Thursday, December 2, 2010

రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11న ఆందోళన : చంద్రబాబు

హైదరాబాద్: రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11న టీడీపీతో సహా ఏడు రాజకీయపార్టీలతో ఆందోలన నిర్వహించనున్నట్లు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. టీడీపీతోపాటు సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా తదితర పార్టీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురువారం టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్గాలు, జల్ తుఫాన్‌వల్ల పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని, ప్రభుత్వం చేతకాని తనంవల్లే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయిని బాబు ధ్వజమెత్తారు.ప్రధాన మంత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రైతులను అదుకునే విషయంలో ఆయనను కలిసి నివేదిక ఇద్దామని వెల్తే తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. కేంద్రంలో మరొక్కసారి ప్రధానితో భేటీ అవుతామని బాబు తెలిపారు. రైతుకు కిట్టుబాటు ధర లభించేలా వత్తిడి తీసుకువస్తామని అన్నారు. అలాగే గోడౌన్‌లలో నిల్వలు పేరుకుపోయాయని, వాటిని ఖాళీ చేయించాలి, కొత్తగా కొనుగోలు చేస్తే వాటిని నిలువ చేయడానికి స్థలమే లేదని బాబు పేర్కొన్నారు. మంత్రుల శేఖల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించలేదని బాబు అన్నారు. రాజీకాయాల కంటే సామాజిక న్యాయం ముఖ్యమని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు డబ్బు పిచ్చి పట్టిందని, ప్రభుత్వం నీతి తప్పితే పరిస్థితులు ఎలా ఉంటాయనడానికి మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది టీడీపీయేనని బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment