Saturday, January 8, 2011

రాష్టప్రతి పాలనే !... సోనియాతో గవర్నర్‌ కీలక చర్చలు

 ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ మొత్తానికి ఢిల్లీలో తెర చాటు చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రంలో ఏరోజు కారోజు తలెత్తుతున్న తాజా రాజకీయ స్థితిగతు లను కేంద్ర హోంశాఖకు నేరుగా నివేదిస్తున్నారు. రాబోయే పరిస్థితులను ముందే ఊహించి ఆయన రాష్టప్రతిపాలన దిశగా పావులు కదుపు తున్నట్లు ఢిల్లీలో ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం అస్తవ్యస్థ విధానాలతోను, అవకతవక పాలనతోను అట్టుడికి పోతోందని, సామాన్యునికి ప్రశాంత జీవితం కరువైందని గవర్నర్‌ నరసింహన్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  గత మూడు రోజులుగా హస్తినలో ఉండి వివిధ అధికార ప్రతినిధులను కలిసిన గవర్నర్‌ తనదైన శైలిలో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గురువారం ఆయన కేంద్ర హోంమంత్రి చిదంబ రంతో భేటి అయి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరించారని తెలిసింది. రాష్ట్రంలోపరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాయని భావించిన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు ధర్నాలు, నిరాహార దీక్షలు చేయడం ద్వారా కాంగ్రెసేతర రాజకీయ పార్లీలకంటే అధికంగా సమస్యలు సృష్టించారని ఆయన వెల్లడించినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు తలెత్తగా, స్వపక్షంలోనే శత్రువుల మాదిరిగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలే ధర్నాకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింందని చిదంబరానికి చెప్పినట్లు తెలిసింది. గవర్నర్‌ చెప్పిన విషయాలన్నీ సానుకూలంగా విన్న చిదంబరం ఈ విషయంపై తానేమీ నిర్ణయం తీసుకోలేనని, ఈ వివరాలన్నీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకే నివేదించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో నరసింహన్‌ శుక్రవారం మధ్యాహ్నం సోనియాగాంధీతో సుమారు 25 నిమిషాలపాటు సమావేశమయ్యారని తెలిసింది. అదనపు పోలీసు బలగాలను వెంటనే వెనక్కు పంపేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేయడంపైనే ఆయన ప్రధానంగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి అదనపు బలగాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని గవర్నర్‌ సోనియాకు తేల్చి చెప్పారని, బలగాల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యాయని, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాష్ఱంలో శాంతి భద్రతలు కష్టమేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. బలగాలను వెనక్కు పంపడం మినహా మరేదయినా సూచించమని గవర్నర్‌ వెల్లడించినట్లు సమాచారం. రా్రష్టంలో శాంతి భద్రతల పునరుద్ధరణ కీలకాంశమని, దీని కోసం ఇంకా ఎంతో కసరత్తు చేయాల్సివుందని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ముందుచూపు కరువవడంతో పాలన పూర్తిగా స్తంభించిందని, సమన్వయం పూర్తిగా కొరవడిందని ఆయన తన అభిప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఉద్యమాలు రాజకీయాలకు అక్షయపాత్రగా పరిణమిస్తున్నాయని ఆయన తన దైనభాషాశైలిలో వెల్లడించారు. ప్రజలు అసంతృప్తితో వున్నారని కూడా గవర్నర్‌ తన అభిప్రాయంగా చెప్పినట్లు తెలిసింది.  కొందరి అభిప్రాయ బేధాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయని ఆయన సోనియాకు వెల్లడించి దీనికి మీరే మార్గం చూపాలని కోరారు. పార్టీ ఎంపీలు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు కారణం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ విషయంపై సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలోనే దీనికి తరుణోపాయం ఆలోచిద్దామని చెప్పారు. పోలీసు బలగాలను మాత్రం వెనక్కు పంపవద్దని సూచించారు. రాష్ర్ట్రంలో రాష్టప్రతి పాలన విధింపు విషయంపై ఇదివరకే రాజ్యాంగ నిపుణులతో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక రాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వం నడుస్తుండగా రాష్టప్రతి పాలన విధిస్తే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇందుకు ప్రత్యామ్యాయంగా పొలిటికల్‌ ఎమర్జన్సీ విధిస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అభిప్రాయ సేకరణ చేయాలని గరర్నరుకు సూచించారని తెలుస్తున్నది. రాజ్యాంగంలోని 356 అధికరణలోని కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టి సారించాలని కూడా నిపుణులకు సూచించినట్లు సోనియా చెప్పినట్లు తెలుస్తున్నది. పొలిటికల్‌ ఎమర్జన్సీ ద్వారా రాష్ర్టంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయని సోనియా అభిప్రాయ పడినట్లు తెలిసింది.  అత్యవసర వేళల్లో సత్వరం స్పందించేలా రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ప్రత్యేక అధికారాలను ఇస్తే బాగుంటుందని గవర్నర్‌ సోనియాతో అన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ నాయకుడొకరు ఇటీవల ప్రభుత్యోగులను సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునివ్వడం, సహాయ నిరాకరణ చేయాలని కోరడం కూడా రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ఆలోచనలన్నీ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. గవర్నర్‌ సోనియా గాంధీతో భేటీ కావడంపై తొలుత విమర్శలు వినవచ్చినా ఇదేమీ కొత్తకాదని అంటున్నారు.  గతంలో మహారాష్ట్ర గవర్నర్‌ గా పనిచేసిన ిపీసీ అలెగ్జాండర్‌ ఎన్నో మార్లు తన రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు సోనియాను కలిసిన దాఖలాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి విధిస్తే మంత్రివర్గానికి ఏమీ సమస్య రాదని కూడా చెబుతున్నారు. 1972లో ిపీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన మంత్రివర్గాన్ని రద్దు చేసి (సస్పెన్షన్‌) అనంతరం అదే శాసన సభ్యులతో తిరిగి 74లో జలగం వెంగళరావు సీఎం అయ్యారని చెబుతున్నారు.

No comments:

Post a Comment