Monday, April 11, 2011


విశాఖ ఉక్కు ఎస్‌ఎంఎస్‌లో భారీ ప్రమాదం
 ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కులో అదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, రూ.100కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ‘ఎ’ షిప్ట్‌డ్యూటీ నిర్వహిస్తున్న 8మంది కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టి పరుగులు తీయడంతో తృటిలో ప్రాణనష్టం తప్పింది. నవరత్న హోదాకలిగిన విశాఖ ఉక్కు చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే ప్రథమం. స్టీలు మెల్టింగ్‌షాప్‌(ఎస్‌ఎంఎస్‌) మెషిన్‌-2లో హాట్‌మెటల్‌ను తీసుకెళ్లే లేడల్‌ లెైనింగ్‌బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ఉక్కు నేలపాలెైంది. లేడల్‌ 150టన్నుల ఉక్కును సిసిడికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉక్కు దిమ్మలుగా మారి బయటకు వస్తుంది. అయితే, లేడల్‌ లెైనింగ్‌ బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ద్రవం ఉక్కు ఎస్‌ఎంఎస్‌ మెషిన్‌-2ప్రాంతంలో బయటకు చిమ్మింది. 
దీని కారణంగా ఇటీవల 80కోట్ల రూపాయల వ్యయంతో అమర్చిన ఆటో మెషీన్‌ పనికిరాకుండా పోయే ప్రమాదముందని ఉక్కు వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదవశాత్తు సైడ్‌ వాల్వ్‌ క్లోజ్‌ అయినప్పుడు లేడల్‌ యాంగిల్‌ కంట్రోల్‌ రూం నుంచి మార్చే అవకాశం ఉంది. యాంగిల్‌ మారితే ద్రవ ఉక్కు బయటకు పోయి మెషినరీ సురక్షితంగా ఉండేదని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లోపించిన లెైనింగ్‌ బ్రిక్స్‌, సమయానికి స్పందించని అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రమాద తీవ్రతను పెంచాయి. 1700 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కారణంగా మంటలు వ్యాపించి కేబుల్స్‌, ఇన్‌స్ట్రుమెంట్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి.‘ఎ’షిప్ట్‌లో ఫోర్‌మేన్‌, చార్జ్‌మేన్‌, జూనియర్‌మేనేజర్‌, టెక్నీషియన్లు ఉన్నారు. ఉక్కు ప్రమాదానికి 6500హీట్లతో మార్చాల్సిన లెైనింగ్‌బ్రిక్స్‌ అంతకు మించిన హీట్ల వరకూ మార్చకపోవడంతో ప్రమాదం సంభవించినట్టు కార్మికసం ఘాలు ఆరోపిస్తున్నాయి. మెషిన్‌-2లో జరిగిన ప్రమాదానికి నిరసనగా మెషిన్‌-5, మెషిన్‌-6లో ‘ఎ’షిప్ట్‌లో పనులు నిలిపివేశారు. కాగా, యంత్రాలు పునర్నిర్మించేందుకు 3నెలల కాలం పడ్తుందని అధికారులు చెబుతున్నారు. ఉక్కులో ఆరు మెషీన్‌లు ఉండగా నాలుగు మెిషీన్‌లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇందులో మరో మెషీన్‌ ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజూ వేయిటన్నుల ఉక్కు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశముంది. సంఘటనా స్థలిని వర్క్‌‌స జిఎం పిఎన్‌రావు, వర్క్‌‌స ఇడి రంజన్‌లు పరిశీలించి నష్టాన్ని అంచనావేస్తున్నారు.

No comments:

Post a Comment