Sunday, December 18, 2011

పాపం చిరంజీవి !!!


 చిరంజీవి రాజకీయ చరిత్ర సరికొత్తగా రికార్డు కాబోతున్నది. స్వయం కృషితో సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి రికార్డు సృష్టించిన చిరు రాజకీయాల్లో మాత్రం అందుకు భిన్నమైన పేరుతో రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. సినీ రంగంలో వెలిగిపోయిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించి రాజకీయంగా అధిక గుర్తింపు పొందినప్పటికీ ఆ స్థాయిలో చిరు ప్రయత్నం ఫలించలేదు. అనుభవ రాహిత్యంతో ముందస్తు షరతులేవీ లేకుండా అర్జంట్‌గా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినప్పటికీ ఇప్పటివరకు ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించలేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్‌కు మాత్రం ఆగమేఘాలపై ఆదివారం నాడే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. బయట నుంచే సపోర్టిస్తాం..అని కరాఖండిగా ముందే చెప్పి ఉంటే తమకు కొన్ని పదవులు దక్కేవని చిరు ఎమ్మెల్యేలు విశ్వసిస్తున్నారు. పైగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న సమయంలోనే సీఎంపైన మరింత ఒత్తిడి పెంచి ఉన్నా, తమకు ఈ దుస్థితి తప్పేదని వాపోతున్నారు. (సాంకేతికంగా ఈ ఎమ్మేల్యేలకు ఇంకా కాంగ్రెస్‌లోకి ప్రవేశం లభించలేదు- పైగా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగా ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖలు రాసి, ఏఐసీసీలో మాత్రం విలీన ప్రక్రియ పూర్తి అయినట్లుగా ప్రకటించారు.) శరద్ పవార్, తృణమాల్ కాంగ్రెస్ మాదిరిగా బయటి నుంచి మద్దతుగా ఉండి ఉంటే ఈ తిప్పలు తప్పేవనేది గొల్లుమంటున్నారు. కానీ పార్టీని మరింత కాలం నడపలేకనే చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి అతి తక్కువ కాలంలో పార్టీని నామరూపాలు లేకుండా చేసుకున్న సరికొత్త చరిత్రతో చిరు రికార్డులకెక్కడం కొసమెరుపు.

కనిపించని శత్రువు సెల్‌ టవర్‌ TV5




కనిపించని శత్రువు సెల్‌ టవర్‌
* కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లు 
* ప్రమాణాలు పాటించని ప్రొవైడర్లు 
* మార్కెట్‌ పెంచుకునేందుకు నిబంధనలు గాలికి
* ప్రాణాల్ని మింగేస్తున్న రేడియేషన్‌ భూతం
* వీధికో సెల్‌టవర్‌ 
* స్కూళ్లు, హాస్పిటల్స్‌, అపార్ట్‌మెంట్స్‌ పైనే టవర్లు 
* మారణాయుధాలుగా సెల్‌టవర్లు 
* తరుముకొస్తున్న రేడియేషన్‌ భూతం 
* టవర్లతో శారీరక, మానసిక సమస్యలు
* సంతాన సాఫల్యతపై రేడియేషన్‌ ఎఫెక్ట్‌ !
* డిప్రెషన్‌, మతిమరుపు గ్యారంటీ
* నిద్రలేమి, ఏకాగ్రతతో సతమతం
* బలవుతున్న చిన్నారులు 
* మింగేస్తున్న రేడియేషన్‌ భూతం 
* నివ్వెరపరుస్తున్న సర్వేలు 

సెల్‌ఫోన్‌.. ఆధునిక ప్రపంచంలో ఒక అత్యవసర వస్తువు. బీద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో ఇప్పుడు సెల్‌ఫోన్ కామనైపోయింది. దీంతో వినియోగదారులకు సేవలందించేందుకు ప్రొవైడర్లు ఇబ్బడి ముబ్బడిగా టవర్లు నిర్మిస్తున్నారు. అయితే నిబంధనలను అతిక్రమిస్తూ రాజకీయ అండతో నిర్మిస్తున్న సెల్‌ టవర్లు ప్రజల పాలిట మృత్యుదేవతల్లా తయారవుతున్నాయి. 

ప్రాణాంతకంగా మారుతున్న నాన్‌ ఆయనైజింగ్‌ రేడియేషన్‌పై స్పెషల్‌ స్టోరీ మీ కోసం. హైటెక్‌ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి సెల్‌ఫోన్‌ మామూలైపోయింది. ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసుకునేందుకు ఒక్కో వినియోగదారుడు డ్యుయెల్‌ ఫోన్‌ సదుపాయమున్న రెండు మూడు మొబైల్స్‌ వాడుతున్నారు. ఇటు మార్కెట్‌ పెంచుకునేందుకు మొబైల్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు దగ్గరవుతున్నాయి.

అయితే సిగ్నల్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ఎక్కడ పడితే అక్కడ సెల్‌ టవర్లను నిర్మిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు , జనావాసాలు, అపార్ట్‌మెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌ అనే తేడా లేకుండా ప్లేస్ దొరికితే చాలు తాటిచెట్లంత టవర్లు దర్శనమిస్తున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న దుష్పరిణామాలు ప్రపంచానికి కొత్త రకం మారణాయుధాలుగా పరిణమిస్తున్నాయి. 

కనిపించని శత్రువుగా పరిణమిస్తున్న సెల్‌ టవర్లతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తున్నాయి. రాజకీయ, కార్పోరేట్ ఒత్తిడితో మెట్రో నగరాల్లో దాదాపు ప్రతీవీధికొకటి చొప్పున టవర్లు జనావాసాల్లో వెలుస్తున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న సెల్‌ టవర్లు రేడియేషన్‌ను వెదజల్లుతున్నాయి. దీంతో ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు వాటిల్లుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. 

ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి, డిప్రెషన్‌, ఏకాగ్రత కోల్పోవడం, మతిమరుపు, ఒళ్లనొప్పులు సంభవిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సంతాన సాఫల్యతపై కూడా రేడియేషన్‌ ఎఫ్టెక్ట్‌ చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టవర్ల నుంచే కాకుండా అన్ని రకాల ఫోన్ల నుంచి రేడియేషన్ ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. 

వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ముసలీముతకా, పిల్లా పాపా అందరూ రేడియేషన్‌ భారిన పడాల్సివస్తోంది. ప్రమాణాలు పాటించకుండా కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లను కట్టడి చేయకుంటే ప్రపంచాన్ని రేడియేషన్‌ భూతం మింగేయడం ఖాయం. 


t v 5




successnews

Friday, December 16, 2011

అటు ఇటు కాని దారిలో చిరంజీవి: అధిష్టానం ఎటు చేస్తుందో..?!!



ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే అది చిరంజీవి చలవే. ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఆపద్బాంధవుడు చిరంజీవిని కాంగ్రెస్ ఇప్పుడు "యూజ్ అండ్ త్రో"లా చూస్తున్నట్లుంది. అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కేశాం.. ఇక మరో 6 నెలలు వరకూ ఢోకాలేదు.... ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూశారు అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్టు ఉంది. చిరంజీవికి రాష్ట్రంలో ఓ కీలక పదవి కట్టబెడతారన్న వార్తలు ఊపందుకోగానే.. ఇక్కడి నేతలు వ్యూహాత్మకంగా చిరు స్టామినాకు రాష్ట్రస్థాయి పదవి సరిపోదనీ, కేంద్రస్థాయి నప్పుతుందని వ్యాఖ్యానించారు. సరే కేంద్రంలో చూస్తే అక్కడివారు వార్త అలా వచ్చిందో లేదో అడ్డుపుల్లలు తీసుకుని రెడీ అయిపోయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 
చిరంజీవికి కేంద్రంలో బెర్త్ ఇస్తే రాష్ట్ర వ్యవహారాలతో టచ్ పోతుందనీ, పైపెచ్చు ఆయనకంటే పార్టీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్లున్నారు కనుక వారిని కాదని చిరుకు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవి అటు కేంద్రానికి కాక ఇటు రాష్ట్రానికి కాకుండా రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయినట్లున్నారు. 
ఐతే చిరంజీవి ఆశలన్నీ అధిష్టానంపైనే పెట్టుకున్నారు. సోనియా గాంధీ ఎలా అంటే.. అలానే నడుచుకుంటామని ఆది నుంచీ చెపుతూ వస్తున్నారు. పదవుల విషయంలో ఎన్ని వార్తలు తిరుగాడుతున్నా.. ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. పార్టీలో తన స్థానం ఏమిటో మేడంకు తెలుసుననీ, ఆ ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటారని చెపుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించడమే తన పని అని చెపుతున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

సౌర తుఫాను - పెనుప్రమాదం !


 వాతావరణంలోని మాగ్నటోస్పియర్ ఘోరంగా దెబ్బతిననుంది! ఫలితంగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు పని చేయడం మానేస్తాయి! విమాన రాకపోకలు నిలిచిపోతాయి! సెల్ ఫోన్లు పని చేయవు! టీవీలు మోగవు! విద్యుత్ సరఫరా చేసే పవర్‌గిడ్‌లు అతలాకుతలమైపోతాయి! మొత్తంగా భూమిపై జీవనం పెను ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్నది! అవును. 2012 చివరిలో లేదా 2013 ప్రారంభంలో సూర్యుడిపై సంభవించే శక్తిమంతమైన సౌర తుఫాను ఈ దుష్పరిణామాలకు కారణం కానుంది! ప్రపంచం మొత్తం అంధకారమయం కానుంది! ఈ ఆందోళనలను సాక్షాత్తూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యక్తం చేయడం విశేషం! 

2013లో సంభవించే సౌర తుఫాన్‌తో భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచమంతా అంధకారం అలుముకోక తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరించింది. సౌర తుఫానుపై కంప్యూటర్ మాడ్యూల్స్ ద్వారా అధ్యయనం నిర్వహించి నాసా ఈ విషయాన్ని తేల్చింది. దీంతో భూమి నుంచి చాలా ఎత్తులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్8) ఉపగ్రహాలు దెబ్బతిని సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుందని హెచ్చరించింది. విమాన రాకపోకలు, సెల్‌ఫోన్, టీవీ లాంటి సౌకర్యాలలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దీంతోపాటు ఆ కణాలు పవర్‌క్షిగిడ్ ట్రాన్స్‌పార్మర్‌లను కూడా దెబ్బతీసే అవకాశం ఉండడంతో విద్యుత్ కష్టాలు తప్పవని పేర్కొంది. తుఫాన్ కారణంగా భూమికి ప్రమాదం లేదని 93 మిలియన్ మైళ్ల దూరమున్న భూమిపైకి అగ్ని గోళాలను వెదజిమ్మే శక్తి సూర్యునికి లేకపోవడమేనని స్పష్టం చేసింది. 

సీఎంఈ అంటే?

సౌర పవనం, ప్లాస్మా (జీవ ద్రవ్యం), అయస్కాంత క్షేత్రాలు భారీ విస్ఫోటనం చెంది సూర్యుని కాంతి మండలంలోకి మంటలు చెలరేగి.. అంతరిక్షంలోకి దూసుకురావడాన్నే సీఎంఈ (కరోనల్ మాస్8 ఎజెక్షన్) అంటారు. ఈ ప్రక్రియనే సోలార్ ఫ్లేర్‌గా కూడా పిలుస్తారు. బలమైన సీఎంఈ బిలియన్ టన్నుల ప్లాస్మా కలిగి ఉండి మేఘాల రూపంలో గంటకు 10 లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. బలహీన అయస్కాంత క్షేత్రమున్న గ్రహాలు, ఉపగ్రహాలపైనున్న వాతావరణాన్ని సీఎంఈ నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

చంద్రునికి పొంచి ఉన్న ముప్పు

నాసా పరిశోధకుల ప్రకారం..చంద్రునిపై వాతావరణం చాలా బలహీనంగా ఉంటుంది. 2 రోజుల సీఎంఈ ప్రయాణంలో చంద్రుని ఉపరితలంపైనున్న 100- 200 టన్నుల పదార్థం కనుమరుగవుతుంది. అయితే సౌరతుఫాను వల్ల చంద్రునికి జరిగే నష్టం వాస్తవమా? కాదా? అనే విషయం 2013లో తాము ప్రయోగించే ‘ల్యూనార్ అట్మాస్పియర్, డస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్’ (ఎల్‌ఏడీఈఈ)తో తేలపోనుందని నాసా వెల్లడించింది. ఈ సీఎంఈ వల్లే గతంలో అంగారకునిపై ఉన్న వాతావరణం పూర్తిగా నాశనమైపోయి ఉంటుందని నాసా పేర్కొంది. సౌర తుఫాను వల్ల ఈ గ్రహంపై వాతావరణం ఎలా తుడుచుకుపెట్టుకపోయిందో.. 2013లో అరుణ గ్రహంపైకి ప్రయోగించే మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (ఎంఏవీఈఎన్) వాహక నౌక పరిశోధించనుందని వెల్లడించింది. 

యుగాంతం ఎందుకు అసాధ్యం..

2012లో ఏర్పడే సీఎంఈతో భూమిపై ఉన్న వాతావరణం అంతా దెబ్బతిని యుగాంతం సంభవిస్తుందని కొందరు వదంతులు సృష్టించారు. దీనికి వారు చెప్పిన కారణం.. ‘సౌరవ్యవస్థ ప్రస్త్తుతం 11 ఏళ్ల జీవిత చక్ర ప్రమాణాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉంది. అయితే 2012 చివర్లో సంభవిస్తున్నట్లుగా భావించే సోలార్ ఫ్లేర్‌తో గనుక సౌర జీవిత చక్రవూపమాణాన్ని పెంచుకునే ప్రక్రియ ఒకేసారి సంభవిస్తే భూప్రళయం తప్పద’ని హెచ్చరించారు. దీనిపై నాసా స్పందిస్తూ.. ‘ఇలాంటి సౌరచక్రం శతాబ్దాలుగా జరుగుతోంది. ఇంతకుముందు ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి సంభవించినా భూమికి ఎలాంటి హానీ కలగలేదు. అదేవిధంగా సోలార్ ఫ్లేర్ అనే ఈ ప్రక్రియ 2012లో కాకుండా 2013 లేదా 2014లో సంభవించే అవకాశం ఉంద’ని సమాధానం ఇచ్చింది. అయితే దీనికున్న శక్తి మేరకు భూవాతావరణంపై తీవ్ర ప్రభావం మాత్రం చూపగలదని హెచ్చరించింది.

manatelugunela

Wednesday, December 14, 2011

చిరంజీవి పెట్టిన కొత్త డిమాండ్‌తో గందరగోళ పరిస్థితి నెలకొంది.


 కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్‌ మరింత బలోపేతమయిం దని భావిస్తున్న తరుణంలో చిరంజీవి పెట్టిన సరికొత్త డిమాండ్‌తో జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలయింది. చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రాధా న్యత కల్గిన పాత్ర వుంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం ఆయన కు హామీ ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించ వచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి బలా న్నిస్తూ చిరంజీవి ఇటీవల అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయి పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె ముందు వాగ్దానం చేశారు. 
ఇందుకు ప్రతిఫలంగా విలీనం ప్రక్రియ పూర్తి కాగానే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ అధిష్ఠానంలోని నాయకులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరు తన రాజకీయ చతురతను ప్రదర్శిం చారు. తాను కేంద్రంలో ఏ పదవులు కోరుకోవడం లేదని, రాష్ట్రంలోనే ప్రజలకు అందుబాటులో వుంటూ సేవ చేయాలని భావిస్తున్నట్లు బాంబు పేల్చారు. తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి కావాలని నెమ్మదిగా మనసులో మాట బయట పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ వర్గాలలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ్రపజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆదరించారని, అక్కడే వుండి తన ప్రజలకు సేవలందించాలని భావిస్తున్నట్లు ఆయన తన మనసులో మాట బయటకు చెప్పడంలో అంతరార్థం వేరే వుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
ఏ రాజకీయ అనుభవం లేని చిరంజీవి ఈ స్థాయిలో మెలిక పెడతారన్నది ఊహించని పరిణామమేనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు సైతం అవాక్కవుతున్నారు. చిరంజీవి తొలిసారిగా రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం ప్రారంభించారని ఆందోళన పడుతున్నారు. ఆయన తన 16 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం శుభపరిణామమే అయినా ఆయన కోరికలో నిగూఢ రాజకీయ చతురత కనపడుతున్నదని బెంబేలెత్తుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రోజులుగా ఢిల్లీలొ మకాం వేసి చిరంజీవి వింత పోకడపై సమీక్షలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు వుండవల్లి అరుణ్‌ కుమార్‌, కేవీపీ రామచంద్రరావు తదితర ఎంపీలతో బొత్స కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తున్నది. బుధవారం ఉదయం బొత్స రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో సమావేశమై ఈ పరిణామంపై చర్చించే అవకాశం వుంది.

                                                                                            .......మేజర్‌న్యూస్‌

విశాఖ డెయిరీ మరోసారి పాల ధరను పెంచింది...



విశాఖ డెయిరీ యాజమాన్యం మరోసారి పాల ధరను పెంచింది. నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి పెరగడంతో సామాన్యులకు మరింత భారం కానుంది. ఈ ఏడాది ఆగస్టులో పెంచడం తెలిసిందే. తాజాగా లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచారు. అరలీటరుకు రూపాయి పెరగనుంది. ఈ ధరలు ఈ నెల 16నుంచి అమల్లోకి వస్తాయని డెయిరీ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, పాల కొనుగోలుదారులు, పాల రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఫిల్మ్ ధరలు, యంత్ర సామగ్రి, విడిభాగాల ధరలు పెరగడంతో డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోందని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ధరను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది

ఆడ శిశువుని వదిలివేశారు !!!


ఆడ శిశువుని వదిలివేశారు
విశాఖపట్నం: లంకెలపాలెం జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఆడ శిశువుని వదిలివేశారు. స్థానికులు ఆ బిడ్డని ఆస్పత్రిలో చేర్చారు.

ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తా


పాయకరావుపేట; రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందక పోతే రాజకీ య సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 12 సోమవారం స్థానిక లక్ష్మీ పంక్షన్ హాల్‌లో పాయకరావుపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈసమావేశంలో చెంగల వెంకట్రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన ఓటమి తాను ఓటమిగా భావించడం లేదన్నారు. కొత్తగా మండలం కలవడం, కొత్త పార్టీతో తనకు తక్కువ మెజార్టీతో ఓడిపోయానన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పాయకరావుపేట నియోకవర్గం టి.డి.పి.కి కంచుకోటగా ఉందన్నారు. జనవరి 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలను ఎం.ఆర్.పి. ధర కన్నా ఎక్కువ అమ్మితే తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మండలంలోని పి. ఎల్.పురం భూములు పేదలకు పంచేందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈవిషయమై శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకర నూకరాజు కంటే ఒక రోజు ఎక్కువగా ఎమ్మెల్యేగా ఉండాలని, అత్యధిక 22 వేలకు పైగా ఓట్లు మెజార్టీ సాధించాలని ఆశగా ఉందని తెలిపారు. ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కార్యకర్తలంతా గ్రామాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన అన్నారు.

పదవుల కోసం విలీనం కాలేదు


విశాఖపట్నం ; పి.ఆర్.పి. మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలుచేసే ప్రయత్నంలో వ్యవస్థాపకుడు చిరంజీవి నిమగ్నమై ఉన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనుటకు డిసెంబర్ 12 సోమవారం ఇక్కడకి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కొరవడిందని ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి 104 మంది బి.సి.లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అనుభవ రాహిత్యం వలన అధికారంలోకి రాలేకపోయినప్పటికీ తాను ఆశించిన ఆశయాల సాధనకు విశాల భావాలు కలిగిన అంతర్గత స్వాంతత్య్రమున్న కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగిందన్నారు. కేవలం పదవుల కోసం విలీనం అయ్యామన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు.
ఎటువంటి షరతులు లేకుండా ఆనాడు విలీనానికి చిరంజీవి అంగీకరించడం జరిగిందన్నారు. ఇప్పుడిప్పుడే తన ఆశయాలను, ప్రజలుకు ఇచ్చిన హామీలను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. చిరంజీవి సూచనను కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా ఆవిష్కరించడానికి సుముఖంగా ఉందని గంటా పేర్కొన్నారు. మరొకవైపు వేర్పాటు వాదంతో రాష్ట్రం అట్టుడికి పోతున్న సమయంలో టి.డి.పి, అర్ధం లేని డిమాండ్‌తో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, కిరణ్ ప్రభుత్వం మాదిరి దేశంలో మేర ఏ ప్రభుత్వం రైతులకు మేలు చేయలేదని ఛాలెంజ్ చేసారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట మేరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా 17 మంది పి.ఆర్.పి. ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరిగిందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారనున్నారని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో పినపోలు వెంకటేశ్వరరావు, పతివాడ చిన్నంనాయుడు, కంచిపాటి జగన్నాధరావు, గుమ్ముడు సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 13, 2011

147 మంది కొత్త ఎమ్మెల్యేలతో వచ్చేనెల 9నుంచి విశాఖ పర్యటన


హైదరాబాద్: ప్రస్తుత శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 147 మంది కొత్త ఎమ్మెల్యేలతో వచ్చేనెల 9, 10, 11 తేదీల్లో విశాఖ జిల్లా పాడేరు, అరకు, విశాఖపట్నంలలో పర్యటన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు

ఇంటర్నెట్ హద్దుల్లో ఉండాల్సిందేనా?!


ఒకరికొకరు రాసుకునే ఉత్తరాలను- తోక లేని పిట్ట తొంభై ఆమడలు ప్రయాణిస్తుందంటారు. ఇది గతం. ఇప్పుడు ఇంటర్నెట్, ఈమెయిల్స్ దే రాజ్యం. ఈ నెట్ పిట్ట తొంభై కాదు కదా... ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలూ క్షణాల్లో చుట్టి వస్తుంది. జస్ట్ క్లిక్ మనిపిస్తే చాలు. చక చక పరుగులు పెడుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, గుగుల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ... నెటిజనుల అభిలాషమేరకు.. అంతర్జాల సంచలనాలు. ఇతర ఎన్నో వెబ్ సైట్లు. ఎవరికి వాళ్లు దున్నిపడేస్తున్నారు. ఉన్నవీ లేనివీ కుమ్మరించి పారేస్తున్నారు. ఒక్కోసారి ఆ పైత్యానికో విచక్షణ వుండదు కదా అనిపిస్తుంది. అంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎంత అడిగే వారు లేకున్నా.. అంత బరితెగింపా? అని ఆశ్చర్యపోతున్నారు సామాన్యులు.
నెట్... దృశ్య ప్రాధాన్య కామధేనువు. కంటి ముందు ఎన్నో కమనీయదృశ్యాలు. వాటితో పాటు మరెన్నో కఠినమైన విషయాలు. అంతుచిక్కని రహస్యాలు. అనుకోని గందరగోళాలు. తెలిసినవీ తెలియనివీ అనేకానేక మతలబులు. నెట్ కు అడిక్ట్ అయితే చాలు- అంతే సంగతులు. ఒక పద్ధతి పాడు ఉండదు. అవసరమైనంత సమాచారం వరకైతే పరవాలేదు. అనవసర సమాచారం అనవసరంగా పోగవుతోంది. వద్దన్నా వదలని దృశ్యాలు.. ఇతర సమాచారాలు. విసిగి వేసారేలా చేస్తున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు. 


సెల్ఫ్ డిసిప్లిన్ లేక పోవడంతో, సెల్ఫ్ ఎడిట్ అంతకన్నా లేక పోవడంతో... వెబ్ సైట్లలో అసందర్భ సమాచారం, అనవసరంగా పేరుకుపోతోంది. కాస్త సరదాగా అన్నట్టు మొదలైన ఈ విధానం.. ఇప్పుడో వరదగా మారింది. అనవసర దురదగా తయారైంది. ఎంత దారుణం అంటే, ఎవరికైనా కాస్త ఇమేజీ వుంటే దాన్ని డామేజీ చేయడానికి వెనకాడ్డం లేదు. అడ్డగోలుగా రాయడం, మార్ఫింగ్ వంటి నీచ విధానాల ద్వారా వారి ముఖచిత్రాలను అసహ్యంగా తయారు చేయడం- వంటి వాటితో చేయాల్సినదంతా చేస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర నటులకే తప్పడంలేదీ తిప్పలు. 
ఐ హేట్ బాలయ్య డాట్ కామ్ వంటి వివాదాలు తెలిసిందే. బాలకృష్ణ వంటి మాస్ హీరోలను ఎన్ని రకాలుగా అవమాన పరచాలో అన్ని రకాలుగా అవమాన పరచారు. ఆయన ఈ సైట్ నిర్వాహకుల వివరాలేమిటో తెలుసుకోమని కోరుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికొచ్చిందీ వ్యవహారం. 
ఇటీవల వెలుగులోకి వచ్చిన గ్రేటాంధ్రా డాట్ కామ్ వ్యవహారం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఒక పద్ధతి ప్రకారం నటులు ఇతర రాజకీయనాయకుల మీద కావాలని సంచలన వార్తలను రాస్తూ పట్టుపడిన విధం తెలిసిందే. తమ తమ వెబ్ సైట్ల హిట్లను పెంచుకోవడంలో భాగంగా కొందరిని పనిగట్టుకుని అవమానపరచడమనే నీచానికి దిగజారిందీ వెబ్ సైటు. దానికి తోడు కొందరి మీద ప్రత్యేకాభిమానం- మరి కొందరి మీద దురభిమానం దృష్టిలో పెట్టుకుని పాడు వార్తలు వండి వర్చాడంలో దిట్టగా పేరుంది ఈ వెబ్ సైట్ నిర్వాహకుడికి. దీంతో గ్రేటాంధ్రా డాట్ కామ్ నిర్వాహకుడు వెంకట రెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు కూడా. ఇదేనా పద్ధతి? అని అడిగేవారు లేకపోవడంతో ఇలాంటి సైట్ల నిర్వాహకులకు ఒక అడ్డు అదుపూ లేకపోతోంది. 
ఇలాంటివెన్నో విషయాలు. ప్రాంతీయ విభేదాలు రెచ్చుగొట్టడాలు. దారుణమైన బూతు రాతలు. ఆడ-మగ విచక్షణ కోల్పోతూ.. అసభ్యకరమైన దృశ్యాలను తయారు చేయడాలు.  వాటి ద్వారా సంచలనం సృష్టించాలనే నీచమైన పద్ధతులు.. ఇప్పుడో ఫ్యాషనైపోయింది.  అంతెందుకు.. నిన్న మొన్న చిరంజీవి కాబోయే కోడలు ఉపాసన మీద కూడా నెట్లో ఇలాంటి దారుణాలకే ఒడిగట్టారు కొందరు. స్వీయ నియంత్రణతో తప్ప మరే విధంగానూ అడ్డుకట్ట వేయలేం అన్నట్టుగా తయారైంది. అది తెలుసుకోకుంటే భవిష్యత్తు మరింత దారుణంగా తగలబడేట్టుంది చూస్తుంటే.

Monday, December 5, 2011

షేర్ ఖాన్.. నువ్వు పడగొడితే నేను నిలబెడుతా...


షేర్ ఖాన్.. నువ్వు పడగొడితే నేను నిలబెడుతా...


“నిలబెడతాం అంటే నిలబెట్టి తీరుతాం: దట్సిట్” ఇది ఈ వార్త వ్రాసే క్రోద్ది నిమిషాల ముందు అవిశ్వాసం పై మద్దత్తు ఇచ్చే విషయంలో చిరంజీవి వ్యాఖ్యలు. తన
నివాసంలో పి‌ఆర్‌పి ఎం‌ఎల్‌ఏ లతో సమావేశం అయిన చిరంజీవి, మీడియా వారితో మాట్లాడుతూ తన ఎం‌ఎల్‌ఏ లకు కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు వాస్తవమే అని, కానీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి తదితరులు ఇచ్చినభరోసా మేరకు ఈ మనస్పర్ధాలు, తేడాలు ఇక ముందు ఉండవని భావిస్తున్నామని అన్నారు.
అందుకే ప్రభూత్వానికి మద్దత్తు తెలిపి, ప్రభూత్వం పడిపోకుండా మద్దత్తు ఇస్తామని చిరంజీవి అన్నారు. మా ఎం‌ఎల్‌ఏ లకు నియోజకవర్గం పరిధిలో కొంత అసంతృప్తి ఉందని, నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు సక్రమంగా సాగటం లేదని తమ ఎం‌ఎల్‌ఏ లు భావిస్తున్నారని, ప్రభూత్వం నుంచి తగిన మద్దత్తు లభించటం లేదని తన ఎం‌ఎల్‌ఏ లు తెలిపారని చిరంజీవి అన్నారు.
దీనిపై పి‌సి‌సి చీఫ్ బొత్సా, ముఖ్యమంత్రి మునుముందు ఇలా జరగదని, మీ ఎం‌ఎల్‌ఏ లు కూడా ఇప్పుడు మా పార్టీ వారేనని, తేడా ఏమీ లేదని తెలిపారని చిరంజీవి అన్నారు. కేంద్రం నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా తనతో ఫోన్లో మాట్లాడారని చిరంజీవి అన్నారు.