Thursday, December 2, 2010

ఈ నెల 4న ఆర్కెేబీచ్‌లో నేవీ విన్యాసాలు

నేవీ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 4న ఆర్కెేబీచ్‌లో నేవీ విన్యాసాలు ప్రదర్శించనున్నారు. 1971లో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో కరాచీ హార్బర్‌పై భారత నావికాదళం విజయం సాధించిన సందర్భంగా ఈ నేవీ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆర్కేబీచ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఫ్లాడ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ అనూప్‌సింగ్‌ పాల్గోనున్నారు. నేవీకి చెందిన షిప్‌లు, సబ్‌మెరైన్లు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, ప్రత్యేక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గోనున్నాయి. విశాఖ నగర ప్రజలు ఈ విన్యాసాలను తిలకించడానికి అనుమతిస్తారు. క్రాఫ్ట్‌ ల్యాండింగ్‌ షిప్‌ల దాడులు, మెరైన్‌ కమాండ్‌లు చేసే వివిధ సాహసాలు, స్కై డైవింగ్‌, యాంట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఫైరింగ్‌, బ్యాండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఈ సందర్భంగా నేవీ నిర్వహించనుంది. మొత్తం 22 వార్‌షిప్‌లు, ఆరు రకాల ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వైస్‌ అడ్మిరల్‌ అనూప్‌సింగ్‌ ఇంటి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment