలుషితం, నిల్వ ఉన్న ఆహారం లేకుం డా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరాన్ని నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి లోపాలు చోటుచేసుకున్నా అధికారులపై చర్యలు తీసుకుంటామని బాలరాజు హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జాతరలో నాటుసారా ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మోదకొండమ్మ ఉత్సవాల మూడు రోజులూ ప్రధాన కూడళ్లలో అన్ని శాఖల స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అమ్మవారి జాతర సందర్భంగా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు 12 లక్షల 63 వేల రూపాయలతో అదనంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పాడేరు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 35 బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఆర్.టి.సి. అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.ఆర్.డి.ప్రసాదరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరెడ్డి, ఇందిరాక్రాంతి పధం ప్రాజెక్టు మేనేజర్ జిలానీ, మాజీ శాసనసభ్యుడు కొట్టగుళ్లి చిట్టినాయుడు, ఎం.పి.పి. ఎస్.వి.వి.రమణమూర్తి, సర్పంచ్ సల్లంగి నారాయణ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రొబ్బి రాము, రమణ, జగదీష్, అధికారులు పాల్గొన్నారు.

***********************************************

ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి


విశాఖపట్నం; ఓ ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. హంతకుడు భర్తేనని అనుమానిస్తున్నారు. నగరం నడిబొడ్డున జన సమ్మర్ధం కలిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీపాలేనికి చెందిన దువ్వి కృష్ణవేణి (21)కి ఇదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సిహెచ్.రవికుమార్‌తో గత ఏడాది ఆగస్ట్ 29న వివాహం జరిగింది. అమ్మాయికి అతనిని వివాహం చేసుకోవడం ముందు ఇష్టం లేకపోయినా, ఆ తరువాత తల వంచక తప్పలేదు. వివాహ సమయంలో రెండు లక్షల రూపాయలు, మోటారు సైకిల్ కట్నంగా ఇచ్చారు. పెళ్ళయిన మూడు నెలలు సవ్యంగానే కాపురం చేశారు. ఆ తరువాత భార్య పేర ఉన్న ఇల్లు తన పేరన రాయమని వేధించడం మొదలుపెట్టాడు. కృష్ణవేణి తండ్రి, తల్లి కొన్ని కారణాల వలన విడివిడిగా ఉంటున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి పుట్టింట్లోనే తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. ఇప్పుడు ఆమె ఐదవ నెల గర్భవతి కూడా. రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న కృష్ణవేణి ఉదయం కాలేజీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుంటుంది. కొంత కాలం కిందట భర్త రవికుమార్, కృష్ణవేణిని చంపేస్తానని బెదిరించినట్టు ఆమె బంధువులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి బస్సులో మద్దిలపాలెం వరకూ వచ్చిన కృష్ణవేణి కాలి నడకన ఇంటికి బయల్దేరింది. స్థానిక కళాభారతి ఆడిటోరియం వద్దకు రాగానే, కృష్ణవేణిపై అగంతకుడు దాడి చేసి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఈ దాడికి పాల్పడింది కృష్ణవేణి భర్తేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుపారిపోయాడని స్థానికులు చెపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.

******************************************************
కాకరాపల్లిలో ఉద్రిక్తత
గ్రామస్తుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు 


 లాఠీ ఛార్జ్‌ - అడ్డుకున్న గ్రామస్తులు 
మహిళలపైనా పోలీసుల దౌర్జన్యం 
శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష కొనసాగిస్తోన్న గ్రామస్థులను ....పోలీసులు చెదరగొట్టారు. దీంతో పోలీసులకు , స్థానికుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఖాకీల బలవంతంగా తమను దీక్షా శిబిరం నుంచి వెల్లగొట్టడంపై కాకారపల్లి వాసులు మండిపడుతున్నారు. ప్రాణాలు ఇచ్చైనా ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆందోళన కట్టడి చేసేందుకు పోలీసులు గ్రామస్థాయి నాయకులను అరెస్ట్ చేశారు. స్థానిక నేతలు ప్రజలకు మద్దతుగా ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

**********************************************************************************
విశాఖలో కార్యకర్తల పరిచయ వేదికలో సీఎం
రచ్చబండ తొలిరోజు 94 శాతం విజయవంతం అయ్యిందంటున్నారు సీఎం కిరణ్‌. పదిహేను రోజులు జరిగే ఈ కార్యక్రమంలో కోటి 25 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రచ్చబండలో పాల్గొన్న ఆయన సాయంత్రం విశాఖలో జరిగిన కార్యకర్తల పరిచయ వేదికలో పాల్గొన్నారు. కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన వారిలో జోష్‌ నింపేందుకు ప్రయత్నించారు. సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం అన్నవరం చేరుకుని సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం తుని మండలం తేటగుంటలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.

**********************************************************************************
ఓదార్పు యాత్రలో గ్రూపుల గోల
అనకాపల్లి, : కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ బుధవారం ఎలమంచిలి నియోజకవర్గంలో చేపట్టిన ఓదార్పుయాత్ర అద్యంతం హైడ్రామాతో నడిచి, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని మరిపించింది. కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ జగన్‌కు మద్దతు తెలుపుతున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణల మధ్య మరోసారి ఆధిపత్య పోరు నడిచింది. ఈసారి హరిదే పైచేయిగా నిలచింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు వర్గాల వారు ఓదార్పుయాత్రను బల ప్రదర్శనకు వినియోగించుకున్నారు. జగన్‌కు మద్దతు విషయంలో రెండు పడవల ప్రయాణంలా సాగిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబు, తెరవెనుక వుండి తన అనుచరులతో హరికి అండగా నిలిచారు.ఎలమంచిలి నియోజకవర్గంలో మలివిడత ఓదార్పు జరగడానికి వారంరోజుల ముందుగానే మాజీమంత్రి కొణతాల, కన్నబాబు మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచింది. జిల్లాలో తొలి విడత జరిగిన ఓదార్పుయాత్రలో పైచేయి చాటుకున్న ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాలకు గట్టిపట్టున్న ఎలమంచిలి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కన్నబాబు అండ తీసుకున్నారు. ఆయన అందించిన పరోక్ష సహకారంతో తన హవా కొనసాగించారు. ఎలమంచిలిలో వైఎస్ విగ్రహం రహదారికి ఒకవైపున ఏర్పాటు చేయగా, దానికి ఎదురుగా రోడ్డుకి మరో వైపు బహిరంగసభ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సభలో కన్నబాబు, కొణతాల వర్గీయులు ఆధిపత్యం కోసం గొడవ పడతారని భావించారు.ఇదిలా వుండగా మంగళవారం అచ్యుతాపురంలో కన్నబాబు వర్గానికి కొణతాల వర్గీయులు ఝలక్ ఇచ్చారు. కన్నబాబు వర్గీయుల కన్నా ముందే అచ్యుతాపురం జంక్షన్‌లో వైఎస్ విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పోటా పోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. జగన్ ఓదార్పు యాత్రలో స్వయంగా పాల్గొనకుండా తన కుమారుడి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని కన్నబాబు ముందే భావించారు. అయితే చివరి నిముషంలో కన్నబాబు తన వ్యూహాన్ని మార్చుకొని కుమారుడు కూడా ఓదార్పుయాత్రలో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
**********************************************************************************
విశాఖలో వివాదాస్పదమవుతోన్న పన్నుల పెంపకం
గ్రేటర్‌ విశాఖలో అడ్డగోలుగా పన్నులు పెంచడం వివాదాస్పదం అవుతోంది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నాలుగైదు రెట్లు పన్నులు పెంచేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ట్యాక్సులు పెంచేస్తే కట్టేది లేదంటూ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ పోరాటానికి దిగుతోంది.


**********************************************************************************

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని టార్గెట్ చేసుకున్న; రోజా
విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి గెలిచిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని టార్గెట్ చేసుకుని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. వైయస్ జగన్ చేపట్టిన జనదీక్ష వేదిక మీది నుంచి ఆమె శనివారంనాడు మాట్లాడారు. పార్లమెంటు సభ్యురాలిగా గెలిచి విశాఖపట్నానికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పురంధేశ్వరి అమెరికా వెళ్తారు, ఢిల్లీలో ఉంటారు, అప్పుడప్పుడు విజయవాడ వెళ్తారు కానీ విశాఖపట్నానికి రాబోరని ఆమె విమర్శించారు.పురంధేశ్వర పదవి తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని, పురంధేశ్వరికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె అన్నారు. సోనియా గాంధీని కాకా పడితే చాలునని పురంధేశ్వరి అనుకుంటున్నారని ఆమె అన్నారు. జగన్ కండల తిరిగిన యువకుడు కారని, లేత యువకుడని, జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆయన వెంట నడవాల్సిన అవసరం యువతరానికి ఉందని ఆమె అన్నారు. మహిళలు జగన్ వెంటే ఉంటారని ఆమె చెప్పారు.