Wednesday, December 14, 2011

ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తా


పాయకరావుపేట; రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందక పోతే రాజకీ య సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 12 సోమవారం స్థానిక లక్ష్మీ పంక్షన్ హాల్‌లో పాయకరావుపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈసమావేశంలో చెంగల వెంకట్రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన ఓటమి తాను ఓటమిగా భావించడం లేదన్నారు. కొత్తగా మండలం కలవడం, కొత్త పార్టీతో తనకు తక్కువ మెజార్టీతో ఓడిపోయానన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పాయకరావుపేట నియోకవర్గం టి.డి.పి.కి కంచుకోటగా ఉందన్నారు. జనవరి 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలను ఎం.ఆర్.పి. ధర కన్నా ఎక్కువ అమ్మితే తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మండలంలోని పి. ఎల్.పురం భూములు పేదలకు పంచేందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈవిషయమై శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకర నూకరాజు కంటే ఒక రోజు ఎక్కువగా ఎమ్మెల్యేగా ఉండాలని, అత్యధిక 22 వేలకు పైగా ఓట్లు మెజార్టీ సాధించాలని ఆశగా ఉందని తెలిపారు. ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కార్యకర్తలంతా గ్రామాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన అన్నారు.

No comments:

Post a Comment