Saturday, January 8, 2011

బాబూ.... జగన్ ,ఓదార్పు, నిలుపు...!!! ?

 బాబూ జగన్... మీ నాన్న చేసిన తప్పులను కప్పి పుచ్చుకునే ఓదార్పుయాత్రను ఇప్పటికైనా నిలుపుచేసి వాటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావుడిమాండ్ చేశారు. అగనంపూడి సమీపంలో గల వోక్స్‌వేగన్ వివాదస్పద స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శించి వై ఎస్ ఆర్ అవినీతిపై టిడిపి చేపట్టిన పోరాటానికి ఇది సమరశంఖారం అని స్పష్టంచేశారు. వైఎస్ ర్ పుణ్యమా అని ఆరువేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వోక్స్‌వేగన్ కంపెనీ ఇక్కడ దరిదాపుల్లో కనిపించకుండా ప్రక్క రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు. సుమారు పదకొండు కోట్ల రూపాయలను అప్పటి మంత్రి బొత్సా సత్యనారాయణతో పాటు వై ఎస్ ఆర్ మాయం చేసేశారని ఆయన ఆరోపించారు. మంత్రిపై ఆరోపణలు వెల్లివెత్తునా వై ఎస్ ఆర్ ఆ మంత్రిని తిరిగి మంత్రిమండలిలో చేర్చుకున్నారంటే అవినీతిలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవినీతి రాష్టవ్య్రాప్తంగా కోకోల్లలుగా ఉందని దీనిపై తెలుగుదేశం పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. దీంట్లో భాగంగానే వోక్స్‌వేగన్ కోసం అప్పట్లో కేటాయించిన ఈ స్థలంలో ఆందోళనకు తెరతీసామని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు పేరుతో ఎక్కడపడితే అక్కడ తన తండ్రి విగ్రహాలను ఏర్పాటుచేసి ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తున్నారని అన్నారు. వై ఎస్ ఆర్ చేసిన తప్పిదాలకు కుమారుడుగా జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రి రాష్ట్రానికి ఏదో సేవ చేసినట్లు ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటుచేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోవడంలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు దయనీయంగా ఉందన్నారు. పరిపాలన అస్తవ్యస్థగా ఉందని ఆయన ఆరోపించారు. అంతకుముందు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన తాతారావు మాట్లాడుతూ వోక్స్‌వేగన్‌కు కేటాయించిన ఈ స్థలాన్ని ప్రభుత్వం తిరిగి టాటాకేన్సర్ రీచర్చ్ సెంటర్‌కు కేటాయించిందన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వై ఎస్ ఆర్ అవినీతికి ఇక్కడనుండి తరలిపోయిన వోక్స్‌వేగన్‌ను ఉదాహరణగా టిడిపి చెబుతుందన్నారు. పారిశ్రామిక విధానంలో వై ఎస్ ఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వేలాధిమంది నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు వాసుపల్లి గణేష్, పీలా శ్రీనివాస్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గొర్లె వెంకునాయడు, లేళ్ల కోటేశ్వరరావు, మహ్మద్ రఫి, టిడిపి నేతలు లాలం భాస్కరరావు, మామిడి నర్సింహారావు, విల్లా రామ్మోహన్‌కుమార్, గల్లా రాజు, శట్టి జయలక్ష్మి, కరణం పైడిరాజు, దొడ్డి వెంకటరమణ, పులి వెంకటరమణారెడ్డి, కరణం సత్యారావు, ముత్యాలు, వాణి, పప్పు రాజారావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment