Saturday, January 1, 2011

జగన్ పార్టీలో చేరికపై ఆచితూచి నిర్ణయం: నటి జయసుధ

కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో చేరే విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ అన్నారు. ఆమె శనివారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగనున్నట్టు తెలిపారు. జగన్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో చేరే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ధేశించే అంశమైనందువల్ల దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 
అంతకుముందు ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ప్రభుత్వ నిర్ణయాల్లో కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోక పోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్ వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరోమారు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరినట్టు జయసుధ తెలిపారు. 
విజయవాడలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్షలో పాల్గొనడం పార్టీ నియమావళికి వ్యతిరేకం కాదన్నారు. ఇది వ్యక్తిగతంగానే అక్కడకు వెళ్లి జగన్‌కు సంఘీభావం తెలిపినట్టు ఆమె తెలిపారు.

No comments:

Post a Comment