Monday, January 10, 2011

శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు కట్టుబడి ఉండాలి: గంటా

విశాఖపట్నం ; శ్రీ కృష్ణ కమిటీ సూచనలుకు ఆంధ్రులు అందరూ కట్టుబడి ఉండాలని పి. ఆర్.పి. పోరిట్ బ్యూరో సభ్యులు గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రావికమతం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పలు రకాల ఉద్యమాల వలన గత 15 సంవత్సరాలుగా సాధించిన ప్రగతి కోల్పోయామన్నారు. ఇకనైనా ఆంధ్రరాష్ట్ర సమన్వయంతో వ్యహరించాలని కోరారు. వెనుక బడ్డ తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేక ఫ్యాకేజీ మంజూరు ద్వారా అభివృద్ధి పరచాలని ఆశాభావం వ్యక్తం చేసారు. దీనికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.
తుఫాన్‌ల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చేందుకు అధికారులను చైతన్య వంతులను చేయాలని కోరారు. కృష్ణనది జాలాలపై బ్రిటీష్ ట్రిబ్యూనల్ తీర్పుపై పార్టీలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టాలని,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అయినందున రాష్టప్రతి పరిపాలన సమజసం కాదని, అలాగే మద్యంతర ఎన్నికలు కూడా రాష్ట్ర భవిష్యత్‌కు ఆటంకం కలిగిస్తుందన్నారు.

No comments:

Post a Comment