Sunday, December 18, 2011

కనిపించని శత్రువు సెల్‌ టవర్‌ TV5




కనిపించని శత్రువు సెల్‌ టవర్‌
* కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లు 
* ప్రమాణాలు పాటించని ప్రొవైడర్లు 
* మార్కెట్‌ పెంచుకునేందుకు నిబంధనలు గాలికి
* ప్రాణాల్ని మింగేస్తున్న రేడియేషన్‌ భూతం
* వీధికో సెల్‌టవర్‌ 
* స్కూళ్లు, హాస్పిటల్స్‌, అపార్ట్‌మెంట్స్‌ పైనే టవర్లు 
* మారణాయుధాలుగా సెల్‌టవర్లు 
* తరుముకొస్తున్న రేడియేషన్‌ భూతం 
* టవర్లతో శారీరక, మానసిక సమస్యలు
* సంతాన సాఫల్యతపై రేడియేషన్‌ ఎఫెక్ట్‌ !
* డిప్రెషన్‌, మతిమరుపు గ్యారంటీ
* నిద్రలేమి, ఏకాగ్రతతో సతమతం
* బలవుతున్న చిన్నారులు 
* మింగేస్తున్న రేడియేషన్‌ భూతం 
* నివ్వెరపరుస్తున్న సర్వేలు 

సెల్‌ఫోన్‌.. ఆధునిక ప్రపంచంలో ఒక అత్యవసర వస్తువు. బీద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో ఇప్పుడు సెల్‌ఫోన్ కామనైపోయింది. దీంతో వినియోగదారులకు సేవలందించేందుకు ప్రొవైడర్లు ఇబ్బడి ముబ్బడిగా టవర్లు నిర్మిస్తున్నారు. అయితే నిబంధనలను అతిక్రమిస్తూ రాజకీయ అండతో నిర్మిస్తున్న సెల్‌ టవర్లు ప్రజల పాలిట మృత్యుదేవతల్లా తయారవుతున్నాయి. 

ప్రాణాంతకంగా మారుతున్న నాన్‌ ఆయనైజింగ్‌ రేడియేషన్‌పై స్పెషల్‌ స్టోరీ మీ కోసం. హైటెక్‌ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి సెల్‌ఫోన్‌ మామూలైపోయింది. ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసుకునేందుకు ఒక్కో వినియోగదారుడు డ్యుయెల్‌ ఫోన్‌ సదుపాయమున్న రెండు మూడు మొబైల్స్‌ వాడుతున్నారు. ఇటు మార్కెట్‌ పెంచుకునేందుకు మొబైల్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు దగ్గరవుతున్నాయి.

అయితే సిగ్నల్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ఎక్కడ పడితే అక్కడ సెల్‌ టవర్లను నిర్మిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు , జనావాసాలు, అపార్ట్‌మెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌ అనే తేడా లేకుండా ప్లేస్ దొరికితే చాలు తాటిచెట్లంత టవర్లు దర్శనమిస్తున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న దుష్పరిణామాలు ప్రపంచానికి కొత్త రకం మారణాయుధాలుగా పరిణమిస్తున్నాయి. 

కనిపించని శత్రువుగా పరిణమిస్తున్న సెల్‌ టవర్లతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తున్నాయి. రాజకీయ, కార్పోరేట్ ఒత్తిడితో మెట్రో నగరాల్లో దాదాపు ప్రతీవీధికొకటి చొప్పున టవర్లు జనావాసాల్లో వెలుస్తున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న సెల్‌ టవర్లు రేడియేషన్‌ను వెదజల్లుతున్నాయి. దీంతో ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు వాటిల్లుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. 

ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి, డిప్రెషన్‌, ఏకాగ్రత కోల్పోవడం, మతిమరుపు, ఒళ్లనొప్పులు సంభవిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సంతాన సాఫల్యతపై కూడా రేడియేషన్‌ ఎఫ్టెక్ట్‌ చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టవర్ల నుంచే కాకుండా అన్ని రకాల ఫోన్ల నుంచి రేడియేషన్ ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. 

వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ముసలీముతకా, పిల్లా పాపా అందరూ రేడియేషన్‌ భారిన పడాల్సివస్తోంది. ప్రమాణాలు పాటించకుండా కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లను కట్టడి చేయకుంటే ప్రపంచాన్ని రేడియేషన్‌ భూతం మింగేయడం ఖాయం. 


t v 5




successnews

No comments:

Post a Comment