Monday, November 12, 2018

శ్రీ సోమేశ్వర ఆలయం, అప్పికొండ, విశాఖ జిల్లా...

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో అప్పికొండ సోమేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సమీపంలో, సాగర తీరానికి అతి చేరువలో, అప్పికొండ గ్రామంలో సోమేశ్వర ఆలయం నెలకొని ఉంది. చంద్రున్ని ధరించిన పరమేశ్వరుడు శ్వేతవర్ణంలో ఇక్కడ సోమశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. సౌరాష్ట్రలోని సముద్ర తీరాన ఉన్న సోమనాధుని ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అప్పికొండ సోమేశ్వర ఆలయo కూడా అంతే మహిమాన్వితమైనదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రాన్ని పంచలింగాల క్షేత్రం అని కూడా పిలుస్తారు. కపిల మహర్షి తపో ఫలితంగా ఈ క్షేత్రం ఏర్పడినట్లు స్థల పురాణం చెబుతోంది. సోమేశ్వర ఆలయానికి కుడి వైపున స్వరమంగళాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. 14వ శతాబ్ధంలో సోమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. చరిత్ర కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి కార్తీకమాసంలో భక్తుల తాకిడితో అధికం అయింది. కార్తీకమాసం నెల రోజులు సోమేశ్వరుడ్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. చారిత్రాత్మక శివాలయంగా వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వర ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూ వస్తుంది.
అప్పికొండ తీరంలో వెలిసిని సోమేశ్వరుడు వేలాది మంది భక్తులకు ఇలవేల్పుగా పిలుచుకుంటారు. ఆలయం పరిసర గ్రామాల ప్రజల్లో ప్రతీ కుటుంబానికి ఒక్కరు సోమేశ్వరుడు నామకరణ చేసుకుంటారు. శతాబ్ధాకాలం నాటి అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయం విశాఖపట్నం నడిబొడ్డిన జివిఎంసి 55వ డివిజన్ అప్పికొండ సముద్ర తీరంలో వెలిసింది. కార్తీకమాసం, మహాశివరాత్రి రోజుల్లో సోమేశ్వర ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది.దేవాదాయయ ధర్మాదాయశాఖ ఆధీనంగా గల పురాతన సోమేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి అంతంత మాత్రమే. అయినప్పటికీ భక్తులకు మాత్రం సోమశే్వరుడు కొంగుబంగారంలా నిలుస్తున్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, అభివృద్ధి కమిటీ పాటు ట్రస్టీలు పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ట్రస్టు బోర్డును మాత్రం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ట్రస్టీ పర్యవేక్షణల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ఆలయ నిర్వహణను చేపడుతారు. దేశంలోనే అతి పురాతన ఆలయంగా ప్రాచూర్యం పొందిన సోమేశ్వరుడ్ని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ధంలో కపిల తీర్ధమహిర్షి దీక్షతో అప్పికొండ సాగర తీరం అంచున వెలసిన సోమేశ్వరుడుకి భక్తుల ఆదరణ మెండుగా ఉంది. కపిలమహర్షి దీక్షతో 101 లింగాలు ఏర్పడాల్సి ఉండగా తెల్లవారే సరికి ఒకే ఒకలింగం లోటుగా ఏర్పడడం, లోటుగా ఉన్న ఒక లింగాన్ని మహార్షి అప్పుగా తీసుకోవడం కారణంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని అప్పుకొండగా పిలిచేవారని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తుంది. రానురాను అప్పుకొండ అప్పికొండగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు.
అప్పికొండ సాగర తీరంలో అహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అప్పికొండ సోమేశ్వర ఆలయం క్రీస్తు పూర్వ 6,11వ శతాబ్ధాల్లో చోళులు, విజయనగర రాజులు ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ లభించిన శిలాశాసనాల బట్టి రుజువవుతుంది. సుమారు 150 ఎకరాల విస్తీర్ణం (మాన్యం) కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయం విశాఖ ఉక్కు కర్మాగారం రాకతో నేడు 26 ఎకరాలకే పరమితమైందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఆప్పికొండ సోమేశ్వర ఆలయానికి ఎంతో ప్రధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. దేశ,విదేశాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి సోమేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1992లో అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవాదాయ,్ధర్మాశాఖ అదీనంలోకి వెళ్లడంతో అప్పటి నుండి ఆలయం అభివృద్ధికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పాలవలసలో హిందూజా పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగినందున అప్పికొండ సోమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తుల కొంగు బంగారమైన అప్పికొండ సోమేశ్వర ఆలయం కమిటీ పెద్దలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీకమాసంలో ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధానంగా కార్తీకమాసం సోమవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.
భక్తులను దృష్టిలో పెట్టుకుని ట్రస్టు బోర్డు ప్రతినిధులతో పాటు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతి పురాతన ఆలయంగా ఉన్న అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి గత ఏడాది కాస్త మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులకు చేరుకునేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. కూర్మన్నపాలెం నుండి స్టీల్‌ప్లాంట్ ప్రధాన రహదారి మీదగా మెయిన్‌గేటును దాటుకుని ఆలయానికి చేరుకోవాలి. ప్రధానంగా కార్తీకమాసంలో అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వన భోజనాలకు వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. ఆలయానికి అనుకుని ఉన్న తీరంలో భక్తులు వన భోజనాలు చేసి సరదా గడుపుతారు.. 'కపిలమహర్షి' ఆరాధనకు ఆనందించి శివుడు ఆయనకి ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థలపురాణం చెబుతోంది....

పరమేశ్వరుని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగిన కపిల మహర్షి ఈ ప్రదేశంలో నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాడట. వాటిలో అయిదు శివలింగాలు మాత్రమే ప్రస్తుతం బయటికి కనిపిస్తూ వుంటాయి. మిగతావన్నీ కూడా కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెబుతుంటారు. ఆ విధంగా ఇక్కడ భూమిపైనా .. కిందా కూడా శివలింగాలు ఉండటం వలన, ఇది అత్యంత శక్తిమంతమైన ... పవిత్రమైన భూమిగా భావిస్తుంటారు...

పురాణపరమైన నేపథ్యం గల ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకున్న చోళరాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు వున్నాయి. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన పటిష్ఠమైన నిర్మాణం, చోళరాజుల అసమానమైన భక్తి విశ్వాసాలకు కొలమానంగా నిలుస్తూ వుంటుంది. సముద్ర తీరప్రాంతంలో వుండటం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుంది. భక్తులు సముద్రస్నానం చేసి ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో గల 'సోమేశ్వరుడు'ని భక్తులు స్వయంగా అభిషేకించుకునే అవకాశం వుండటం ఇక్కడి ప్రత్యేకత... అలాగే ప్రతి సంవత్సరం 'మహాశివరాత్రి' సందర్భంగా ఇక్కడ ఘనంగా తీర్థం జరుగుతుంది. ఈ తీర్థంలో పాల్గొనడానికి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. సోమేశ్వరుడిని దర్శించుకోవడం వలన అనుకున్నవి అవలీలగా నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు...


Friday, August 24, 2018

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూత....

 ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూశారు. 1923 ఆగస్టు 14న జన్మించిన ఆయన ఉర్దూ పత్రిక అంజుమ్‌లో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. బ్రిటన్ రాయబారిగా పనిచేశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు.
కులదీప్ నయ్యర్ (జ. ఆగస్టు 14 1923, మ. ఆగష్టు 23 2018 ) భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు మరియు రచయిత. తన జీవితకాలంలో చాలాకాలం వామపక్ష రాజకీయ విశ్లేషకులుగా ఉన్నాడు. ఆయన 1997లో భారత పార్లమెంటు లోని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.
ఆయన బ్రిటిష్ ఇండియా లోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోట్ లో 1923 ఆగస్టు 14న జన్మించాడు. ఆయన తల్లిదంద్రులు పూరన్‌దేవి మరియు గుర్బక్ష్ సింగ్. లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. ఆనర్స్ పూర్తిచేసాడు. తరువాత లాహోర్ లోని లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేసాడు,1952 లో ఆయన నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయం లోని మెడిల్ల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజం చదివాడు,
నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టరుగా పనిచేసాడు. 1975-77 లలో భారత ఎమర్జన్సీలో అరెస్టు అయ్యాడు.ఆయన మానవహక్కుల ఉద్యమకారుడు మరియు శాంతి ఉద్యమకారుడు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యులలో ఒకడు. ఆయన 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమీషనరుగా నియమింపబడ్డాడు. 1997 ఆగస్టులో భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు.

ఆయన 14 భాషలలోని 80 వార్తాపత్రికలలో "ఆప్-ఎడ్" (ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) లో రచనలు చేసాడు, అనేక కాలమ్స్ రాసాడు. ఆయన వ్రాసిన పత్రికలలో "ద డైలీ స్టార్", "ద సండే గార్డియన్,"ద న్యూస్ పాకిస్తాన్,"ద స్టేట్స్‌మన్(ఇండియా)",ఎక్స్‌ప్రెస్ ట్రిబూన్(పాకిస్తాన్)" "డాన్ (పాకిస్తాన్)",అనేవి ముఖ్యమైనవి. తెలుగు దినపత్రిక ఈనాడులో లోగుట్టు శీర్షికన ఆయన వ్యాసాలు ప్రచురితమౌతూంటాయి.
2000 సంవత్సరం నుండి ప్రతీ యేటా ఆయన భారత, పాకిస్తాన్‌ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమృత్ సర్ లోని ఆట్టారి- వాగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నాడు.
శిక్షాకాలం పూర్తయ్యాక కూడా విడుదల కాని భారతదేశ జైళ్ళలో ఉన్న పాకిస్తానీ ఖైదీలు, పాకిస్తాన్ లో ఉన్న భారత ఖైదీలను విడిపించడం కోసం నయ్యర్ పనిచేస్తున్నాడు.నయ్యర్ రాజకీయ వ్యాఖ్యాతగా ప్రస్తుత రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాలను వ్రాస్తున్నాడు. ఆయన అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపాడు. 1971లో తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలపై పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పకపోవటాన్ని నిరసించాడు. పాకిస్తాన్ దురాగతాలే చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసాయి. భారతదేశానికి పాకిస్తాన్ నుండి స్మగుల్ అవుతున్న మాదకద్రవ్యాల పట్ల కూడా పాకిస్తాన్‌ను నిరసించాడు.





Wednesday, August 22, 2018

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్

సైరా నరసింహారెడ్డి టీజర్

చిరంజీవి బర్త్ డే(ఆగష్టు 22) సందర్భంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. భారత ప్రజలమీద అప్పటి బ్రిటీష్ పాలకుల దాష్టీకాల్ని తెరమీద చూపిస్తూ వాటిని ధైర్యంగా ఎదురొడ్డి నిలిచే ధీరుడి పాత్రలో చిరంజీవి కనిపించారు. భారీ సెట్టింగులతో కూడిన నిర్మాణ విలువలు టీజర్ లో కనిపిస్తున్నాయి. వ్యాపారం నిమిత్తం భారతదేశంలోకి ఎంటరైన ఆంగ్లేయులు యావత్ దేశాన్ని హస్తగతం చేసుకుని పాలిస్తున్న తరుణంలో చెలరేగిన మొట్టమొదటి భారతీయుల తిరుగుబాటుగా టీజర్ లో చెప్పారు.  తెలుగు ప్రజల గడ్డ అయిన రాయలసీమ ప్రాంతంలో స్థానికుడైన సైరా నరసింహారెడ్డి బ్రిటీషర్లపై చేసిన వీరోచిత పోరాటం ఈ సినిమా కథాంశం. ఆగష్టు 21 ఉదయం గం.11.30కు ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
చిరంజీవి 151వ సినిమా అయిన సైరా దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్  నిర్మిస్తున్నారు. రేసుగుర్రం సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేస్తారు.




Syeraa Teaser

Friday, August 17, 2018

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి


భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి (1924-2018) గురువారం సాయంత్రం ఢిల్లీలోని అఖిల భారత
వైద్య విజ్ఞాన సంస్థలో పరమపదించారు. వాజపేయి గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. వాజపేయి మరణంతో బీజేపీతోపాటు ఇతర పార్టీల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గత జూన్ నుండి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
 వాజపేయి మరణం పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీతోపాటు ఇతర పార్టీల అధినాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వాజపేయి దాదాపు పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2009లో క్రియాశీల
రాజకీయాల నుండి తప్పుకున్న వాజపేయి లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో వాజపేయిని భారతరత్న అవార్డుతో సత్కరించారు. వాజపేయి మొదటిసారి 1996లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగారు. రెండోసారి 1998లో మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి 11 నెలలు మాత్రమే కొనసాగారు. అయితే 1999లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు మాత్రం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నాయకుడయ్యారు. తన అద్భుతమైన ప్రసంగాలతో దేశ ప్రజల ప్రేమాభిమానాలను
చూరగొన్న వాజపేయి మంచి కవి. ఆయన రాసిన ఒక గేయంలో ‘వెనకనుండి దాడి చేయకుండా ధైర్యంగా ముందునుండి తనపై దాడి చేయాలి’ అంటూ మృత్యువును ఆహ్వానించటం గమనార్హం. దేశ భక్తికి మారుపేరైన వాజపేయి హిందూత్వాన్ని సమర్థించటంతోపాటు ఇతర మతాల పట్ల కూడా సమభావాన్ని ప్రదర్శించి అందరి గౌరవాభిమానాలు సంపాదించుకున్న మహోన్నత నాయకుడు. 1939లో రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్‌లో చేరిన
ఆయన ఆఖరు శ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు. రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే అణు పరీక్షలు నిర్వహించిన వాజపేయి ఆ వెంటనే పాకిస్తాన్‌తో సంబంధాలు
పెంచుకునేందుకు అత్యున్నత స్థాయిలో కృషి చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన ఆఫీస్‌కు పార్థివ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో

అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. మరోవైపు మాజీ పీఎం వాజ్‌పేయి మరణంతో 20 రాష్ర్ట ప్రభుత్వాలు, ఆఫీసులకు, స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం గమనార్హం.








Tuesday, April 10, 2018

యోగా చేసిన కవిత

తంజలి యోగా పీఠం ఆధ్వర్యాన నిజామాబాద్ లో చేపట్టిన ఉచిత యోగా చికిత్స, ధ్యాన శిబిరాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. శిక్షణా శిబిరానికి వచ్చిన వారితో రాందేవ్‌బాబా యోగాసనాలు వేయించారు. యోగా అనేది ఒక్కరోజు చేసే ప్రక్రియ కాదని నిత్య సాధన ఉండాలని రాందేవ్‌బాబా అన్నారు. 2050 నాటికి భారత దేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారతస్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య కోసం లక్షకోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.


Friday, March 16, 2018

తెలుగు నూతన సంవత్సరం....

గాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాదిఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.ఉగాది”, మరియు యుగాదిఅనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగఅనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది”. ‘యుగముఅనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
కొత్త సంవత్సరాన్ని కొంగొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నాయి. నూతనత్వానికి నాంది పలుకుతూ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. తెలుగు సంవత్సరాదికే ఎందుకు ఈ ప్రత్యేకత? ఆ సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? వాటికి అర్థాలేంటి? వంటి విశేషాలు తెలుసుకుందాం..
కోకిలమ్మ రాగాలు, ఘుమఘుమ వంటకాలు, షడ్రుచుల పచ్చడి ఉగాది పర్వదినాన్ని ఆనందమయం చేస్తున్నాయి. ఉగాదిని ఈ సంవత్సరం శ్రీ విలంబి నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. గత ఉగాదిని హేవిళంబి నామంగా పిలుచుకున్నాం. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నాం. ఈ పేర్ల వెనుక ఓ పురాణ గాథ ఉంది. అదేంటంటే విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓ యుద్ధంలో వారంతా చనిపోతారు. నారద మహర్షి విష్ణుని ప్రార్థించగా ఆయన కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారు, ఆ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయంటూ వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా వాడుకలో  ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేమలంబ, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ లుగా ఇలా కాలచక్రంలో నారథ పుత్రులను తలుచుకుంటున్నాం.
అరవై వసంతాలు..
ఈ ఏడాది వచ్చిన శ్రీ విలంబి నామ అర్థమేంటంటే.. "ఘోర''అని అర్థం.ఘోరం అనే పథాన్ని ఎక్కువగా పెద్ద చిక్కు వచ్చేటప్పుడే వాడుతుంటాం!ప్రపంచ పరిస్థితి విషమంగా ఉండవచ్చును. పంటలు కూడా అనుకున్నంతగా ఫలించకపోవచ్చు,అలాగే్ నిత్యం చేసుకునే పూజా కార్యక్రమాల సంకల్పములలో ఉన్న సంస్కృత పదం విలంబ అని ఉంది,
1. ప్రభవ నామ సంవత్సరం : యజ్ఞములు ఎక్కువగా జరుగుతాయని అర్థం.
2. విభవ : ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు.
3. శుక్ల : సమృద్ధిగా పంటలు పండుతాయనే సంకేతమిస్తుంది.
4. ప్రమోదూత : అందరికీ ఆనందం పంచుతుందని అర్థం.
5. ప్రజాపతి : అన్నింటా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది.
6. ఆంగీరస : భోగభాగ్యములు కలగాలనే అర్థాన్నిస్తుంది.
7. శ్రీముఖ : వనరులన్నీ సమృద్ధిగా అందుతాయని అర్థం.
8. భావ : సద్భావనలు, ఉన్నత భావాలు కలిగి ఉండాలని తెలుపుతుంది.
9. యువ : సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి.
10.ధాత : అనారోగ్య బాధలు తొలుగుతాయని, ఔషధాలు ఫలిస్తాయని చెబుతుంది.
11.ఈశ్వర : అందరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్థం.
12. బహుధాన్య : దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది.
13. ప్రమాది : వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి.
14. విక్రమ : సమృద్ధిగా పంటలు పండిస్తూ, అన్నింటా విజయం సాధిస్తారని అర్థం.
15.వృష : వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలుపుతుంది.
16. చిత్రభాను : అంచనాలకు అందని ఫలితాలు పొందుతారు.
17. స్వభాను : ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం.
18. తారణ : సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి.
19. పార్ధివ : సంపద సిద్ధిస్తుంది.
20.వ్యయ : అతివృష్టి, అధిక ఖర్చులని సూచిస్తుంది.
21. సర్వజిత్తు : ప్రజలకు అనుకూలించే వర్షాలు కురుయును.
22. సర్వధారి : అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థం.
23. విరోధి : వర్షాలు తక్కువగా కురుస్తాయి.
24. వికృతి : అశుభ, ప్రతికూల ఫలితాలు సూచిస్తుంది.
25. ఖర : సామాన్య పరిస్థితులు ఉంటాయి
26. నందన : ప్రజలు ఆనందంతో ఉంటారు.
27. విజయ : శత్రువుపై విజయం సాధిస్తారు.
28. జయ : కార్యసిద్ధి, రుగ్మతలను జయిస్తారు.
29. మన్మధ : భోగభాగ్యాలు సిద్ధించి, ఆరోగ్యంగా ఉంటారు. బాధలు తొలిగిపోతాయి.
30. దుర్ముఖి : ఇబ్బందులున్నా క్షేమకర ఫలితాలు పొందుతారు.
31. హేవిళంబి : ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
32. విళంబి : అంతా సుభిక్షంగా ఉంటారిని అర్థం.
33.వికారి : శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
34. శార్వరి : పంటల దిగుబడి సాఽధారణంగా ఉంటుంది.
35. ప్లవ : నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి.
36. శుభకృత : ప్రజలు సుఖంగా జీవిస్తారు.
37. శోభకృత : సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.
38. క్రోధి : కోప స్వభావంతో సామాన్య ఫలితాలు పొందుతారు.
39. విశ్వావసు : ధనం సమృద్ధిగా లభిస్తుంది.
40. పరాభవ : ఓటములు ఎదురవుతాయి.
41. ప్లవంగ : నీరు సమృద్ధిగా లభించును.
42. కీలక : పంటలు విశేషంగా పండుతాయి.
43. సౌమ్య : అందరికీ శుభాలు కలుగుతాయి.
44. సాధారణ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
45.విరోధికృత: ప్రజల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి.
46. పరీధావి: భయాలు కలుగుతాయి.
47. ప్రమాదీచ: ప్రమాదాలు ఎక్కువగా సంభవించును.
48. ఆనంద: అంతా ఆనందమయమేనని అర్థం
49. రాక్షస: క ఠినత్వం పెరగుతుంది. దుస్సంఘటనలు సంభవిస్తాయి
50. నల: సస్య సమృద్ధి కలుగుతుంది
51.పింగళ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
52.కాళయుక్తి: కాలానికి అనుగుణమైన ఫలితాలు వస్తాయి
53.సిద్ధార్థి: అన్ని కార్యాలు సిద్ధిస్తాయి
54.రౌద్రి: బాధలు కలుగుతాయి
55.దుర్మతి: సామాన్య వర్షాలు కురుస్తాయి
56.దుందుభి: ధాన్య సమృద్ధితో పాటు అంతా క్షేమంగా ఉంటారు.
57.రుధిరోద్గారి: ప్రమాదాలు అధికం
58. రక్తాక్షి : అశుభాలకు సంకేతం, సామాన్య ఫలితాలు వస్తాయి
59.క్రోధన: అన్నింటా విజయం సిద్ధిస్తుంది.
60.అక్షయ : అధిక సంపదలను సూచిస్తుంది.