Tuesday, January 15, 2013

గాజువాకలో యువతి దారుణ హత్య



గాజువాకలో యువతి దారుణ హత్య

గరంలోని గాజువాకలో (విశాఖపట్నం)పట్టపగలు దారుణం జరిగింది. మంగళవారం ఉదయం బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న యువతిని ఓ యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్యచేశాడు. శ్రీకన్య థియేటర్ సమీపంలోని స్మైల్ బ్యూటీపార్లర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.వర్సకు మేనమామ అయిన శివ తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించిదని నెపం తో కక్స తో రగిలి పోయి ఈ ధారునానికి పాల్పాడ్డాడని అంటున్నారు ఇలాంటి వాడిని నడిరోడ్ లో ఉరి తీయాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు,
ఇందుకు సంబదించి...స్తానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...
కైలాస్‌నగర్ ప్రాంతానికి చెందిన యు బబిత (19) స్థానికంగా ఉన్న ఎంవిఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి ఇటీవలే చనిపోవటంతో తల్లి, అన్నయ్య, అక్కతో కలిసి ఉంటోంది. సింగపూర్‌లో ఉంటున్న ఆమె మేనమామ శివ (36) ఆరు నెలల క్రితం తిరిగివచ్చి స్థానికంగా ఒక కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బబితను పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడుతూ ఆమె ఇంట్లోవారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగు నెలల క్రితం జాతకాలు చూపించటంతో ఇద్దరి జాతకాలు సరిపోలేదు. దీంతో బబిత తరఫు పెద్దలు పెళ్లి ప్రతిపాదనను పక్కన పెట్టారు. శివ మాత్రం బబితనే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడుతూ వేధించేవాడు. బబిత డిగ్రీ చదువుతూనే గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తుండేది. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా ఆమె బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. ఆమె వెంటే లోపలికి వెళ్లిన శివ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోశాడు. బ్యూటీ పార్లర్‌లో నుండి కేకలు రావడంతో స్థానికులు వచ్చి చూసే సరికి బబిత రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు శివను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు.




Thursday, January 10, 2013

తెలగపాముల జాతికి చెందిన మహిళా దొంగలు పట్టుబడ్డారు,


 రుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
రుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో ఇద్దరు మహిళా నిందితులిని దువ్వాడ జోన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వీరిద్దరూ పాతనేరస్తులని పోలీసులు తెలిపారు. జోన్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ దాసరి రవిబాబు వెల్లడించిన వివరాలు ఇవీ. అగనంపూడి శాంతినగర్‌కు చెందిన కె.సామ్రాజ్యలక్ష్మి కుమార్తె ఉదశ్రీ ఇటీవల అమెరికా నుంచి వచ్చింది. తల్లీ కూతుర్లిద్దరూ ఈనెల ఏడో తేదీన అనకాపల్లి వీనస్ జ్యూయిలరీస్‌కు వెళ్లి పాతబంగారాన్ని ఇచ్చి కొత్త వస్తువులు కొనుగోలు చేశారు. నగల్ని రెండు పర్సుల్లో పెట్టి ఇంటికి వెళ్లేందుకు అనకాపల్లి పెరుగు బజార్ వద్ద ఆటో ఎక్కారు. 

అప్పటికే ఆటోలో కె.కోటపాడు మండలం గొట్లాంకు చెందిన రావాల ఎల్లారమ్మ, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన బండి లక్ష్మి ఉన్నారు. తాము ముందు జంక్షన్‌లోనే దిగిపోతామని చెప్పి సీటు మారుతున్నట్లు నటిస్తూ సామ్రాజ్యలక్ష్మి బ్యాగులోని ఓ పర్సులోని ఆభరణాలు వీరిద్దరూ కాజేసారు. ఆ తర్వాత వచ్చిన జంక్సన్ లో వారు దిగిపోయారు. దీన్ని గమనించని బాధితులు ఇంటికి వెళ్లి బ్యాగ్ లు చూసుకోగా ఓ పర్సులోని ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దువ్వాడ జోన్  సీఐ త్రినాథ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేష్, ఏఎస్‌ఐ సూరిబాబు, సిబ్బంది నిందితుల కోసం నిఘాపెట్టారు. 

బుధవారం ఉదయం అగనంపూడి ఆంజనేయస్వామి గుడివద్ద నిందితులు సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.75 వేల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడైన ఆటో డ్రైవర్ బంకు శ్రీను పరారీలో ఉన్నాడని, అతని వద్ద కొంత సొత్తు ఉందని చెప్పారు. నిందితులిద్దరూ పాతనేరస్తులని, అందుకే వీరి కదలికలపై నిఘా పెట్టామని ఏసీపీ దాసరి రవిబాబు వివరించారు.