Thursday, February 28, 2013

కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్‌ పైడిరాజు విడుదల


సోంలో ఈనెల 15న అపహరణకు గురైన ఇంజనీర్ పైడిరాజు విడుదలయ్యాడు. పైడిరాజును బోడో తీవ్రవాదులు క్షేమంగా విడిచిపెట్టారు. అసోంలో పవర్ గ్రీడ్ లో కో అపరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్యాలీటీ కంట్రోల్ ఇంజనీర్ గా పైడిరాజు విధులు నిర్వహిస్తున్నాడు. తీవ్రవాదుల విడుదల అనంతరం పైడిరాజు భిక్ష పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. పైడిరాజును విడుదల చేసిన బోడో తీవ్రవాదులు







12 రోజుల కిడ్నాపైన పైడిరాజు
అసోంలోని భక్త పీఎస్‌కు చేరుకున్న పైడిరాజు
తీవ్రవాదుల చెర నుంచి పైడిరాజు విడుదలయ్యారు. అసోంలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీలో పని చేస్తున్న విశాఖకు చెందిన పైడిరాజును బోడో తీవ్రవాదులు 12రోజుల క్రితం కిడ్నాప్‌ చేశారు. ఆయన అసోంలోని భక్త పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పైడిరాజు విడుదలపై విశాఖ గాజువాకలో ఉన్న అతని తలిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పైడిరాజు కిడ్నాప్ విషయంపై మంత్రి గంటా అసోం పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ మేరకు పైడిరాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలోని కణితికాలనీ తెలికల వీధికి చెందిన అప్పారావుఏకైక కుమారుడైన పైడిరాజును కష్టపడి చదివించారు. అనంతరం పైడిరాజు ఢిల్లీకి చెందిన బీసీ నయ్యా అనే సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా చేరాడు. ఇటీవల ఆ సంస్థకు అసోం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రాజెక్ట్ పనులు దక్కటంతో పైడిరాజుతో పాటు మరికొంత మంది ప్రతినిధులను అసోం పంపించారు. 

Saturday, February 23, 2013

బాంబు పేలుళ్ల ను ఖండించిన సీఎం, పలువురు నాయకులు


బాంబు పేలుళ్ల ను ఖండించిన సీఎం, పలువురు నాయకులు
 

దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్ల సంఘటనా స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి,కేంద్ర పర్యాటక మంత్రి కె చిరంజీవి ,హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి, మంత్రి దానం నాగేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బలాల, హరీష్‌రావు, మేయర్ మాజిద్‌హుస్సేన్, బీజేపీ నాయకులు దత్తాత్రేయ, బి. వెంకట్‌రెడ్డి తదితరులు సందర్శించారు. బాంబు పేలుడు సంఘటననుప్రజాప్రతినిధులు
ముక్తకంఠంతోఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అవసరమైతే కార్పోరేట్ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించామన్నారు. పేలుళ్లలో చనిపోయిన వారికి ఆరులక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలన్న సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.
వరుస బాంబు పేలుళ్లను ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ 
వరుస బాంబు పేలుళ్లను ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కుట్రదారులను పట్టుకుని ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది భారత్ పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలుతీసుకోవాలన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.
బాంబు పేలుళ్ల ఘటనను ఖండించిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల ఘటనను బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రజలు శాంతి యుతంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగంతో పూర్తిగా సహకరించాలని వెంకయ్యనాయుడు కోరారు.

బాంబు పేలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. మీకోసం యాత్రలో పాల్గొంటున్న ఆ‍యన షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. దిల్ సుఖ్ నగర్ కు కార్యకర్తలతోపాటు వచ్చిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. అయితే ఈ ఘటన జరగడానికి ప్రభుత్వ నిర్లక్షమే ప్రధాన కారణమని బాబు అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు. 

Sunday, February 17, 2013

శ్రీ సూర్యనారయణమూర్తి దేవాలయం(రాజుపాలెం అనకాపల్లి మండలం విశాఖపట్టణం జిల్లా ఆంద్రప్రదేశ్ )

శ్రీ సూర్యనారయణమూర్తి దేవాలయం(రాజుపాలెం అనకాపల్లి మండలం విశాఖపట్టణం  జిల్లా ఆంద్రప్రదేశ్ )




శ్రీ సూర్యనారయణమూర్తి దేవాలయం
(రాజుపాలెం అనకాపల్లి మండలం వైజాగ్ జిల్లా)

Saturday, February 16, 2013

వందల కోట్ల రూపాయలు కు సిమ్స్ శఠగోపం...!!???






వందల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి శఠగోపం పెట్టిన కంపెనీల జాబితాలో తాజాగా 'సిమ్స్' కూడా చేరింది. ఈ కంపెనీ గత మూడు నెలలుగా ఖాతాదారులకు వడ్డీ చెల్లించడంలేదు. నిలదీస్తున్న వారికి ఎప్పటికప్పుడు సర్దిచెబుతూ జాప్యం చేసింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అందరికీ 15వ తేదీన సొమ్ము చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని పేర్కొంది. ఆ మేరకు  డిపాజిటర్లు ఎక్కడికక్కడ స్థానిక కార్యాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏమీ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల ఫర్నీచర్ ధ్వంసం చేయగా, మరికొన్నిచోట్ల తీసుకెళ్లిపోయారు.మ్యాజిక్, రాగ మాదిరి గానే బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థల లిస్టులోకి ఇప్పుడు తాజాగా సిమ్స్ సంస్థ చేరిందంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతాదారులకు గత మూడు నెలల నుండి చెల్లింపులు నిలిచిపోవటంతో పాటు బుధవారం(15-02-13) నుండి సంస్థ ఎమ్‌డి సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. నగరంలోని అక్కయ్యపాలెం సమీపంలో సుమారు నాలుగేళ్ళ క్రితం కె.సురేంద్రగుప్తా ‘సెక్యూరిటీ ఇన్‌వెస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీసెస్’ (సిమ్స్) పేరుతో ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సంస్థలో డైరెక్టర్లను, ఏజెంట్లను నియమించి రూ.లక్ష చెల్లిస్తే వారానికి రూ.8వేలు చొప్పిన వడ్డీ చెల్లిస్తామని గుప్తా ప్రచారం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు ఇందులోకి చేరడంతో అధిక మొత్తంలో నగదు చేకూరడంతో జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, తదితర ప్రాంతాల్లో బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో కొద్ది నెలల క్రితం మద్దిలపాలెం ప్రాంతంలో శాఖ కార్యాలయాన్ని గుప్తా ప్రారంభించారు. ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా సిమ్స్‌లో ఖాతాదారులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో సంస్థపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు సిమ్స్ కార్యాలయానికి చేరుకుని తమ పేమెంట్లు గురించి సిబ్బందిని నిలదీస్తుండడంతో ఈనెల 15న పేమెంట్లు ఇస్తామని, కంగారు పడాల్సిన అవసరం లేదని వారం రోజుల క్రితం పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ తరుణంలో శుక్రవారం సిమ్స్ ఆఫీసు వద్దకు ఖాతాదారులు వెళ్ళగా పేమెంట్లు ఇవ్వడం లేదని తెలుసుకుని తీవ్ర అగ్రహావేశాలకు గురయ్యారు. ఇది గమనించిన సిబ్బంది కార్యాలయాన్ని మూసి వేసి అక్కడ నుండి జారుకున్నారు. ఖాతాదారులు ఏజెంట్లను నిలదీయడంతో వారు ఎమ్‌డి గుప్తా సెల్‌ఫోన్‌ను కాల్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉండడాన్ని గమనించారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా సిమ్స్ నిర్వాహకుడు సురేంద్ర గుప్తా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిఐ షేక్‌హుస్సేన్ నేతృత్వంలో నాలుగో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Thursday, February 14, 2013

అతి దారుణంగా హత్య చేసిన భర్తకు యావజ్జీవం,


విశాఖ నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగా, తన భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్తకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బుధవారం(13-02-2013)న తీర్పు చెప్పారు. మద్దిలపాలెం - కళాభారతి రోడ్డుపై 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణిని ఆమె భర్త రవికుమార్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. భార్యను హతమార్చిన రవికుమార్ వెంటనే విజయనగరం పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. అప్పట్లో ఈ ఉదంతం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. నడి రోడ్డుపై ఓ మహిళను హతమార్చినా, ఎవ్వరూ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు.


అయితే ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో పోలీసులు కేసును పగడ్బందీగా ఫైల్ చేయడంతో నిందితుడు రవికుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చెల్లుబోయిన రవికుమార్ మద్దిలపాలెంకు చెందిన దువ్వి కృష్ణవేణిని 2010 ఆగస్ట్ 29న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కృష్ణవేణి తల్లిదండ్రులు లక్షా 50 వేల రూపాయల కట్నం, ఆడబడుచులకు 20 వేల రూపాయల లాంఛనాలు ఇచ్చారు. వివాహం చేసుకునే సమయానికి కృష్ణవేణి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం కలిసి కాపురం చేసిన తరువాత కృష్ణవేణికి వేధింపులు ప్రారంభమయ్యాయి. కృష్ణవేణి తల్లిదండ్రులకు ఒక భవనం ఉంది. ఆ భవనంపై వచ్చే అద్దె తనకు ఇవ్వమని, దాన్ని తనకు రాసివ్వాలని, అదనపు కట్నం తేవాలని కృష్ణవేణిని భర్త రవికుమార్ వేధించడం మొదలుపెట్టాడు. అతనితోపాటు అత్త, మామలు గురమ్మ, సూర్యనారాయణ, ఆడబడుచులు శ్యామలాదేవి, ప్రసన్నకుమారి కూడా కృష్ణవేణిని వేధిస్తుండేవారు. 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణి కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా, మద్దిలపాలెం-కళాభారతి రోడ్డులో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రవికుమార్ ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కృష్ణవేణి తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు మహిళా న్యాయ స్థానం ముందుకు వచ్చింది. న్యాయమూర్తి ఎన్.రాజా ప్రసాద్ బాబా ఇరుపక్షాల వాదనలు విన్నారు. రవికుమార్‌పై హత్యా నేరం రుజువు కావడంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అత్త, మామ, ఆడబడుచులకు మూడు సంవత్సరాల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి శిక్షతో పాటు, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు. ఇది చెల్లించకపోతే, ఒక సంవత్సరం అదనంగా జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును విచారించేందుకు న్యాయవాది ఎం గోపాలరావును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు.ఉరిశిక్ష వేయాల్సింది తను కుమార్తెను దారుణంగా చంపిన హంతకుడికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధిస్తారనుకుంటే యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారని కృష్ణవేణి తల్లి దువ్వి వేను కోర్టు ఆవరణలో కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు పకడ్బందీగానే కేసు నమోదు చేసినప్పటికీ, కోర్టులో సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.