Sunday, January 30, 2011

చేనేత సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా – చిరు


రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెస్తామని ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రాఘవేంద్రస్వామి కళ్యాణమండపంలో జరిగిన చేనేతల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ తాను ప్రాజారాజ్యం పార్టీని స్థాపించగానే తొలుత దృష్టిపెట్టింది చేనేత పరిశ్రమపైనేనన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, చేనేత పరిశ్రమలు పట్టుకొమ్మలన్నారు. నేడు అవి నీరుకారిపోతున్నాయన్నారు. ప్రజలకు కట్టుకోవడానికి బట్టలిచ్చి నాగరికతను నేర్పిన నేత కార్మికులు నేడు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మెట్టమెదట అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి 312కోట్ల రూపాయల ప్యాకేజి మంజూరుకు కృషి చేసిన ఘనత తమదేనన్నారు. తాను సిరిసిల్లకు వెళ్ళి వచ్చిన తర్వాత అధికార పార్టీనేతలు వెళ్ళారన్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగానే చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. మరమగ్గాలతో చేనేత పరిశ్రమ అంతరిస్తోందన్నారు.  చేనేత పరిశ్రమను కాపాడడానికి 11రకాల చేనేత వస్త్రలపై కేంద్రప్రభుత్వం రిజర్వేషన్‌ పెడితే అది అమలు కావడం లేదని చిరంజీవి విచారం వెలిబుచ్చారు. పవర్‌ లూమ్స్‌ లో చేనేత వస్త్రలు విపరీతంగా ఉత్పత్తి అవుతుండడంతో చేనేత పరిశ్రమ క్షీణిస్తోందన్నారు. దీనికితోడు మైక్రో ఫైనాన్స్‌ ల బెడద అధికమయ్యాయన్నారు. పట్టుముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో కిలో వార్పు ధర 1400లుండగా నేడు రూ.3400లకు పెరిగిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. దీంతో ఇటీవల ధర్మవరంలో ముగ్గురు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వారి కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.25వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు చేనేత కార్మికులకు పట్టుముడి పదార్థాలను అందించి ఆదుకోవాలన్నారు. ఆప్కో ద్వారా చేనేత చీరలను కొనుగోలు చేయాలన్నారు. ఆప్కో రిబేటు శాతాన్ని 40కి పెంచాలన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కోఆప్‌ టెక్స్‌ వారు 40శాతం రిబేటుతో విక్రయిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం రిబేటు శాతాన్ని ఆప్కోకు పెంచడం లేదన్నారు. 20శాతం వున్న రిబేటును 40శాతానికి పెంచాలని గతంలో ముఖ్యమంత్రిగా వున్న రోశయ్యను తాను కోరగా ఆయన స్పందించి 30శాతానికి పెంచారన్నారు. ఆ ఘనత కూడా తనకే దక్కిందన్నారు. కనుక 40శాతం రిబేటుకు పెంచేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. సిరిసిల్ల మాదిరి అనంతపురం జిల్లా చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సమావేశంలో చేనేత కార్మికుల పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆర్‌. అశ్వత్థ నారాయణ, పి. సుబ్రహ్మణ్యం, ఎస్‌. పురుషోత్తం గౌడ్‌, పి. రామాంజ నేయులు, జి. జ్ఞానలోలుడు, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వర్‌ రావ్‌, డి.టి.నాయక్‌, వి.పద్మ, కె.శ్రీకాంత్‌ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. సమావేశంలో ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సదాశివరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి. చలపతి, నాయకులు టి.జె.ప్రకాష్‌, రమాదేవి, యువరాజ్యం అధ్యక్షుడు రాజు, ఎల్‌.పి.బాబు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రం కసరత్తు

తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు గాను ఫిబ్రవరిలో మరోమారు సమావేశానికి హోం మంత్రి చిదంబరం రెడీ అవుతున్నారు. అయితే వచ్చే నెలలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని పార్టీలన్నీ హాజరు అవుతాయా అన్నది సస్పెన్స్‌గా మారింది. బడ్జెట్ సమావేశాల ముందే ఏపిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థతికి తెరదించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మరో దఫా అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరు సిఫార్సులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని యుపిఎ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళుతున్న హోంమంత్రి చిదంబరం ఈ నెల 30న ఢిల్లీ తిరిగి రానున్నారు. ఫిబ్రవరి 1న జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ అంశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్..వారి ముందు ప్రస్తావనకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించారు. దీంతో తెలంగాణపై ప్రాధమికంగా యుపిఎ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఇక జనవరి 6న నిర్వహించిన అఖిల పక్ష భేటీకి కేవలం ఐదు పార్టీలు హాజరు కాగా, వచ్చే నెలలో నిర్వహించబోయే సమావేశానికి అన్ని పార్టీలు హాజరు అవుతాయని కేంద్రం ఆశిస్తోంది. రిపబ్లిక్ వేడుకల నేపధ్యంలో హోం శాఖ వర్గాలు బిజీగా వుండటంతో తెలంగాణపై కొంత మేర స్థబ్దత ఏర్పడిందని ఆ వర్గాలు అంటున్నాయి. 

Saturday, January 29, 2011

18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు



అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా వేయవలస ఉన్నందున శుక్రవాం సమావేశం ఏర్పాటు చేసిన పక్షంలో శని, ఆదివారాలు సభను వాయిదే వేసే వెసులు బాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున 45 రోజులకు సరిపడ ఎజెండాను ఖరాలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ పద్దుల వారిగా కసరత్తు చేసింది. కేంద్ర సహయం, రాష్ట్ర వ్యయం అంచనా వేసింది. రాబడులు ఆశాజనకంగానే ఉన్నందున బడ్జెట్‌ను లక్ష కోట్లకు మించి ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. శాఖల వారిగా డిమాండ్ల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించే విధంగా అధికారుల స్ధాయిలో చర్యలు ప్రారంభించారు.  ఆదాయ, వ్యయాలు, సంక్షేమ పద్దులు, నిర్వహణ భారం తదితర అంశాలు పూర్తి స్దాయి పద్దుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలు ఎలాగున్నప్పటికీ రాజ్యాంగ బద్దమైన చర్యలకు ఆటంకం కలగని విధంగా చర్యలు ప్రధానం అని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా జరిగే అవకాశం లేదు. శాసన మండలికి కొంత మందిని ఎంపిక చేసుకొనే ప్రక్రియ ఉన్నందున పూర్తి స్దాయిలో మార్చి 31 వరకు సభ జరిపించే విధంగా ఎజెండాను రూపొందించాలని ప్రభుత్వం నుండి సంబంధింత అధికారులకు ఆదేశాలు అందాయి.  దాదాపు 30 రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. శాసనమండలి సభ్యులు సుమారు 29 మంది పదవి కాలం పూర్తి కావస్తున్నందున కొత్త వారి ఎన్నిక అధికార పక్షానికి కత్తి మీద సాముగానే ఉంది. జగన్‌ వర్గం బలపడుతుందని భావించి ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వాదులను కౌన్సిలింగ్‌ చేయడం ప్రారంభించారు. పార్టీని బలోపేదం చేసే దిశగా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తన స్ధాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధుల్లో మాత్రం ఇంకా అయోమయం కొనసాగుతునే ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత వేదికల్లో జగన్‌ ఎంత మందిని చీల్చగలడనే చర్చ ఊపందుకుంది. బహిరంగంగా జగన్‌పై విమర్శలు చేస్తున్నవారిలో కొందరు, ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటారని భావిస్తున్న వారిలో కొందరు స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.జగన్‌ 2014 ఎన్నికల వరకు ఓపిక పట్టే విధంగా లేడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పద్దులపై చర్చకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ బిల్లులు ఆమోదింపచేసుకొనడం ప్రధానం అనే భావనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు అంతగా అనుకూలించనప్పటికీ సభ నిర్వహణలో పెద్దగా ఆటంకం ఉండబోదనే ధైర్యం ప్రభుత్వం నుండి వ్యక్తం అవుతుంది. ఇప్పటి నుండే అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి పూనుకున్నందున, అవసరమైన పక్షంలో అధిష్టానం జోక్యం చేసుకొని సభ్యుల మధ్య సక్యత లోపించని విధంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేక పోలేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో కొన్నింటికి మార్పులు చేర్పులు ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రాజకీయ రచ్చబండను తలపించే విధంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అంశంతో పాటు ప్రభుత్వం బల నిరూపన కూడా చర్చనీయాశం కాబోతుంది. జగన్‌ వర్గీయులు ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బల నిరూపన చేసుకోవాలని బహిరంగంగా సవాల్‌ చేశారు. ఆలాంటి పరిస్ధితి ఉత్పన్నమైన పక్షంలో వ్యవహరించవలసిన వ్యూహంపై కూడా మంతనాలు సాగుతున్నాయి. ప్రభుత్వ మనుగడ అసెంబ్లీ సమావేశాలలోనే తేలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటిపై ప్రతిపక్ష నేత ఎన్‌. చంద్రబాబు చేసిన డిమాండ్‌ పై అసెంబ్లీలో చర్చకు తెరలేపడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ అంశం, జగన్‌ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశాలు కాబోతున్నాయి.ఫిబ్రవరి 18 నుండి అసెంబ్లీ – బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వంఅసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా వేయవలస ఉన్నందున శుక్రవాం సమావేశం ఏర్పాటు చేసిన పక్షంలో శని, ఆదివారాలు సభను వాయిదే వేసే వెసులు బాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున 45 రోజులకు సరిపడ ఎజెండాను ఖరాలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ పద్దుల వారిగా కసరత్తు చేసింది. కేంద్ర సహయం, రాష్ట్ర వ్యయం అంచనా వేసింది. రాబడులు ఆశాజనకంగానే ఉన్నందున బడ్జెట్‌ను లక్ష కోట్లకు మించి ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. శాఖల వారిగా డిమాండ్ల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించే విధంగా అధికారుల స్ధాయిలో చర్యలు ప్రారంభించారు.  ఆదాయ, వ్యయాలు, సంక్షేమ పద్దులు, నిర్వహణ భారం తదితర అంశాలు పూర్తి స్దాయి పద్దుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలు ఎలాగున్నప్పటికీ రాజ్యాంగ బద్దమైన చర్యలకు ఆటంకం కలగని విధంగా చర్యలు ప్రధానం అని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా జరిగే అవకాశం లేదు. శాసన మండలికి కొంత మందిని ఎంపిక చేసుకొనే ప్రక్రియ ఉన్నందున పూర్తి స్దాయిలో మార్చి 31 వరకు సభ జరిపించే విధంగా ఎజెండాను రూపొందించాలని ప్రభుత్వం నుండి సంబంధింత అధికారులకు ఆదేశాలు అందాయి.  దాదాపు 30 రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. శాసనమండలి సభ్యులు సుమారు 29 మంది పదవి కాలం పూర్తి కావస్తున్నందున కొత్త వారి ఎన్నిక అధికార పక్షానికి కత్తి మీద సాముగానే ఉంది. జగన్‌ వర్గం బలపడుతుందని భావించి ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వాదులను కౌన్సిలింగ్‌ చేయడం ప్రారంభించారు. పార్టీని బలోపేదం చేసే దిశగా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తన స్ధాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధుల్లో మాత్రం ఇంకా అయోమయం కొనసాగుతునే ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత వేదికల్లో జగన్‌ ఎంత మందిని చీల్చగలడనే చర్చ ఊపందుకుంది. బహిరంగంగా జగన్‌పై విమర్శలు చేస్తున్నవారిలో కొందరు, ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటారని భావిస్తున్న వారిలో కొందరు స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.జగన్‌ 2014 ఎన్నికల వరకు ఓపిక పట్టే విధంగా లేడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పద్దులపై చర్చకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ బిల్లులు ఆమోదింపచేసుకొనడం ప్రధానం అనే భావనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు అంతగా అనుకూలించనప్పటికీ సభ నిర్వహణలో పెద్దగా ఆటంకం ఉండబోదనే ధైర్యం ప్రభుత్వం నుండి వ్యక్తం అవుతుంది. ఇప్పటి నుండే అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి పూనుకున్నందున, అవసరమైన పక్షంలో అధిష్టానం జోక్యం చేసుకొని సభ్యుల మధ్య సక్యత లోపించని విధంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేక పోలేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో కొన్నింటికి మార్పులు చేర్పులు ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రాజకీయ రచ్చబండను తలపించే విధంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అంశంతో పాటు ప్రభుత్వం బల నిరూపన కూడా చర్చనీయాశం కాబోతుంది. జగన్‌ వర్గీయులు ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బల నిరూపన చేసుకోవాలని బహిరంగంగా సవాల్‌ చేశారు. ఆలాంటి పరిస్ధితి ఉత్పన్నమైన పక్షంలో వ్యవహరించవలసిన వ్యూహంపై కూడా మంతనాలు సాగుతున్నాయి. ప్రభుత్వ మనుగడ అసెంబ్లీ సమావేశాలలోనే తేలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటిపై ప్రతిపక్ష నేత ఎన్‌. చంద్రబాబు చేసిన డిమాండ్‌ పై అసెంబ్లీలో చర్చకు తెరలేపడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ అంశం, జగన్‌ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశాలు కాబోతున్నాయి.

రామోజీ రావు వర్సెస్ వైయస్ జగన్


ఈనాడు దినపత్రిక రామోజీరావు, సాక్షి మీడియా అధిపతి వైయస్ జగన్ మధ్య మరోసారి వార్ చోటు చేసుకుంది. సాక్షి మీడియాలో పెట్టుబడులపై రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక కింద వార్తాకథనం ప్రసారమైంది. మొదటి పేజీ, రెండో పేజీ మొత్తం అదే వార్తాకథనంతో నిండిపోయాయి. సాక్షి మీడియాకు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై, అందులో ఎవరెవరు పట్టుబడులు పెట్టారనే విషయంపై పూర్తి వివరాలతో ఆ కథనం ప్రచురితమైంది. దీంతో జగన్ వర్గం ఎదురు దాడికి దిగింది. సాక్షి టీవీ చానెల్‌లో జగన్ వర్గానికి చెందిన నాయకులు రామోజీరావుపై దుమ్మెత్తి పోస్తున్నారు. సినీ నటి రోజా రామోజీ రావును తప్పు పట్టారు. వార్తాకథనాన్ని ప్రచురించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పాపం - అవినీతి కూపం సాక్షి అంటూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. జగన్ సాక్షి మీడియాలో పెట్టింది 8 లక్షల రూపాయలు మాత్రమేనని, ఇతరుల నుంచి కొట్టింది 1246 కోట్ల రూపాయలని ఈనాడు దినపత్రిక ఆరోపించింది.ఈనాడు వార్తాకథనం లీడ్ ఇలా సాగింది - సాక్షిని నడిపేది 'జగతి పబ్లికేషన్స్‌' సంస్థ. దీనికి ప్రారంభ పెట్టుబడి రూ.73.56 కోట్లు. ఆ మొత్తం జగన్‌ ప్రమోటర్‌గా ఉన్న 'కార్మెల్‌ ఏషియా' అనే కంపెనీ నుంచి వచ్చింది. కార్మెల్‌ ఏషియాలో జగన్‌ వ్యక్తిగత పెట్టుబడి అక్షరాలా రూ.8 లక్షలు! జగన్‌కే చెందిన మరో కంపెనీ సండూర్‌ పవర్‌ మరో రూ.12 కోట్లు సమకూర్చింది. ఈ రూ.12 కోట్ల 8 లక్షలూ పోను... మిగతాదంతా కూడా... వైఎస్‌ ప్రభుత్వం ద్వారా భారీ ప్రయోజనాలు దక్కించుకున్న మ్యాటిక్స్‌ ప్రసాద్‌ సంస్థలు, పెన్నా ప్రతాపరెడ్డి సంస్థ, ఇండియా సిమెంట్స్‌, ల్యాంకో గ్రూప్‌కు చెందిన జూబ్లీ మీడియా సంస్థల వంటివి తెచ్చి పెట్టినవే. అయితే ఇంతటి మొత్తాలు తెచ్చినా 'జగతి'లో ఆ సంస్థల మొత్తం వాటా 30.69 శాతం. చాలా తక్కువగా పెట్టుబడి పెట్టిన జగన్‌ సంస్థల వాటా మాత్రం 69.31 శాతం! ఇక్కడే ఉంది అసలు కిటుకు."జగన్‌ దందాల యాత్రలో 'సాక్షి' ఒక పిసరు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఆగమేఘాల మీద అనుమతులు, భారీ సున్నపురాయి నిక్షేపాలు, ఉద్దర పెట్టుబడులతో ఆరంభమైన 'భారతీ సిమెంట్స్‌' ఇప్పటికే వేల కోట్లు కురిపించింది. అటు ప్రభుత్వాధికారాన్నీ.. ఇటు కార్పొరేట్‌ చట్టాలనూ ఏకకాలంలో కాలరాస్తూ వై.ఎస్‌. తండ్రీతనయులు నిర్భీతిగా సాగించిన బడా దోపిడీ గురించి ఎవరెంతగా మొత్తుకున్నా.. ఇన్నేళ్లుగా పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఆ అక్రమ దందాల దూకుడుకు కళ్లెం వేసే సత్తా ఉన్నవారే కరవయ్యారు" అని ఈనాడు వ్యాఖ్యానించింది. ఆ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, పెట్టుబడులు పెట్టిన సంస్థల వివరాలను ఈనాడు దినపత్రిక ఇచ్చింది.

ధరలు దించకపోతే ఢిల్లీలోనే పోరాటం! చిరంజీవి


అనంతపురం, :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలా జరగని పక్షంలో ఢిల్లీలోనే పోరాటం చేస్తామని ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హెచ్చరించారు. శుక్రవారం ఆయన నగరంలోని శివబాలయోగి ఆశ్రమంలో విలేఖరులతో మాట్లాడుతూ రెండు చానళ్లు పనిగట్టుకుని తనను ప్రజలకు, రాజకీయాలకు దూరంచేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తాను దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశం కల్పిస్తే ప్రజారాజ్యం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పనిచేస్తుందన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నంతవరకు అవాస్తవ కథనాలతో ఏమీ కాదన్నారు. జిల్లా పిఆర్‌పిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కొన్ని చానళ్లు తమ స్వలాభం కోసం అవాస్తవ కథనాలల్లుతున్నాయన్నారు. జగన్ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న పిఆర్‌పి ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతున్నదన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే కర్నాటకలో కూడా తమ అభ్యర్థులను బరిలో దింపుతామన్నారు.
రాజకీయాలు వీడే ప్రసక్తే లేదు
ధర్మవరం: తాను రాజకీయాలు వీడే ప్రసక్తి లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజల అభిమానం, ఆశీస్సులే ఆక్సిజన్‌గా స్వీకరించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తూ రాజకీయాల్లో కొనసాగుతానని ధర్మవరం సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ.... అంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అశేష జనవాహిని కేరింతల మధ్య తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనలో భాగంగా అనంతపురం నుండి బత్తలపల్లి మీదుగా ధర్మవరం చేరుకున్న చిరుకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌టి ఆర్‌సర్కిల్‌లో హాజరైన జనవాహినినుద్దేశించి చిరు ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ ప్రజాసమస్యలను ఎప్పుడు ప్రస్తావించినా తాను వాటిని ప్రభుత్వదృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పక్క రాష్ట్రాల్లో చేతివృత్తులను ప్రోత్సహిస్తూ వాటిని ఎలా పరిరక్షించుకుంటున్నారో ఆ విధానాలనే ఇక్కడి ప్రభుత్వం అనుసరిస్తే నేతన్న స్థితి కొంతమేర మారుతుందన్నారు. ఆప్కోలో ఉన్న 25 శాతం రిబేట్‌ను తొలగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, తమిళనాడులో 40శాతం రిబేట్ ఇస్తూ చేనేతను ఆ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. గతంలో తాను ధర్మవరం వచ్చినప్పుడు ఓ చేనేత కార్మికుడు పట్టుచీరను బహూకరించి అమ్మకు ఇవ్వమని చెప్పిన సంఘటనను మరువలేనన్నారు. చేనేత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం స్పందించేదాకా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా: జగన్ డిమాండ్


7న ప్రారంభం కానున్న యువనేత పాదయాత్ర... 9న పోలవరంలో బహిరంగ సభ
మెట్ట ప్రాంతాల్లోనూ పాదయాత్ర చేపట్టాలని అభ్యర్థనలు..
 ఈ నేపథ్యంలో ఆదివారం ఖరారు కానున్న షెడ్యూలు... వివరాలు వెల్లడించిన మాజీమంత్రి  బోసు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వచ్చేనెల 7 నుంచి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారని మాజీ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి సీఆర్సీ ఓల్డేజ్ హోమ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువనేత పాదయాత్ర షెడ్యూల్ వివరించారు. యాత్ర 7న రావులపాలెంలో ప్రారంభమవుతుందని, 9వ తేదీన పోలవరంలో ముగుస్తుందని, అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుందని బోస్ వివరించారు. 70 కిలోమీటర్ల మేర మూడ్రోజులపాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మెట్ట ప్రాంతాలకు అధిక ప్రయోజనం కలుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పాదయాత్ర జరపాలని అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యులతో సమావేశమై యాత్ర తాలూకు తుది షెడ్యూలు ఖరారు చేస్తామని సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా డెల్టా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు మేలు జరుగుతుందని బోస్ పేర్కొన్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.20 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతోపాటు వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభించిన ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరైమైన 69 టీఎంసీల నీరు అందుతుందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌కు 78 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. పోలవరం పూర్తి కాకుంటే ఉభయ గోదావరి జిల్లాల రైతులకు మొదటి పంట కూడా పండించుకోలేని ప్రమాదం పొంచి ఉందని బోస్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ పరిధిలో సాగుభూమి పూర్తిగా వినియోగంలోకి రావాలంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాల్సిందిగా సర్ ఆర్థర్ కాటన్ గతంలోనే సూచించారని బోస్ గుర్తు చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న దివంగత నేత వైఎస్ పోలవరానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన హయాంలో పూర్తయిన 35 శాతం పనులు తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని బోస్ విమర్శించారు. వివిధ శాఖలకు చెందిన 17 రకాల అనుమతులతోపాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అనుమతి ఉన్నా పోలవరానికి జాతీయ హోదా ప్రకటించకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ బతికుండగా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ముంపు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకున్నా, కేంద్రం రోజుకో కొర్రీ వేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.పోలవరం పూర్తయితే ఐదు జిల్లాల్లో సుమారు 22.70 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని, 80 టీఎంసీల నీరు కృష్ణాకు మళ్లించే అవకాశం ఉంటుందని బోస్ వివరించారు. దీంతో కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, తెలంగాణకు మరింత నీరు అందించవచ్చని తెలిపారు. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 520 గ్రామాలకు తాగునీటి అవసరాలు, ఏలేరు ఆయకట్టుకు పుష్కలంగా నీరు వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఇందుకోసం నడుం బిగించాలని బోస్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పుష్కర ఎత్తిపోతల పథకం అవసరం లేదని ఎందరో నిపుణులు సూచించినా వైఎస్.. వెనుకడుగు వేయలేదన్నారు. మరో రూ. 168 కోట్లు మంజూరు చేస్తే పుష్కర పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతుల ఆందోళనను గుర్తించిన జగన్ పాదయాత్ర చే యాలన్న నిర్ణయం తీసుకున్నారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొని యువనేతకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వెదిరేశ్వరం సర్పంచ్ బొక్కా వెంకటలక్ష్మి,రావులపాలెం నీటి సంఘం అధ్యక్షుడు గొలుగూరి మునిరెడ్డి, రావులపాలెం కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు మన్యం భాను, సీఆర్‌సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, సీఆర్‌సీ మెంబర్ కర్రి సత్తిరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోపెల్ల మల్లి, సీఆర్‌సీ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వెంకటరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణ, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, నీరజారాణి తదితరులు పాల్గొన్నారు.

Friday, January 28, 2011

గందరగోళం లో ఆంధ్రప్రదేశ్


తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తప్ప మరేదానికి ఒప్పుకోమని ఆ ప్రాంత నేతలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు .. నేతల సమాలోచనలతో శీతాకాలంలోనూ రాష్ట్రంలో వేడివేడి వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై కేంద్రం మనసులో ఏమున్నా ప్రత్యేక రాష్ర్టం తప్ప సమస్యకు వేరే పరిష్కారం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గట్టి పట్టుదలతో ఉండగా.ప్రధాన ప్రతిపక్షం మాత్రం అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు కొత్త కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులనుంచి బయటపడేందుకు అధిష్టానం తీవ్రంగా యోచిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్టీల ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందలో భాగంగా ఢిల్లీలో రాత్రి కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. శ్రీకృష్ణకమిటీ రిపోర్టుతో పాటు తెలంగాణ అంశంపై ఈ మీటింగ్ లో దాదాపు గంటసేపు చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో మరోమారు సమావేశం నిర్వహించిన తర్వాతే , మిగిలిన వారితో చర్చలు జరపాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రావద్దని జోరుగా పావులు కదుపుతున్నారు.ప్రణబ్‌లాంటి పెద్దలు ఢిల్లీలో కూర్చోబెట్టి ఎన్ని చెప్పినా బిల్లు పెట్టకపోతే రాజీనామే శరణ్యమని ఎంపీలు హెచ్చరిస్తున్నారు. దీంతో అఖిలపక్షం భేటీలోగా ఎంపీలతో మరోమారు సమావేశమవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉద్యమానికి ఒక రూపం ఇచ్చేందుకు ఆ ప్రాంత నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దశల వారిగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నెలాఖరు నాటికి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయలను చెప్పిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచించాలన్నది వారి భావన. ఏదేమైనా పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే ఎంతకైనా తెగించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రెడీ అయ్యారు. రాజీనామాలే కాదు ఆమరణ దీక్షలకు కూడా వారు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఇలావుంటే టీడీపీ వారిది మరోలా వుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన స్వేఛ్చతో తెలంగాణా అంశంపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్న నేతలు సోమవారం నాడు విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి భవిష్య కార్యాచరణను ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కాలయాపనతో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కుట్ర పూరిత వ్యూహాన్ని ప్రజల ముందు ఉంచాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అన్ని ప్రాంతాలలో సమిష్టిగా బస్సు యాత్ర నిర్వహించి సభలు నిర్వహించడం ద్వారా మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఎండగట్టాలన్నది వ్యూహం. రెండు మూడు రోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి ఉద్యమబాట పట్టాలని ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Wednesday, January 26, 2011

దేశ సౌభాగ్యానికి మరో హరిత విప్లవం – గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి సందేశం


మొదటి హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన మన దేశం మరింత సౌభాగ్యవంతం కావడానికి మరో హరిత విప్లవం రావాలని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ దేవీసింగ్‌ పాటిల్‌ పిలుపు ఇచ్చారు.తొలి హరిత విప్లవం నీటి పారుదల ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం  అయిందనీ, రెండో హరిత విప్లవం వర్షాధార ప్రాంతాలకు విస్తరించవలసి ఉందని ఆమె స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ఆమె జాతి నుద్దేశించి ప్రసంగించారు. పెరిగిన సంపద అన్ని వర్గాలకూ పంపిణీ అయినప్పుడే అభివృద్ధి సార్ధకమైనట్టని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం బయటపడటం ఆనంద దాయకమని ఆమె అన్నారు. సంక్షోభానికి ముందు ఉన్న వృద్ధి రేటు కోసం యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, 9 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.మన దేశంలో ఎక్కువ మంది ఈనాటికీ వ్యవసాయ రంగం మీదే ఆధార పడి జీవిస్తున్న దృష్ట్యా, వ్యవసాయం లాభసాటి అయ్యేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ, అయితే, తరచు సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల స్థితిగతుల్లో మార్పు కనిపించడం లేదని ఆమె అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, ప్రోసెసింగ్‌, మార్కెటింగ్‌, పరిశోధన, అభివృద్ధి రంగాలన్నింటిలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలనీ, భూమి హక్కులు, ఉత్పత్తులపై వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో రైతులకు మెరుగైన రాబడులు అందించే బాధ్యతను కార్పొరేట్‌ రంగం చేపట్టాలనీ, ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశమని ఆమె అన్నారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్య వసతులు కల్పించాలనీ, మహిళా సాధికారత, ఉన్నత ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలనీ,కీలకమైన జాతీయ లక్ష్యాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలని ఆమె సూచించారు.పార్లమెంటు ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక అనీ, పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా ,సజావుగా పనిచేసేట్టు చూడటం ప్రభుత్వం,ప్రతిపక్షాల బాధయత అని ఆమె అన్నారు. పార్లమెంటు గౌరవ మర్యాదలు నిలిచేలా చూడటం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఎంతటి జటిలమైన సమస్యలపైనైనా ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిర్మాణాత్మక, సహకార ధోరణి ఉన్నప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.తమ సమస్యలను చట్టసభల సభ్యులు చర్చించి, వాటికి పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే ఆ సంస్థల పట్ల గౌరవం నిలుస్తుందనీ, ఇది జరగకపోతే ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిలుతుందని ఆమె హెచ్చరించారు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న నేరప్రవృత్తిని తగ్గించేందుకు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇందుకు తల్లితండ్రుల సహకారం కూడా ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ మంచి ఎక్కడ ఉన్న స్వీకరించే గుణాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. చారిత్రక విలువలను ముందుకు నడిపించే బాధ్యతను యువత చేపట్టాలనీ, భావిభారత పౌరులైన నేటి బాలబాలికలను సత్పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజంలో బలహీన, అట్టడుగు వర్గాలకూ, అల్పసంఖ్యాక వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలనీ, తరతరాలుగా అణగారిన వర్గాలకు చేయూత నివ్వడం ద్వారా వారిని కూడా సమాజంలో ఇతర వర్గాల స్థాయికి తీసుకుని రావాలని ఆమె సూచించారు. అలాగే,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా వాటిని పటిష్టంగా అమలు జరపాలని ఆమె సూచించారు.దేశ సౌభాగ్యానికి మరో హరిత విప్లవం – గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి సందేశంమొదటి హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన మన దేశం మరింత సౌభాగ్యవంతం కావడానికి మరో హరిత విప్లవం రావాలని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ దేవీసింగ్‌ పాటిల్‌ పిలుపు ఇచ్చారు.తొలి హరిత విప్లవం నీటి పారుదల ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం  అయిందనీ, రెండో హరిత విప్లవం వర్షాధార ప్రాంతాలకు విస్తరించవలసి ఉందని ఆమె స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ఆమె జాతి నుద్దేశించి ప్రసంగించారు. పెరిగిన సంపద అన్ని వర్గాలకూ పంపిణీ అయినప్పుడే అభివృద్ధి సార్ధకమైనట్టని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం బయటపడటం ఆనంద దాయకమని ఆమె అన్నారు. సంక్షోభానికి ముందు ఉన్న వృద్ధి రేటు కోసం యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, 9 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.మన దేశంలో ఎక్కువ మంది ఈనాటికీ వ్యవసాయ రంగం మీదే ఆధార పడి జీవిస్తున్న దృష్ట్యా, వ్యవసాయం లాభసాటి అయ్యేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ, అయితే, తరచు సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల స్థితిగతుల్లో మార్పు కనిపించడం లేదని ఆమె అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, ప్రోసెసింగ్‌, మార్కెటింగ్‌, పరిశోధన, అభివృద్ధి రంగాలన్నింటిలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలనీ, భూమి హక్కులు, ఉత్పత్తులపై వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో రైతులకు మెరుగైన రాబడులు అందించే బాధ్యతను కార్పొరేట్‌ రంగం చేపట్టాలనీ, ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశమని ఆమె అన్నారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్య వసతులు కల్పించాలనీ, మహిళా సాధికారత, ఉన్నత ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలనీ,కీలకమైన జాతీయ లక్ష్యాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలని ఆమె సూచించారు.పార్లమెంటు ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక అనీ, పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా ,సజావుగా పనిచేసేట్టు చూడటం ప్రభుత్వం,ప్రతిపక్షాల బాధయత అని ఆమె అన్నారు. పార్లమెంటు గౌరవ మర్యాదలు నిలిచేలా చూడటం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఎంతటి జటిలమైన సమస్యలపైనైనా ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిర్మాణాత్మక, సహకార ధోరణి ఉన్నప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.తమ సమస్యలను చట్టసభల సభ్యులు చర్చించి, వాటికి పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే ఆ సంస్థల పట్ల గౌరవం నిలుస్తుందనీ, ఇది జరగకపోతే ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిలుతుందని ఆమె హెచ్చరించారు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న నేరప్రవృత్తిని తగ్గించేందుకు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇందుకు తల్లితండ్రుల సహకారం కూడా ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ మంచి ఎక్కడ ఉన్న స్వీకరించే గుణాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. చారిత్రక విలువలను ముందుకు నడిపించే బాధ్యతను యువత చేపట్టాలనీ, భావిభారత పౌరులైన నేటి బాలబాలికలను సత్పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజంలో బలహీన, అట్టడుగు వర్గాలకూ, అల్పసంఖ్యాక వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలనీ, తరతరాలుగా అణగారిన వర్గాలకు చేయూత నివ్వడం ద్వారా వారిని కూడా సమాజంలో ఇతర వర్గాల స్థాయికి తీసుకుని రావాలని ఆమె సూచించారు. అలాగే,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా వాటిని పటిష్టంగా అమలు జరపాలని ఆమె సూచించారు.

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం, సిఎం వ్యాఖ్యలే నిదర్శనం: చంద్రబాబు


పరిటాల రవి హత్యలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పాత్ర ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో తేటతెల్లమయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం గుంటూరు జిల్లాలో వ్యాఖ్యానించారు. రైతుకోసం యాత్ర పేరుతో రెండురోజుల గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల హత్య జరిగి ఆరేళ్లయినా కేసు ఓ కొలిక్కి రాలేదన్నారు. హత్య కేసులో సిబిఐ విచారణ సరిగా లేదన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను ఇంతవరకు పట్టుకోలేక పోవడం దారుణమన్నారు. కృష్ణా జలాల్లో రాబోయే యాభై సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ నష్టపోనుందని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి నీతిమాలిన చర్యల వల్ల, చేతకానితనం వల్లే ఈ నష్టం జరిగిందని ఆరోపించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించి పత్రికలు, ఛానల్లు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక పోతుందని అన్నారు. ధరలు అదుపు చేయటంలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నాయన్నారు. దోపిడీదారులు దోచుకున్న ధనాన్ని ప్రభుత్వం రికవరీ చేయలేకపోతుందని అన్నారు.పరిటాల రవి హత్య కేసులో పూర్తి విచారణ జరిపించాలని టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమ విజయవాడలో డిమాండ్ చేశారు. హవాలా కేసులో జగన్‌కు సంబంధం ఉన్న కారణంగా ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఆయన కోరారు. జగన్ కొత్త పార్టీ పెట్టడానికి తండ్రి హయాంలో దోచిన వేలకోట్ల రూపాయలను బెంగుళూరులో, ఇడుపులపాయలో దాచిపెట్టారని ఆరోపించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ అక్రమ ఆస్తులను అన్నింటిని వెలికి తీయాలని సవాల్ చేశారు.

క్లైమాక్స్ చేరిన రాజకీయం: కిరణ్ కుమార్ రెడ్డితో అమితుమీకే జగన్ రెడీ..!!

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవడానికే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సిద్ధపడినట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, తనపై కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధపడాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే, తమంత తాము ప్రభుత్వాన్ని కూల్చినట్లు అనిపించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని రెచ్చగొట్టే చర్యకు వైయస్ జగన్ వర్గం పూనుకుంది. బుధవారం సాయంత్రం దాదాపు 30 మంది జగన్ వర్గం శాసనసభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రతిపాదించి మెజారిటీ నిరూపించుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడికి దిగడం కూడా ముఖ్యమంత్రిని సవాల్ చేయడమేనని భావిస్తున్నారు. జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు ఇంత పెద్ద యెత్తున ఎప్పుడూ సిఎల్పీ కార్యాలయంలో ఇంత ఘాటుగా మాట్లాడలేదు. సిఎల్పీ కార్యాలయం నుంచే కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసరడం కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన వర్గాన్ని రెచ్చగొట్టడమేనని అంటున్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్న నాయకులు సవాల్ విసురుతున్నారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం జగన్ వర్గంపై చర్యలు తీసుకోకుండా సవాళ్లు ప్రతిసవాళ్లను ప్రోత్సహిస్తోంది. ఎవరు ముందుకు అడుగు వేస్తారనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.

Tuesday, January 25, 2011

తిరుపతి రచ్చబండలో పాల్గొంటున్న చిరు


రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మంచిది కాదని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. రచ్చబండలో పాల్గొనటానికి తిరుపతి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు రేణిగుంట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. పేదవారికి చేరువ కావడానికి రచ్చబండ కార్యక్రమం ఎంతగానే ఉపయోగపడుతుందని చిరంజీవి అన్నారు. పీఆర్పీ కాంగ్రెస్ లో కలిసిపోతుందన్న వార్తలు ఊహాగానాలేనని చిరు స్పష్టం చేశారు. 

త్వరలో దర్శనమివ్వనున్న రెండో సూర్యుడు


త్వరలోనే రాత్రిపూట కూడా భానుడి ప్రకాశాన్ని మనం చూడబోతున్నాం! భూమికి దాదాపు 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓరియన్ నక్షత్ర మండలంలో సూపర్‌నోవా దశకు చేరిన బీటిల్‌గూస్ ఈ ఏడాదిలోనే అంతరిక్షంలో విస్ఫోటనం చెందుతుందని, కొన్ని వారాలపాటు దేదీప్యమానంగా వెలిగి ఆ తర్వాత అంతర్ధానమవుతుందని ఖగోళ శాస్తవ్రేత్తలు వెల్లడించారు. రాత్రి వెలుగు జిలుగులను విరజిమ్మడంతోపాటు పగటిపూట రెండో సూర్యుడిగానూ బీటిల్‌గూస్ కనువిందు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే భూమి చరిత్రలోనే అరుదైన ఈ ఘటన కచ్చితంగా ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై మాత్రం వారు ఓ అంచనాకు రాలేక పోతున్నారు. మాయన్ క్యాలెండర్, డూమ్స్‌డే సిద్ధాంతం ప్రకారం..2012లో యుగాంతం వస్తోందని, ఈ సూపర్‌నోవాతోనే ప్రళయం సంభవిస్తోందని ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే భూమికి ఎంతో దూరంలో జరిగే ఈ పేలుడువల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని నిపుణులు స్పష్టం చేశారు.

Sunday, January 23, 2011


వచ్చే నెల 5, 6 తేదీల్లో చిరంజీవి రాక
విశాఖపట్నం: వచ్చే నెల 5, 6 తేదీల్లో ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి జిల్లా పర్యటనకు వస్తున్నారని స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో మృతి చెందిన రైతులు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడారు.జిల్లాలో ఏడుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, అనకాపల్లి, కశింకోట, యల మంచిలి, ఎస్.రాయవరం, పాయకరావుపేట ల్లో చిరంజీవి పర్యటించి, వారి కుటుంబ సభ్యులను కలుస్తారన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1200 
కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే గంటా రచ్చబండ షెడ్యూల్‌పై చ ర్చించారు 

Saturday, January 22, 2011

పల్స్‌పోలియోకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది...


 విశాఖపట్నం : పల్స్‌పోలియోకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 23వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.46 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యం. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 40 వేల మంది పిల్లలు పెరిగారు. ఈసారి పొలాల్లోని గడ్డివాములు, ఊరికి దూరంగా జరుగుతున్న నిర్మాణాల్లో పాల్గొనే వారి పిల్లలకూ పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు. వలస వచ్చిన వారి పిల్లలను గుర్తిస్తారు. ముందుగా అలాంటి వారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. 102 సంచార బృందాలు, 102 తాత్కాలిక శిబిరాల ద్వారా అందరికీ చుక్కలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా మైదాన ప్రాంతంలో రెండు లక్షల మంది, విశాఖ అర్బన్ ప్రాంతంలో లక్షన్నర మందికి, గిరిజన ప్రాంతంలోని 74 వేల మందికి పోలియో చుక్కలు వేసేందుకు 14,508 మంది వేక్సినేటర్లను నియమించారు. వేక్సినేటర్‌కు రోజుకు రూ. 75 చొప్పున మూడు రోజులకు చెల్లిస్తారు. వేక్సినేటర్లను పర్యవేక్షించే 393 మంది సూపర్‌వైజర్లకు గరిష్టంగా రూ. 225 వరకూ చెల్లిస్తారు. విశాఖ అర్బన్, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకోసం 465 శిబిరాలను ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి అంతా సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి.సావిత్రి కోరారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన వ్యాక్సీన్‌ను సరఫరా చేశామని తెలిపారు. ఆమె కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. అయిదేళ్లలోపు వయసున్న పిల్లలందరికీ చుక్కలు పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఏ పనిలో వున్నా, ప్రయాణంలో ఉన్నా పిల్లల ఆరోగ్యం కోసం రెండు చుక్కలు వేయించాలని హితవు పలికారు. ఉద్యోగుల పెన్‌డౌన్, ఇతర ఆందోళన కార్యక్రమాల ప్రభావం పల్స్‌పోలియోపై పడే అవకాశాలు లేవన్నారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్యామల, సర్విలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎన్.అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 

ఈవీవీ కుటుంబసభ్యులకు ప్రముఖుల పరామర్శ


శుక్రవారం అర్థరాత్రి హఠాత్తుగా కన్నుమూసిన సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. నిర్మాతలుచిరంజీవి , దగ్గుబాటి సురేశ్‌బాబు, సి. కల్యాణ్‌, అశోక్‌కుమార్‌, నటులు శ్రీకాంత్‌, అలీ, శివారెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ, రాజశేఖర్‌ దంపతులు, సంగీత దర్శకుడు కోటి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తదితరులు ఈవీవీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవీవీ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం హైదరాబాద్‌ శివారు మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Friday, January 21, 2011

"మొబైల్ నంబర్ పోర్టబులిటి" ఆఫర్


Add caption

 మీరు వాడుతున్న మొబైల్ నెట్ వర్క్ బాగా విసిగిస్తుందా.. అత్యవసర సమయంలో సిగ్నల్స్ అందక ఆఫ్తులతో సరిగా మాట్లాడలేకపోతున్నారా. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తీరిపోనున్నాయి. ఇంతకాలం ఇతర నెట్ వర్క్ కు మారితే.. ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ పోవడంతోపాటు.. కొత్త కాంటాక్ట్ నెంబర్ తీసుకోవల్సి వచ్చేది. దీంతో.. ప్రతిసారీ నెంబర్ మారింది... ఇది కొత్త నంబర్ అంటూ అందరికీ మెసేజ్ పాస్ చేయాల్సి వచ్చేది. అయితే... ఇప్పుడు వాడుతున్న నెంబర్‌తోనే ఇతర ఏ నెట్ వర్క్‌లకైనా మారేలా మొబైల్ నెంబర్ ఫోర్టుబులిటీని నేటి నుంచి అమలులోకి రానుంది. మొబైల్ వినియోగదారుల కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. మీరు కోరుకున్న మొబైల్ నెంబర్ తో.. ఇష్టమైన ఇతర నెట్ వర్క్ లకు మారే సదుపాయం రేపటినుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం సర్వీస్‌లనందిస్తున్న మొబైల్ నెట్ వర్క్‌లన్నీ ఈ మొబైల్ ఫోర్టుబులిటీ విధానాన్ని అమలు చేయనున్నాయి. ఇప్పుడు వాడుతున్న మొబైల్ నెంబర్ నుంచి.. PORT అని టేప్ చేసి స్పేస్ ఇచ్చి.. బ్రాకెట్లో మొబైల్ నెంబర్ ని జతచేసి.. 1900 కి ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. వెంటనే ఎనిమిది అంకెల యూనిక్ ఫోర్టింగ్ కోడ్ జనరేట్ అవుతోంది. ఈ కోడ్ ఆధారంగా.. కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ని నింపి కోరిన సర్వీస్ ప్రొవైడర్ కి సమర్పించాల్సి ఉంటుంది. కేవలం 19 రూపాయల రుసుముతో.. వారం రోజుల్లో మీరు కోరుకున్న నెంబర్ ని.. మీకు ఇష్టమైన నెట్ వర్క్ కు మారొచ్చు. పోర్టబులిటీ చేసుకోబోయే నెంబర్ తప్పనిసరిగా 90 రోజులకు మించి వాడకంలో ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఫ్రీపెయిడ్ వాడుతున్నవారు.. ఫోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని పలు సర్వీస్ ప్రొవైడర్లు కల్పిస్తున్నాయి. తాము వాడుతున్న మొబైల్ నెట్ వర్క్ లతో ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ.. అందరికీ తెలిసిన, ఇష్టమైన నెంబర్ ని మార్చలేక అదే నెట్ వర్క్ వాడుతున్నవారు కోకొల్లలు. కొత్తగా రాబోతున్న మొబైల్ నెంబర్ ఫోర్టుబులిటీ ద్వారా తమ సమస్యలు పరిష్కారమౌతాయని కస్టమర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న నగరంలో సిగ్నల్‌ అందకపోతే నెంబర్‌ మార్చుకునే బదులు నెట్‌వర్క్‌ చేంజ్ అయ్యే ఫెసిలిటీ పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రచ్చబండ' హామీల అమలుకు2500 కోట్లు కేటాయింపు

తక్షణం రూ.1200 కోట్లు విడుదల
సంక్షేమ పథకాల తీర్పుపై సమీక్ష
నియోజకవర్గాలకు తలా రూ. 96 కోట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు సాగనున్న 'రచ్చబండ'లో సీఎం కిరణ్ ఇచ్చే హామీల అమలుకు ప్రభుత్వం రూ.2500 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1200 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. ఆయనతోపాటు వెళ్లే ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద మూడోవిడతగా రూ.96.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులివ్వగా ఆ నిధులను జిల్లా ప్రణాళిక అధికారులకు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.టక్కర్ గురువారం ఆదేశాలిచ్చారు.ఇందులో రూ.73.75 కోట్లను ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సూచించే పనులకు కేటాయిస్తారు. మిగిలిన సొమ్ముతో ఎమ్మెల్సీలు సిఫారసు చేసే పనులు చేస్తారు. రచ్చబండలో అన్ని పథకాల అమలు తీరును సీఎం సమగ్రంగా సమీక్షిస్తారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి, అభిప్రాయాలు స్వీకరిస్తారు. వాటన్నింటినీ విశ్లేషించిన అనంతరం అమలులో సమూల మార్పులు తేవాలని ఆయన సంకల్పించారు. ఈ దిశగా పథకాల ప్రయోజనం నేరుగా వారికి చేరుతున్నదా? అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేక అవినీతిపరులతో కుమ్మక్కవుతున్నారా? తదితర అంశాలను నిశితంగా గమనిస్తారు.18 లక్షల వ్యక్తిగత లబ్ధిదారులు, 6.5 లక్షల స్వయం సహాయక బృందాలకు అక్కడికక్కడ నిధులు విడుదల చేస్తారు. అలాగే కొత్త దరఖాస్తులు, అక్రమాలపై ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారు. పథకాల అమలులో క్షేత్రస్థాయి ఇబ్బందులనూ గమనిస్తారు. యంత్రాంగం తీరుపై ప్రజల్లో అసంతృప్తిని తొలగించటంతోపాటు అవినీతిని నిరోధించటం సీఎం లక్ష్యమని అధికారవర్గాలు తెలిపాయి. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి ద్వారా వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నది ఆయన ధ్యేయం. తదనుగుణంగానే 20 రోజుల పర్యటన కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులతో చర్చించడం ద్వారా 'పనిచేసే ముఖ్యమంత్రి'గా ముద్ర వేయాలన్నది సీఎం లక్ష్యమని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మేల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే ప్రభుత్వంపై సానుకూల భావన పాదుకొంటుదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంమీద 2009 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వమే లేదన్న ప్రజల భావనను సమూలంగా తొలగించాలన్నది లక్ష్యమన్నారు.

Thursday, January 20, 2011

త్వరలో తాడి గ్రామాన్ని తరలిస్తాం

విశాఖపట్నం ;ఎట్టకేలకు ప్రభుత్వం మెట్టు దిగింది. ఫార్మాసిటీ కాలుష్య భూతంతో అల్లాడిపోతున్న తాడి గ్రామాన్ని తరలించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రాంకీ ఫార్మాసిటీ యాజమాన్యం, తాడి గ్రామ పంచాయతీ, ఏపీఐఐసీ, రెవెన్యూ వర్గాలతో విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ ప్రటించారు. తాడి తరలింపు విషయమై గ్రామస్థులు పలుమార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా ప్రకటన చేస్తామని ఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ హామీ ఇచ్చారు.ఈ మేరకు ఇదే విషయం మాట్లాడడానికి ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు నేతృత్వంలో తాడి గ్రామస్థులు, రామ్‌కీ యాజమాన్యం కలెక్టరేట్‌లో జేసీతో బుధవారం సమావేశమయ్యారు. రాంకీ ఫార్మా సిటీ అనుకుని వున్న తాడి శివారు చినతాడి, బీసీ కాలనీల తరలించే ప్రక్రియ ప్రారంభిస్తామని జేసీ ప్రకటన చేశారు. తాడి గ్రామాన్ని తరలిస్తే ప్రత్యామ్నాయంగా గ్రామస్థులకు పునరావాసం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థల సేకరణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తాడి, చినతాడి, పెదతాడి, బీసీ కాలనీలకు సంబంధించి గ్రామస్థులకు ఒకేచోట కాలనీ నిర్మించాలని కోరుతున్నారు. సుమారు రెండొందల ఎకరాల భూమి సేకరించి ఇవ్వాలని వారు కోరారు. పునరావాసం కల్పించేందుకు అవసరమైన స్థలాన్ని మూడు రోజుల్లో గుర్తించాలని పరవాడ, గాజువాక రెవెన్యూ అధికారులకు జెసీ ఆదేశించారు.రామ్‌కీ వర్గాలు గ్రీన్‌బెల్ట్ పరిధిలో ఉన్న చినతాడి, బీసీ కాలనీలను సేకరించేందుకు సుముఖత వ్యక్తం చేశాయని, తొలి విడతగా తాడి బీసీ కాలనీ, చినతాడిలను తరలిస్తామని స్పష్టం చేశారని పరవాడ ఎంపీపీ నీలబాబు ''కు తెలిపారు. గ్రామం తరలింపు ప్రకటన పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ సమావేశంలో ఏపీఐఐసీ డిప్యూటీ జెడ్ఎం ప్రసాద్, రామ్‌కీ సీఎండీ లాల్ కృష్ణ, నిర్వాసిత నాయకులు జుత్తుక మాధవరావు, కోమటి అచ్చిబాబు, పాలవలస అప్పలాచారి, కోమటి సత్తిబాబు, మాధంశెట్టి కన్నబాబు, కె పైడిరాజు, కర్రి సత్తిబాబు పాల్గొన్నారు.

రచ్చబండకు పీఆర్పీ మద్దతు

సీఎంతో భేటీకి తొమ్మిది మందే హాజరు
ఆపత్కాలంలో సర్కారుకు మద్దతిస్తామని వెల్లడి
 రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వపరమైనదని, అందులో పాల్గొనడం తమ బాధ్యత అని పీఆర్పీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం నాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పలువురు పీఆర్పీ ఎమ్మెల్యేలు కలిశారు. రచ్చబండ కార్యక్రమం త్వరలోప్రారంభం కానున్న నేపథ్యంలో వీరు సీఎం వద్దకు వెళ్లారు. అయితే ఈ భేటీకి తొమ్మిదిమందే హాజరయ్యారు. ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని ఈ సందర్భంగా వారు సీఎంకు మరోసారి స్పష్టం చేశారు. బండారు సత్యానందరావు, ఈలి నాని, శ్రీధర కృష్ణారెడ్డి, అన్నె రాంబాబు, అవంతి శ్రీనివాస్, యలంపల్లి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్య, వంగా గీత సీఎంను కలిశారు. గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం విజయవాడలో ప్రమాదానికి గురికావడంతో హుటాహుటిన ఆయన అక్కడికి వెళ్లారు. సీఎంతో భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని పార్టీ కార్యాలయం మెసేజ్‌లు పెట్టినా.. తొమ్మిది మందే రావడం చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జగన్‌కు జై కొట్టిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు డుమ్మా కొట్టారు. తిరుపతి వెళ్లిన కన్నబాబు, గోవాలో ఉన్న పంతం గాంధీ మోహన్ ఈ భేటీకి రాలేకపోయారని ఎమ్మెల్యే సత్యానందరావు చెప్పారు. హైదరాబాద్‌లో ఉండీ కొందరు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన ఘాటుగానే స్పందించారు. 'కొందరు హైదరాబాద్‌లోనే ఉండి రాకపోవచ్చు. ఇంకొందరు ఇతర పార్టీల కార్యక్రమాల్లో ఉండి రాకపోయి ఉండవచ్చు' అన్నారు. సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి ముందు అధినేత చిరంజీవి ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలే హాజరయ్యారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి మొండిచేయి

రగిలిపోతున్న అధికార పార్టీ ఎంపీలు
అవమానంతో రించి, చివరికి ఉసూరనిపించారంటూ మండిపాటు
ఎటూ కాకుండా పోయామంటున్న తెలంగాణ ఎంపీలు
విధేయత వృథాయేనా అంటూ సీమాంధ్ర నేతల ఆవేదన
పార్టీ గడ్డు స్థితిలో ఉన్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం
 రాష్ట్ర ఎంపీలకు అవకాశం ఖాయమన్న జోస్యాలు తప్పయ్యాయి. కనీసం ముగ్గురికైనా అందలం అందుతుందన్న అంచనాలు వమ్మయ్యాయి. తమకు తప్పక న్యాయం జరుగుతుందన్న ‘సీనియర్ల’ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఎంపీలకు మరోసారి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. 32 మంది ఎంపీలతో యూపీఏ సర్కారుకు ఆయువుపట్టులా నిలుస్తున్నా, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి చోటు కూడా దక్కని వైనం కాంగ్రెస్ ఎంపీలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ముఖ్యంగా పునర్ వ్యవస్థీకరణలో తమకు స్థానం తప్పదని చివరి దాకా నమ్మకం పెట్టుకున్న అరడజను మంది సీనియర్ ఎంపీలైతే దీన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. కేబినెట్‌లోకి తీసుకుంటామంటూ కొన్ని నెలలుగా ఊరించి, తీరా ఇప్పుడు కనీసం మాట కూడా చెప్పకుండా, తమ అభిప్రాయాలను, అభిమతాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరును వారు సహించే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి బద్ధులై ఉంటామని ప్రతిసారీ ప్రకటించే పలువురు ఎంపీలు కూడా సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. పలు కారణాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్న తరుణంలో కూడా మంత్రి పదవుల విషయంలో అధిష్టానం ఇంతటి నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం సీనియర్ ఎంపీలకు మింగుడు పడటం లేదు. పార్టీని ధిక్కరిస్తున్న వారినీ, విధేయులనూ ఒకే గాట కట్టేసిందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్రం నుంచి కొత్తగా ఎవరి పేరునూ కనీసం పరిశీలనకు కూడా తీసుకోకపోవడం వెనక బలమైన కారణాలేమున్నాయా అని ఎంపీలంతా తర్జనభర్జనల్లో మునిగిపోయారు.

Wednesday, January 19, 2011

జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అహంకారి: లక్ష్మీ పార్వతి

తాత పేరు చెప్పుకుంటూ ఆయన నటవారసుడుని నేనే అంటున్న జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అహంకారి అనీ, ఆ అహంకారాన్ని తొలగించుకుని స్వర్గీయ ఎన్టీఆర్ నటనపై అధ్యయనం చేస్తే ఆయన నటనలో పదో వంతైనా జూనియర్ ఎన్టీఆర్‌కు అబ్బుతుందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు.కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి కూకటి వేళ్లతో పెకలించిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ అని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనలాంటి నాయకుడు రావాలి అని ఆకాంక్షించారు. తనకు తెలిసి వైఎస్ జగన్ అటువంటి నాయకుడని కితాబిచ్చారు. ఎన్టీఆర్‌లాగే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారని జోస్యం చెప్పారు.ఇక చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మార్గదర్శకుడని ఆమె విమర్శించారు. బాబు మాటలు విని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోసపోయారన్నారు. పదవులు ఇస్తామని నమ్మబలికి వారిని తమ దారిలో పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

దాసరి పిలిస్తే వెళ్లి చూశా.. ఏమీ అర్థం కాలేదు: రోశయ్య

కోట్లు పెట్టి సినిమాలు తీయడం కష్టమేకానీ, దానికంటే ఆ తర్వాత చేసే ప్రమోషన్‌ కూడా అంతే కష్టం. అందుకే పబ్లిసిటీ లేని చిన్నసినిమాలు ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. హైటెక్‌ యుగంలో విడుదలరోజే నెగెటివ్‌ టాక్‌ వస్తే చాలు ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేస్తారు. దాంతో ఎలాగో మైకుల ముందు సక్సెస్‌, సూపర్‌హిట్‌, అదుర్స్‌ అంటూ తెగ మాట్లాడేస్తుండాలి. ఇటువంటి కోవలో చాలా చిత్రాలే ఉన్నాయి. 
అగ్రహీరోల చిత్రాలు విడుదలకు ముందు ప్రోగ్రెస్‌ చెప్పడానికి నిరాకరించే నిర్మాత, దర్శకులు చిత్రం విడుదలయ్యాక అటో ఇటో అయితే తప్పనిసరిగా మీడియా ముందుకు వస్తుంటారు. సి. అశ్వనీదత్‌ చిత్రాలు అన్నీ ఇలాగే ఉంటాయి. అలాగే మరికొంతమంది అగ్రనిర్మాతలుకూడా ఈ బాటలోనే పయనిస్తారు.
తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' విషయం తీసుకుంటే ఇదే స్పష్టమవుతోంది. విడుదలనాడే హైదరాబాద్‌ క్రాస్‌రోడ్‌లోని శాంతి, సంథ్య ధియేటర్లలో మ్యాట్నీకి కలెక్షన్లు పడిపోయాయి. కొత్త సినిమా అయితే బాల్కనీ టిక్కెట్లు బ్లాక్‌లో కూడా దొరకవు. అటువంటిది బ్లాక్‌ టిక్కెట్లు అసలు రేటుల తీసుకోండని బతిమాలడం మరీ విచిత్రం. ఇందుకుకారణం. ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సస్పెన్స్‌, ఉత్సాహం రేకెత్తించేట్లుగా సినిమా లేకపోవడమే. 
బోయపాటి శ్రీను తీసిన 'సింహా'లో డాక్టర్‌ మర్డర్‌ చేయడం వంటి ట్విస్ట్‌లతో యువతనూ ఆకట్టుకున్నాడు. పరమవీచక్రలో దేశద్రోహూలు దేశంలో ఉన్నారని చెప్పి వారిని దేశంకోసం త్యాగం చేసిన వ్యక్తిపై ద్రోహి అని ముద్ర వేస్తే దాన్ని ఎలా సాల్వ్‌ చేశాడనేది కథాంశం. ఇదే కథను ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా పలుమార్పులతో చేస్తే మరింతగా బాగుండేదని ఫిలింనగర్‌ కథనం. కానీ దీనికి దాసరి అంగీకరించరు. దీంతో 'నా సినిమాను థియేటర్‌కు వచ్చి చూడడండి' అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

,,రచ్చబండ ,,పై సీఎం వీడియో కాన్పరెన్స్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన వారందరికీ అందించడమే రచ్చబండ ఉద్దేశమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే రచ్చబండలో ఏడు అంశాలను తీసుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్లకు కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. రచ్చబండ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. 

Tuesday, January 18, 2011

నేడు మహానాయకుడు ఎన్టీఆర్ 15వ వర్ధంతి


పురాణ పురుషుడంటే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ఎన్టీఆర్‌ అటు తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్ర్తాల పంపిణీ, మద్యపాన నిషేధం వంటి అంశాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆ మహానటుని పదిహేనో వర్ధంతి ఇవాళ. 
సింహం లాంటి నడక, మాటల్లో గాంభీర్యం, నవ్వులోనూ రాజసం కురిపించడం ఒక్క ఎన్టీరామారావుకే సొంతం. విశ్వవిఖ్యాత నటసార్వబౌముడిగా ఖ్యాతి గడించించిన ఆయన రాజకీయాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరీ, వెంకటరామమ్మ దంపతులకు 1923, మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు. 
చదువు పూర్తయ్యాక మద్రాస్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి సబ్‌-రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించాడు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలువనీయలేదు. మన దేశంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్‌ పాతాళబైరవితో హీరోగా స్థిరపడ్డారు. 
అనంతరం పలు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు టాప్‌ హీరోగా వెలిగారు. తన సినీ కెరీర్‌లో వందలాది చిత్రాల్లో నటించినా... ప్రజలకు దగ్గర చేసింది మాత్రం పౌరాణిక పాత్రలే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పురాణ పురుషులను ప్రజలు ఆయనలో చూసుకున్నారంటేనే ఎన్టీఆర్‌ ఆ పాత్రలకు ఎంతగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. ఇక ఎన్టీ రామారావు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే. 
తన 73 యేట 1996 జనవరి 18న ఎన్టీఆర్‌ ఈ లోకాన్ని వీడిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తుది శ్వాస విడిచేవరకు పనిచేసిన మహామనిషి ఎన్టీఆర్‌కు తెలుగుజాతి ఘననివాళులు అర్పిస్తోంది. 

నేటి నుంచి విశాఖలో మలివిడత ఓదార్పు యాత్ర


విశాఖ జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మలివిడత ఓదార్పు యాత్రకు రంగం సిద్దమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు యాత్ర     సాగనుంది. ఢిల్లీ దీక్ష కోసం ఈ నెల 8న ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్ తిరిగి నేటినుంచి ప్రారంభిస్తున్నారు. సుమారు 320 కిలోమీటర్లు సాగే యాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభమవుతుంది. 
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆరుకుటుంబాలను యువనేత జగన్‌ ఓదార్చనున్నారు. యాత్రలో పాల్గొనేందుకు జగన్ ఈ ఉదయం పదిన్నరకు విమానంలో రాజమండ్రి చేరుకుని అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా పాయకరావుపేటకు వెళతారు.

దాసరి నారాయణ మాకు కనపడితే అయిపోతాడు;; బాలయ్య ఫాన్స్

దాసరి నారాయణరావు కనిపిస్తే ఏం చేస్తామో తెలీదని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఊగిపోతున్నారు. తమ హీరోతో సినిమా తీస్తూ బుర్రకథ, వీధి నాటకాలని తలదన్నే చిత్రీకరణతో చావగొడతావా అంటూ నందమూరి ఫ్యాన్స్ కారాలు, మిరియాలు నూరుతున్నారు. ‘సింహా’ తో మళ్లీ బాలకృష్ణకి మహర్థశ పడుతుందని ఆశిస్తే, అతడిని మళ్లీ అంధకారంలోకి నెట్టేసి పరాజయాన్ని అందించినందుకు వారు ఆగ్రహం పట్టలేకపోతున్నారు.ఈ సినిమా చూశాక ప్రేక్షకులు ‘కాబోయే సిఎం’ అంటారని దాసరి ఊరించగా, ఇది చూసిన వాళ్లు ‘బాబోయ్ బాలయ్య’అంటుండడం విని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పైగా ఈ దిక్కుమాలిన సినిమాతో బాలకృష్ణకి జాతీయ అవార్డు వస్తుందని అనడం దాసరి సిగ్గుమాలిన తననానికి ప్రతీక అని వారు రెచ్చిపోతున్నారు. దాసరి తమ చేతికి దొరికితే మాత్రం ఆయనకు తమ చేతిలో ‘పరమవీర చక్ర’ తప్పదని హెచ్చరితస్తున్నారు...

వికిలీక్స్ గుప్పెట్లో 2000 స్విస్ బ్యాంకు ఖాతాలు. భారత బిగ్బాస్ లలో కలవరం మరో సంచలనం రేపిన వికీలీక్స్ ...

మరో సంచలనం రేపిన వికీలీక్స్
అసాంజే గుప్పిట్లో స్విస్‌బ్యాంకు ఖాతాలు 
వికీలీక్స్ మరో బాంబు పేల్చింది. ఐటీశాఖకు దొరక్కుండా దొంగచాటుగా స్విస్‌బ్యాంకులో సొమ్ము దాచుకున్న పెద్దల పేర్లన్నీ తన గుప్పిట్లో వున్నాయని వికీలీక్స్ అధినేత అసాంజే ప్రకటించారు. మాజీ స్విస్‌బ్యాంకర్ రుడాల్ఫ్ ఎల్మర్ సాయంతో.. ఈ చిట్టాను తాను సంపాదించినట్లు అసాంజే చెప్పారు. తన వద్దనున్న రెండు సీడీల్లో రెండువేల మంది స్విస్‌బ్యాంకు ఖాతాదారుల వివరాలున్నాయన్నారు. అతిత్వరలో వీటిని బైటపెడతానని, వీరిలో భారతీయుల పేర్లు కూడా వున్నాయని చెప్పారు. వికీలీక్స్ తాజా సంచలనంతో ఇండియన్ బిగ్‌బాసుల్లో కలవరం మొదలైంది. బడాబడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు స్విస్‌బ్యాంకులో వేలకోట్ల మొత్తంలో డిపాజిట్లున్నట్లు తెలుస్తోంది.

Monday, January 17, 2011

పోలవరం,ప్రాణహిత పూర్తయితే ప్రతిరోజూ సం క్రాంతే!

అండగా ఉంటాం ..అధైర్యం వద్దు
ఆశానహ దృక్పథంతో పండుగ చేసుకోండి
రూ.50వేల కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం
ఖరీఫ్ నాటికి కౌలు రైతులకూ రుణ కార్డులు

మూడేళ్లలో 43 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
రైతులకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.50 వేల కోట్ల వరకు పంట రుణాలు అందిస్తాం. ఖరీఫ్ నాటికి కౌలు రైతులకు రుణ అర్హతా గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. వచ్చే మూడేళ్లలో 43 ప్రాజెక్టులను పూర్తి చేసి... 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. త్వరలోనే పోలవరానికి జాతీయ హోదా లభిస్తుంది. ప్రాణహిత ప్రాజెక్టుకూ జాతీయ హోదా లభించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులు పూర్తి చేస్తే రైతులకు ప్రతి రోజూ సంక్రాంతే'' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులకు ముఖ్యమంత్రి ఒక బహిరంగ లేఖ రాశారు.ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తన లేఖలో పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్యానించారు. కర్షకులకు ఎంతో ఎంతో ప్రియమైన సంక్రాంతి పండుగను ఆశావహ దృక్ఫదంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. "రైతన్న ఆపదలో ఉంటే ఆదుకోవటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఇది రైతుల ఆదరణతో, వారి అండతో నిలబడ్డ ప్రభుత్వం. యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల క్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది'' అని సీఎం వివరించారు.ఆరేళ్ల క్రితం వరకూ వ్యవసాయంపై నిర్లక్ష్య ధోరణుల కారణంగా రైతులు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని... 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించారని చెప్పారు. వైఎస్ బాటను ఆదర్శంగా తీసుకుని... వ్యవసాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. "రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా 29 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగేలా ఉచిత విద్యుత్‌ను ఈ ప్రభుత్వమే అమలు చేసి కొనసాగిస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక మండలి అనుమతి లభించింది.ఇక జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రావడమే తరువాయి. తెలంగాణలో 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని కల్పించే జలహారం ప్రాణహిత -చేవేళ్లకు అన్ని రకాల అనుమతులు సాధించి, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది'' అని సీఎం వివరించారు. "రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కౌలు రైతులకు కూడా రుణ అర్హత కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి కౌలు రైతులకూ బ్యాంకు రుణాలు పొందే అవకాశం దక్కుతుంది' అని ముఖ్యమంత్రి తన లేఖను ముగించారు.

హోంగార్డుల జీతాల పెంపునకు ఓకే

హైదరాబాద్ : పోలీసు శాఖలో హోంగార్డుల వేతనాలను పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు, ఉపాధ్యక్షుడు గోవిందరావు, రవీందర్‌కుమార్, సత్యనారాయణలు  సీఎంను కలిశారు. పోలీసు శాఖలో హోంగార్డులుగా పనిచేస్తున్న 30 వేల మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరగా, దానిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పోలీసుల సమస్యల గురించి తెలుసుకోవటానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులకు సమయం కేటాయిస్తానని చెప్పారు.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

:పెట్రోల్ ధరలను మళ్లీ లీటరుకు 2.54 పైసలు పెంచారుశానివారము అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. పన్నులతో సహా మూడు రూపాయల వరకు పెరిగింది. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ఏడాది కాలంలో ఏడు సార్లు పెరిగాయి. పెట్రోల్ ధర పెంపుపై ఆగ్రహంపెట్రోల్ ధర పెంపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆందోళనలు చేశాయి. విశాఖపట్నంలో సిపిఐ, సిపిఎం వేరువేరుగా నిరసన తెలిపారు. ఆటోలకు, మోటార్ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగారు. కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ బండి అనంతయ్య ఎప్పటిమాదిరిగానే తనదైన ప్రత్యేక శైలిలో నిరసన తెలిపారు. అనంతయ్య ఆధ్వర్యంలో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు.ఈ ధరల పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇలా పెట్రోల్ ధరలు పెంచుతూపోతే మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోయారు. కేంద్ర స్థాయిలో జరిగే కుంభకోణాలను నిరోధించి, ఆ డబ్బుని సబ్సిడీల రూపంలో ఇచ్చి మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని కొందరు సలహా ఇచ్చారు.

Sunday, January 16, 2011

మృతుల్లో 18 మంది తెలుగువారు

'శబరిమల'లో పెను విషాదం
* సంఘటనా స్థలానికి హెలికాప్టర్‌లో చేరుకున్న కేరళ సీఎం
* 104 మంది భక్తుల మృతి
* 55 మృతదేహాల గుర్తింపు
* మృతుల్లో ఒక శ్రీలంక జాతీయుణ్ని గుర్తించిన పోలీసులు
* 26 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి 
* మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా 
కేరళలోని పులిమేడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 104 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 15 మందికిపైగా తెలుగువారున్నారు. వీరి మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. పులిమేడ్‌ ప్రాంతంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది తెలుగువారు మృతిచెందారు. మృతుల్లో నిజామాబాద్‌ జిల్లా భోదన్‌కు చెందిన రాజ్‌కుమార్‌, కన్న, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన గణేష్‌, పట్నాల సూరీ, పట్నాల రాంబాబు, నేతూరి రాజు, గోవింద్‌, మెదక్‌జిల్లా గజ్వేల్‌కు చెందిన తండ్రీకొడుకులు రామచంద్రం, అరుణ్‌, కరీంనగర్‌ జిల్లా మానకొండూరుకు చెందిన దొమ్మాటి సర్వేశం, కృష్ణజిల్లాకు చెందిన బత్తిన ప్రసాద్‌ వివరాలు ఇప్పటివరకు తెలిశాయి. అధికారికంగా మృతుల సంఖ్య 104 అయినా... అనధికారికంగా 150 వరకు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల్లో 26 మందికి పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 22 మంది తమిళనాడుకు చెందినవారు, ఒక శ్రీలంక జాతీయుడు ఉన్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రుల సంఖ్య 250కి పైగా ఉంది. వీరికి కొట్టాయం వైద్య కళాశాలు, తమిళనాడు తేనిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్సలు అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందినవారు అధికంగా ఉండటంతో సహాయక చర్యల్లో తమిళనాడు ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.పులిమేడ్‌ ఘటనను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎమర్జెన్సీగా ప్రకటించినా... కేరళ ప్రభుత్వంలో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు కేరళ హోం, దేవాదాయ, ఆరోగ్యశాఖ మంత్రులు సంఘటనాస్థలానికి చేరుకున్నా... తెల్లవారు జామున 4.30కి గానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. కేరళ సీఎం అచ్యుతానందన్‌ ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. శబరిమల పరిసరాల్లో ఇది మూడో అతిపెద్ద ప్రమాదమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 1998లో పంపానది సమీపంలోని హిల్‌టాప్‌లో తొక్కిసలాట, కొండచరియలు విరిగిపడ్డ సందర్భంలో 56 మంది మృతిచెందారు. గత ఏడాది వరదల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. కొట్టాయం నుంచి ఎరుమేలి రోడ్డులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లారీ బోల్తా పడడంతో 30 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంవత్సరం వెండిపెరియార్‌ - పులిమేడ్‌ మధ్య జరిగిన రెండు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 104 మంది మృతిచెందినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

Saturday, January 15, 2011

రాష్ర్టమంతా ,,సంక్రాంతి,, సందడి

కళ కళలాడుతున్న పల్లెలు
మకర సంక్రాంతిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. తెలుగు పండుగల్లో దీనికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. సూర్యుడు మేషాది రాసుల్లో సంచరిస్తూ మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకొంటారు. పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. మకరసంక్రాంతి రోజున సూర్యోదయానికే ముందే తలంటు స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. 
నువ్వులనూనెతో శివుని చెంత దీపాన్ని వెలిగిస్తే సకలపాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున నువ్వులను ఏదో ఒక రూపంలో తినాలని చెబుతూ ఉంటారు. అందుకే సంక్రాంతినాడు నువ్వుల అరిసెలకు అంత డిమాండ్‌. అయితే..ఇప్పటి ఫాస్ట్‌ ట్రెండ్‌లో ఈ అరెసలు కూడా రెడీమేడ్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మకరసంక్రాంతి సందర్భంగా వస్త్రదానం చేస్తే ఉత్తమఫలితాలు సిద్దిస్తాయని భక్తులు నమ్మకం. 

సింహాచలంలో పేలిన గ్యాస్ సిలిండర్

 సింహాచలం మజ్జిపేటలోAA


*ఇద్దరు చిన్నారుల సజీవ దహనం 
విశాఖపట్నంలో పండగ రోజు విషాదం నెలకొంది. సింహాచలం మజ్జిపేటలో ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్ బాషా నివాసం ఉంటున్నాడు. నిద్రిస్తున్న తమ పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఉంచి భార్యతో కలిసి పనికి వెళ్లాడు. వారు వెళ్లిన కొద్దిసేపటికే ఇంటి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. వాటిని అదుపులోకి తెచ్చేలోపే షార్ట్ సర్క్యూట్ అయి మంటలు ఎగసి పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సాహిద్, జాహిద్ సజీవదహనమయ్యారు. దీంతో బాషా దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

జగన్ బండారం బయటపెట్టడానికి గంటసేపు చాలు!: శంకర్

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, మాజీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి అవినీతిని నిరూపించడానికి గంట సేపు చాలుననని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. 
వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించేందుకు తన వద్ద నిరూపిత సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఎక్కడైనా జగన్ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని శంకరరావు తెలిపారు. వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించలేకపోతే తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన సవాలు విసిరారు. సైకోఫ్యాన్స్ వల్లే జగన్ పార్టీ పెడుతున్నారని, వై.ఎస్. జగన్ తన ప్రవర్తన మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని శంకరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కంటే ఒక మెట్టు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు శంకరరావు తెలిపారు. 
తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని శంకరరావు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికపై తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని శంకరరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. 2012లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కనిపించిన ,మకర జ్యోతి,

శరణు ఘోషతో మార్మోగిన శబరిమల
శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయింది. కాసేపటి క్రితం మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి కనబడగానే అయ్యప్ప భక్తుల శరణుఘోషతో శబరిమల మార్మోగింది. దాదాపు 60 లక్షలకు పైగా స్వాములు ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించుకున్నారు. జ్యోతిని చూడగానే అయ్యప్పలు ఆనందడోళికల్లో మునిగిపోయారు. జ్యోతి దర్శనంతో మాలధారణ ముగిసింది.  శబరిమలైలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనమిచ్చింది. శుక్రవారం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల ప్రాంతంలో జ్యోతి దర్శనం అయ్యింది. శబరిమలైకు 20 కిలోమీటర్ల పరిధిలో బారులు తీరిన లక్షలాది అయ్యప్పలు జ్యోతి దర్శనం చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకరజ్యోతి దర్శనానికి లక్షల సంఖ్యలతో వచ్చిన స్వాములతో శబరిమల కిక్కిరిసిపోయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనాన్ని నిలిపివేసిన ఆలయ వర్గాలు మకరజ్యోతి ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యాయి. మకర జ్యోతి దర్శనం కోసం తరలివచ్చిన అయ్యప్ప స్వాములు పంబ, కరిమలై, అప్పాచిమేడు, పులిమేడు, సన్నిధానం, సరంగుత్తి ప్రాంతాల్లో బారులు తీరారు. శరణుగోష చేస్తూ మరకజ్యోతి కోసం వేచి చూశారు. సాయంత్రం ఆరు గంటలకు పంబళం నుంచి హరిహరసుతుడు అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు ప్రారంభమైంది. స్వామివారి ఆభరణాలు ఆలయానికి చేరడానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. ప్రతీ యేడాది జరిగే సాంప్రదాయ తంతు ప్రకారం ఆభరణాలను ఆలయాలకు చేర్చారు. ఆ సమయంలోనే మకర నక్షత్రం భక్తులకు దర్శనమిచ్చింది. సన్నిధానంలో అయ్యప్ప స్వామివారికి ఆభరణాల అలంకరించిన అనంతరం శబరిమలై గిరుల్లో సుదూర ప్రాంతాల్లో మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల సమయంలో జ్యోతి దర్శనం అయ్యింది. మకరజ్యోతి దర్శనమే స్వామివారి దివ్యవదర్శనంగా భావించిన భక్తులు పులకించిపోయారు. అయ్యప్పను కీర్తిస్తూ శరణుఘోష చేశారు. అనంతరం ఆలయ వర్గాలు భారీ స్తాయిలో బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే శబరిమలలో కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించింది. 

Friday, January 14, 2011

ఊరంతా సంక్రాంతి...

పండు వెన్నెల‌ నిండు గుండెలో నింపుకుని...
పంటచేల సొగసు పట్టుచీరగా చుట్టుకుని...
దరహాస ధనరాశులు తోడుగా తెచ్చుకుని...
ఘల్లుఘల్లున కాలి అందెలు రవళించగా...
అరుదెంచినదిగో సంక్రాంతి లక్ష్మి...
నవరాగ పుష్పాలు శిగలో చుట్టుకుని...
మమకార మంజరీ మంజులాంజన దీప్తి...
నేత్రాంచలంబుల తీర్చిదిద్ది...
సంధ్యారుణ ఛాయ తిలకంబుగా తీర్చి...
నడిచి వచ్చెనదిగో... తల్లి సంక్రాంతి శుభలక్ష్మి...’’
ముచ్చటైన మూడురోజుల ఉత్సవ శోభ తిలకించి పులకించిన ఓ కవి... అభినందన సూచకంగా సంక్రాంతి లక్ష్మికి ఆ విధంగా అక్షరార్చన చేసాడు.
నిజానికి ప్రతి పండుగా శోభస్కరమే. గడపతొక్కి వచ్చే హితులు... సన్నిహితులు... స్నేహితులు... ఆత్మీయ అతిథుల సందళ్లతో... ప్రతి ఉత్సవం రమణీయం... కమనీయం.
అపురూపం అనిర్వచనీయం.
దైనందిన జీవనంలో వైవిధ్యతను మోసుకొస్తాయి పండుగలు.
వెల్లువెత్తే ఉత్సాహాన్ని తీసుకొస్తాయి ఇవి.
వరుసపెట్టి వచ్చే అన్ని రోజులూ వేరు... సరదాల సంబరాలు తెచ్చే పండగ రోజులు వేరు.
పండగంటే గుండెల్లో జాతరే. అంతకుముందురోజువరకూ అతి భారంగా క్షణాలు నెట్టుకొచ్చినా... పండగ పూట ద్విగుణీకృత ఆనంద తన్మయత్వంలో మునిగితేలుతారంతా. ఉన్నంతలో ఉత్సవాన్ని చక్కగా జరుపుకోవాలనే ఆశిస్తారు. అభిలషిస్తారంతా. అయితే, అన్ని పండగలూ ఒక ఎత్తు...తెలుగిళ్ల లోగిళ్లలో సంక్రాంతి పండగ మరో ఎత్తు. ప్రతి పండగా ఒకట్రెండు రోజులుంటే... ముచ్చటగా మొదటి రోజు బోగీ, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ అంటూ వరుసగా పండగ సంతోషాల్ని ఆహ్వానిస్తారు. అయితే, సంక్రాంతి పండగ వట్టి మూడురోజులేనా... అంటే, కాదనే సమాధానం వస్తుంది.


నిజానికి... ఇది నెల్లాళ్ల పండగ. ఇల్లేలే మహారాణులు, ఆడపడుచులు సంక్రాంతి నెల ముందునుంచీ... హడావుడి పడ్తుంటారు. ప్రతి సాయంత్రం రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి లక్ష్మికి రోజుకో తీరుగా స్వాగతం పలుకుతుంటారు. కార్పోరేట్ సంస్కృతి ఊరువాడాని చుట్టేసిన ప్రస్తుత నేపధ్యంలో కూడా... ఇప్పటికీ తెలుగిళ్లలోగిళ్లలో సంక్రాంతి పండగ చూడముచ్చటైన పండగే. ఈ ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే పండగ. అంటే, ఓ పక్క ఏరువాక... మరోపక్క ‘‘డూడూ బసవన్న... దొడ్డ దొరండీ బసవన్న... అయ్యగారికీ దణ్ణంపెట్టు... అమ్మగారికీ దణ్ణం పెట్టు...’ అంటూ ఇంటింటికీ బసవన్నల రాక... అత్తారింటికొచ్చే కొత్త అల్లుళ్ల పెదాలపై సదా వెలిగే వెనె్నల రేక... ‘శ్రీరమారమణ గోవిందో హరి...’ అంటూ అంత గొంతెత్తి ఆలపించే హరిదాసుల సందడి మరోపక్క. ఇలా... సంక్రాంతి పండగంటే సర్వశోభాయమానం అనిపిస్తుంది.
ధనుర్మాసంలో వైష్ణవ సంప్రదాయానే్న అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. మధ్యమధ్యలో శివారాధన కూడా ద్యోతకమవుతుంటుంది. గంగిరెద్దు అంటే... శివుని వాసనంగా కొలుస్తారు. తలుస్తారు. దానిని ఆరాధించడం ఈ పండగలోని విశిష్టతే. దీని వెనుక ఓ కథ కూడా ఉందంటారు.