Sunday, January 2, 2011

నాణ్యమైన ఉక్కుకు మరిన్ని పరిశోధనలు

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సంస్థ సీఎండీ పి.కె.బిష్ణోయ్ అన్నారు. ఉక్కు మల్టీపర్పస్ హాలులో శనివారం జరిగిన సమావేశంలో అధికారులు, కార్మిక నాయకులు, సీ, విప్స్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రమాదాలు లేని సంస్థగా తయారుచేయడానికి ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. ఉక్కు ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యత సాధించడానికి మరింత పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఆంధ్ర, జార్ఖండ్, రాజస్థాన్‌లో గనుల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కును దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాల్సి ఉందన్నారు. 
డెరైక్టర్ (ఆపరేషన్స్) ఉమేష్‌చంద్ర, డెరైక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.పి.చౌదరి, డెరైక్టర్ (ఫైనాన్స్) పి.మధుసూదన్, డెరైక్టర్ (కమర్షియల్) టి.కె.చాంద్, డెరైక్టర్ (పర్సనల్) వై.ఆర్.రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తిగత క్రమశిక్షణ, ఉత్తమ పని ప్రమాణాలు పాటించడం ద్వారా సంస్థ ఖ్యాతిని మరింత పెంచాలన్నారు. సీవీఓ కె.విద్యాసాగర్ గత ఏడాది విజిలెన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఉక్కు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

No comments:

Post a Comment