Wednesday, January 5, 2011

నా డ్యూటీ నేను చేశాను ;విజయవాడ సీపీ సీతారామాంజనేయులు...!

లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న విజయవాడ సీపీ సీతారామాంజనేయులు ఒక T.V ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనే ఫోన్ లు చేసినట్లు అంగీకరించారు.కానీ తాను ఎందుకు ఫోన్ చేయవలసి వచ్చిందని సీపీ ఇచ్చిన వివరణ పలు అనుమానాలకు దారి తీస్తుంది.సీపీ మాట్లాడినంత సేపూ వాళ్లకి వీళ్ళకి మేలు చేసాను అని చెప్పడం తప్ప నా డ్యూటీ నేను చేశాను అని చెప్పకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అంతే కాకుండా మొన్న చనిపోయిన సూరి అనుచరుడు భాను సెటిల్మెంట్ లకు సీపీ సాయం చేసాడని వల్లభనేని వంశీ ఆరోపించడం జరిగింది.
ఈ సందర్భంగా వంశీ సీపీ ని మీ లిమిట్స్ లో మీరు వుండమంటూ తీవ్రంగా హెచ్చరించాడు.దానితో సీపీ లైవ్ నుంచి వెళ్ళిపోయాడు.ఇంతకు ముందు వంశీ కి కౌన్సలింగ్ అని చెప్పి తీసుకు వెళ్లి నా కులం వాళ్లైన గవర్నర్,  D.G.P ఉన్నంత కాలం నన్నెవరూ ఏమీ పీకలేరు అని సీపీ నాకు వార్నింగ్ ఇచ్చాడని చెబుతున్నాడు వంశీ. 
మరొక వైపు చూస్తే వంశీ ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే వుంది.వంశీ చుట్టం అని చెబుతున్న ఒక అమ్మాయి విషయమై ప్రశ్నించగా ఆమె తనకు చుట్టం అని చెబుతూనే ప్రశ్నకి సంభందం లేకుండా జవాబులు చెబుతున్నాడు వంశీ.ఇంతకు ముందు కూడా పలు ప్రాంతాలలో పని చేసినప్పుడు సీతారామాంజనేయులు  మీద ఇదే విధమయిన ఆరోపణలు వున్నాయి.








No comments:

Post a Comment