Friday, December 16, 2011

సౌర తుఫాను - పెనుప్రమాదం !


 వాతావరణంలోని మాగ్నటోస్పియర్ ఘోరంగా దెబ్బతిననుంది! ఫలితంగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు పని చేయడం మానేస్తాయి! విమాన రాకపోకలు నిలిచిపోతాయి! సెల్ ఫోన్లు పని చేయవు! టీవీలు మోగవు! విద్యుత్ సరఫరా చేసే పవర్‌గిడ్‌లు అతలాకుతలమైపోతాయి! మొత్తంగా భూమిపై జీవనం పెను ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్నది! అవును. 2012 చివరిలో లేదా 2013 ప్రారంభంలో సూర్యుడిపై సంభవించే శక్తిమంతమైన సౌర తుఫాను ఈ దుష్పరిణామాలకు కారణం కానుంది! ప్రపంచం మొత్తం అంధకారమయం కానుంది! ఈ ఆందోళనలను సాక్షాత్తూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యక్తం చేయడం విశేషం! 

2013లో సంభవించే సౌర తుఫాన్‌తో భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచమంతా అంధకారం అలుముకోక తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరించింది. సౌర తుఫానుపై కంప్యూటర్ మాడ్యూల్స్ ద్వారా అధ్యయనం నిర్వహించి నాసా ఈ విషయాన్ని తేల్చింది. దీంతో భూమి నుంచి చాలా ఎత్తులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్8) ఉపగ్రహాలు దెబ్బతిని సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుందని హెచ్చరించింది. విమాన రాకపోకలు, సెల్‌ఫోన్, టీవీ లాంటి సౌకర్యాలలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దీంతోపాటు ఆ కణాలు పవర్‌క్షిగిడ్ ట్రాన్స్‌పార్మర్‌లను కూడా దెబ్బతీసే అవకాశం ఉండడంతో విద్యుత్ కష్టాలు తప్పవని పేర్కొంది. తుఫాన్ కారణంగా భూమికి ప్రమాదం లేదని 93 మిలియన్ మైళ్ల దూరమున్న భూమిపైకి అగ్ని గోళాలను వెదజిమ్మే శక్తి సూర్యునికి లేకపోవడమేనని స్పష్టం చేసింది. 

సీఎంఈ అంటే?

సౌర పవనం, ప్లాస్మా (జీవ ద్రవ్యం), అయస్కాంత క్షేత్రాలు భారీ విస్ఫోటనం చెంది సూర్యుని కాంతి మండలంలోకి మంటలు చెలరేగి.. అంతరిక్షంలోకి దూసుకురావడాన్నే సీఎంఈ (కరోనల్ మాస్8 ఎజెక్షన్) అంటారు. ఈ ప్రక్రియనే సోలార్ ఫ్లేర్‌గా కూడా పిలుస్తారు. బలమైన సీఎంఈ బిలియన్ టన్నుల ప్లాస్మా కలిగి ఉండి మేఘాల రూపంలో గంటకు 10 లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. బలహీన అయస్కాంత క్షేత్రమున్న గ్రహాలు, ఉపగ్రహాలపైనున్న వాతావరణాన్ని సీఎంఈ నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

చంద్రునికి పొంచి ఉన్న ముప్పు

నాసా పరిశోధకుల ప్రకారం..చంద్రునిపై వాతావరణం చాలా బలహీనంగా ఉంటుంది. 2 రోజుల సీఎంఈ ప్రయాణంలో చంద్రుని ఉపరితలంపైనున్న 100- 200 టన్నుల పదార్థం కనుమరుగవుతుంది. అయితే సౌరతుఫాను వల్ల చంద్రునికి జరిగే నష్టం వాస్తవమా? కాదా? అనే విషయం 2013లో తాము ప్రయోగించే ‘ల్యూనార్ అట్మాస్పియర్, డస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్’ (ఎల్‌ఏడీఈఈ)తో తేలపోనుందని నాసా వెల్లడించింది. ఈ సీఎంఈ వల్లే గతంలో అంగారకునిపై ఉన్న వాతావరణం పూర్తిగా నాశనమైపోయి ఉంటుందని నాసా పేర్కొంది. సౌర తుఫాను వల్ల ఈ గ్రహంపై వాతావరణం ఎలా తుడుచుకుపెట్టుకపోయిందో.. 2013లో అరుణ గ్రహంపైకి ప్రయోగించే మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (ఎంఏవీఈఎన్) వాహక నౌక పరిశోధించనుందని వెల్లడించింది. 

యుగాంతం ఎందుకు అసాధ్యం..

2012లో ఏర్పడే సీఎంఈతో భూమిపై ఉన్న వాతావరణం అంతా దెబ్బతిని యుగాంతం సంభవిస్తుందని కొందరు వదంతులు సృష్టించారు. దీనికి వారు చెప్పిన కారణం.. ‘సౌరవ్యవస్థ ప్రస్త్తుతం 11 ఏళ్ల జీవిత చక్ర ప్రమాణాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉంది. అయితే 2012 చివర్లో సంభవిస్తున్నట్లుగా భావించే సోలార్ ఫ్లేర్‌తో గనుక సౌర జీవిత చక్రవూపమాణాన్ని పెంచుకునే ప్రక్రియ ఒకేసారి సంభవిస్తే భూప్రళయం తప్పద’ని హెచ్చరించారు. దీనిపై నాసా స్పందిస్తూ.. ‘ఇలాంటి సౌరచక్రం శతాబ్దాలుగా జరుగుతోంది. ఇంతకుముందు ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి సంభవించినా భూమికి ఎలాంటి హానీ కలగలేదు. అదేవిధంగా సోలార్ ఫ్లేర్ అనే ఈ ప్రక్రియ 2012లో కాకుండా 2013 లేదా 2014లో సంభవించే అవకాశం ఉంద’ని సమాధానం ఇచ్చింది. అయితే దీనికున్న శక్తి మేరకు భూవాతావరణంపై తీవ్ర ప్రభావం మాత్రం చూపగలదని హెచ్చరించింది.

manatelugunela

No comments:

Post a Comment