Monday, January 3, 2011

మద్దెల చెరువు సూరి మృతి

కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మద్దెల చెరువు సూరి మృతి చెందారు. మృత్యువుతో పోరాడిన సూరి సాయంత్రం 7.15 గంటలకు అపోలో ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. సూరి అనుచరుడే ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూరి తల ఛాతికి బుల్లెట్‌ గాయాలయ్యాయినట్లు తెలస్తోంది 
సనత్‌నగర్‌నుంచి యూసఫ్‌గూడ వస్తుండగా సూరిపై కాల్పులు జరిగాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎ.కె. ఖాన్ మీడియాకు వెల్లడించారు. సూరిపై కారులోనే రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఆయన తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. సూరిపై కాల్పులు జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సూరిపై చాలా దగ్గరనుంచే కాల్పులు జరపడంవల్ల ఆయన కుడి ఛాతీ గుండా కణత గుండా తూటాలు దూసుకుపోయినట్టు తెలుస్తున్నది. సూరి శరీరంలోకి నాలుగైదు తూటాలు దిగి ఉంటాయని భావిస్తున్నారు. గాయపడిన సూరిని అపస్మారక స్థితిలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకురాగా ఆయన మెదడు వైద్య చికిత్సలకు స్పందించడంలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. తెలిసినవారి ఇంటికి వెళ్లి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో కారులోనే సూరిపై పాయింట్ బ్లాంక్‌నుంచి దుండగులు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. అనంతరం వెనుకభాగం నుంచి మరి రెండు తూటాలు ఆయన వీపులోకి దిగబడినట్టు తెలుస్తున్నది. ప్రతి కదలికనూ ఎంతో రహస్యంగా ఉంచుకునే సూరి తాను ఉన్న పరిస్థితులలో తన నీడను సైతం నమ్మని సూరి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఒక న్యాయవాది ఇంటికి ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలోని సోదరి ఇంటికి ఒంటరిగా వెళ్లిరావడం పట్ల పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. అగంతకులు సూరిని అతి సన్నిహితంగా గురి చూసి కాల్చారని తెలుస్తున్నది. తీవ్ర గాయాలపాలైన సూరిని అపోలో అస్పత్రికి తరలించారు. ఆయన ఒళ్లంతా రక్తసిక్తమైంది. కాల్పులు జరిగిన వెంటనే సూరి స్పృహ కోల్పోయాడు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతాలలో రక్తసిక్తమైన సూరిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పుడు ఆయన టి షర్ట్‌లో ఉన్నారు. చాలావరకు తన రూపురేఖలను కూడా సూరి మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. ముందు సూరికి రోడ్డు ప్రమాదం సంభవించినట్టు వదంతులు ప్రచారమమయ్యాయి. గాయపడిన సూరిని ఆస్పత్రికి తీసుకువచ్చినవారు ఆయనకు హైదరాబాద్‌లోని పంజగుట్టసెంటర్‌వద్ద రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పారు. అయితే అటువంటిదేమీ జరిగినట్టు పోలీసులకు సమాచారం లేదు. అప్పటికే సూరి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మామూలుగా పదిహేను నుంచి ఇవై మంది అంగరక్షకులు పెద్ద కాన్వాయ్ లేకుండా సూరి బయటకువెళ్లే పరిస్థితి లేదు. కాని సోమవారం మాత్రం సూరి ఒక స్నేహితునితో తెలిసినవారి ఇంటికి భోజనానికి వెళ్లినట్టు తెలిసిన ప్రాథమిక సమాచారంపట్ల పోలీసు వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సూరి చెవి వెనుక నుంచి ఒక తూటా ఆయన తలలోకి దూసుకువెళ్లినట్టు తెలుస్తున్నది. అపోలో ఆస్పత్రిలోని ఐ.సి.యు.లో వెంటిలేటర్‌పై ఉన్న సూరి పరిస్థితి ఆశావహంగా లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. సూరిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిన వెంటనే సూరి అనుయాయులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని నవోదయ కాలనీలో ఈ సంఘటన జరిగింది. సూరి భోజనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఆ సమీపంలోని కారులోనుంచే అగంతకులు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. అయితే వారు ఎవరు అన్న అంశంపై పోలీసులు కూడా ఇంకా ఏమీ చెప్పలేకపోతున్నారు. పరిటాల రవి అనుయాయుడు చమన్‌పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా అందుకు ఇంకా సరైన ఆధారాలు లభించలేదు. చమన్ కొన్నాళ్లుగా బెల్గాంలో ఉన్నట్టు సమాచారం అందుతున్నది. సూరిపై దాడి జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాలలో ఉన్న సూరిపై రాజకీయ ప్రత్యర్థులే కాల్పులు జరిపారా లేక రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలవల్లే ఈ దాడి జరిగిందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఫ్యాక్షన్ రాజకీయాలవల్ల వ్యక్తిగతంగా ఎంతో దెబ్బ తిన్న తాను ఇక ముందు కుటుంబంతో సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానల్‌లో చెప్పిన విషయం తెలిసిందే. సూరి కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. సూరికి ఎంతో మంది ప్రత్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన పెనుకొండలో ప్రారంభమైన ఫ్యాక్షనిజం ఎంతోమందిని బలిగొంది. వేట కొడవళ్లు టి.వి. బాంబులు నాటు తుపాకులు ఇత్యాది ఆయుధాలతో ఈ ఫ్యాక్షనిజం కొనసాగింది. పరిటాల శ్రీరాములయ్య కాలంలో ప్రారంభమైన ఈ హననం ఇటీవల తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య వరకు కొనసాగింది. సూరి కుటుంబంపై పరిటాల రవి వర్గం పేల్చిన టి.వి. బాంబు పేలి సూరి తప్ప మిగిలిన కుటుంబానికి కుటుంబమే బలైపోయింది. ఆ తర్వాత పరిటాల రవి నక్సలైట్‌గా ప్రభుత్వానికి లొంగిపోయి ఎన్టీఆర్ హయాంలో 1994లో ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. లొంగిపోవడానికి ముందు రవి 1993లో ఆర్.ఒ.సి. కార్యకలాపాలు నిర్వహించేవారు. శ్రీరాములయ్య చిత్ర నిర్మాణం సమయంలో మద్దెలచెర్వు సూరి వర్గం పేల్చిన బాంబులు జుబిలీ హిల్స్‌లో ఎంతో మంది జర్నలిస్టులు సహా 30 మంది మరణించారు.

No comments:

Post a Comment