Wednesday, April 27, 2011

బాబాను ప్రశంసలతో ముంచెత్తిన విదేశీ పత్రికలు


బాబాను ప్రశంసలతో ముంచెత్తిన విదేశీ పత్రికలు
 బ్రిటిష్ మీడియా సత్యసాయి బాబాను ఆకాశానికెత్తేసింది. ఈ శతాబ్దంలో గుర్తించ దగిన మత ప్రముఖుల్లో ఆయన కూడా ఒకడంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఆదివారం మరణించిన బాబా (84) భారత్‌లో ఏంతో ప్రాచుర్యం పొందిన వ్యక్తి మాత్రమే కాకుండా..పూర్తిగా అర్థంకాని వ్యక్తి కూడా అని డైలీ టెలిగ్రాఫ్ పత్రిక వ్యాఖ్యానించింది. సాయి భక్తులకు మాత్రం ఆయన జీవించి ఉన్న దేవుడు. ఆయన తరచుగా క్రీస్తు, కృష్ణ, బుద్ధ వంటి వారితో తనను పోల్చుకుంటూ ఈ యుగానికి సంబంధించిన అవతారమూర్తిగా తనను తాను చెప్పుకొనేవారు అని పేర్కొంది. ఆయన పైకి అన్నీ తెలుసని నటించే వ్యక్తి అంటూ వ్యతిరేకులు ఎంతగా విమర్శించినా అత్యంత చరిష్మా ఉన్నవాడిగా అభివర్ణించింది. భారత్‌కు చెందిన అత్యంత ప్రాచుర్యమైన, వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్తల్లో బాబా ఒకరుగా దిటైమ్స్ వ్యాఖ్యానించింది. సాయిబాబా శాంతి, ప్రేమ, అహింస గురించి బోధించారని పేర్కొంది. కేవలం భారత్ నుంచే కాదు.. అమెరికా, జర్మనీ, స్కాండినేవియా, ఇటలీ దేశాలనుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆయన్ను సందర్శించేవారని దిటైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

No comments:

Post a Comment