Monday, January 3, 2011

పూటకో మాట రోజుకో బాట..: కేసీఆర్‌పై రేవంత్ ధ్వజం..!!

ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పూటకో మాట రోజుకో బాట పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికి జనవరి 6న కేంద్రం ఆహ్వానించిన అఖిలపక్ష సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించండాన్ని ఆయన తప్పుబట్టారు. తన రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.
చేశారు. తమ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడి ఉందని చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు అన్ని పార్టీల అధ్యక్షులు హజరయ్యేలా కేంద్రం ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశానికి సోనియా గాంధీ కూడా హాజరయ్యేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చేటట్టయితే టీఆర్ఎస్ నేతలు ఎందుకు రాజీనామాలు చేశారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
జనవరి 6న జరగనున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీల నుంచి ఇద్దరు సభ్యులను ఆహ్వానించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తెలంగాణా అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని కేసీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడి ఉందని చెప్పారు

No comments:

Post a Comment