Saturday, April 30, 2011

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు


ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం
నాలుగు తూటాలు, 17 కత్తి పోట్లు
ఓవైసీ ఆస్పత్రికి తరలింపు
క్షేమంగా ఉన్నట్లు లేఖ పంపిన అక్బర్
హైదరాబాద్ : మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై శనివారం బార్కాస్ వద్ద దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట వద్ద ఆయనతో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై కూడా దాడి జరిగింది. పాదయాత్ర చేస్తుండగా ఉదయం 11.15 నిమిషాలకు ఒవైసీపై నాలుగు రౌండ్లు కాల్పులతో పాటు కత్తులతో దాడి చేశారు. ఒవైసీ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు సమాచారం.
అక్బర్ పాదయాత్ర గురించి ముందుగానే తెలుసుకున్న మహ్మద్ పహిల్వాన్ అనే ఎం.బి.టి నాయకుడు తన అనుచరులతో ఈ దాడికి తెగబడినట్టు ప్రాథమిక సమాచారం. మహ్మద్ గుర్రంపై వచ్చి అక్బర్‌పై కాల్పులు జరపగా, ఆయన అనుయాయులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అక్బర్ శరీరంలోకి నాలుగు తూటాలు దూసుకుపోయాయి. 17 కత్తిపోట్లు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అక్బరుద్దీన్, మహ్మద్ ల మధ్య పదెకరాల భూవివాదానికి సంబంధించిన గొడవలు గత కొంతకాలంగా జరుగుతున్నాయని, అక్బరుద్దీన్- మహ్మద్ మధ్య పాతకక్షలు కూడా ఉన్నాయని, గత ఎన్నికల నుండే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనతో ఎంఐఎం పార్టీ దిగ్భ్రాంతికి గురైంది. పెద్దఎత్తున మజ్లిస్ కార్యకర్తలు ఆస్పత్రికి చే రుకుంటున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. నగరమంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడి చేసినవారు పరారీలో ఉన్నారు. 

No comments:

Post a Comment