Friday, June 13, 2014

నవ్యాంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతులు మీదుగా అవిస్కరించిన సక్సెస్ న్యూస్ మాసపత్రిక...

నవ్యాంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతులు మీదుగా అవిస్కరించిన సక్సెస్ న్యూస్ మాసపత్రిక...

Thursday, June 5, 2014

తెరపైకి వస్తున్న సామాజిక వర్గాలు...!?


కాపు సామాజికవర్గం చంద్రబాబునాయుడుకు ఎన్నికల్లో కాపు కాసిందనే చెప్పాలి. చివరి క్షణంలో పవన్ కళ్యాణ్ ప్రచారం టీడీపీ విజయానికి తోడైంది. ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రెండు ఉపముఖ్యమంత్రి పదవులను చంద్రబాబు ప్రకటించారు. అందులో ఒకటి కాపు సామాజిక వర్గానికి, మరొకటి బి.సి. సామాజికవర్గానికని ముందుగానే చెప్పారు.
ఈ లెక్కన ఈ సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రిని గానీ, అమాత్య పదవి గానీ దక్కడం ఖాయం. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామక్రిష్ణుడు ఉపముఖ్యమంత్రి పదవిపై సుముఖత చూపకపోతే ఆ పదవి జిల్లాకు వరించే అవకాశం ఉంది. 
సుమారు 3 దశాబ్దాలుగా పార్టీ పదవులు, ఒకసారి ఎమ్మెల్సీగా అంతకుముందు కార్పొరేషన్ చైర్మన్ గా వివిధ పదవులు చేపట్టిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప సౌమ్యుడుగా, వివాదరహితుడుగా చంద్రబాబు దృష్టిలో మంచిపేరుంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చినా దేశాన్ని వదలకుండా భక్తిని చాటుకున్నారు రాజప్ప. ముఖ్యంగా యనమల అండదండలూ రాజప్ప కున్నాయి. పార్టీ మారకుండా ఎప్పుడూ అధినేతకు విధేయుడిగానే ఉండటం రాజప్పకు కలిసొచ్చే అంశం.
అమాత్య పదవి రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోటీ పడుతున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాస్త చురుకుపాళ్ళు ఎక్కువగా కనిపించే తోటను యనమల వంటి కీలక నేతలు పక్కన పెట్టాలనే వ్యూహాల్లోనే ఉన్నారు. పార్టీ అడుగు జాడల్లో మసిలే వ్యక్తుల్లో తోట కన్నా.. రాజప్ప బెటరన్న విశ్వాసం పార్టీ పెద్దల్లో ఉంది. తోట త్రిమూర్తులు పార్టీలు మారతారన్న అపనమ్మకం ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది.మరోపక్క జిల్లా కాపునాడు నేతలు, సామాజిక పెద్దలు.. ఉప ముఖ్యమంత్రి పదవి గానీ, అమాత్య పదవి గానీ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో ఉన్న వారికి కేటాయించరాదని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ విద్యా సంస్ధల అధినేత నారాయణ పేరు వినిపించటంపై ఆ సామాజికవర్గమే అభ్యతరం వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ పొత్తుతో గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణను పరిగణనలోకి తీసుకున్నా ఇబ్బంది లేదని కాపు నేతలు అంటున్నారు. 
జిల్లాలో చంద్రబాబు ఇచ్చిన హామీతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రెక్కితిస్తోంది. ఉపముఖ్యమంత్రి లేకుంటే మంత్రిపదవైనా కచ్చితంగా దక్కనుండటంతో ఎవరికి వారు అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.