Sunday, July 17, 2011

అవసరమైతే అపరిచితుడ్ని అవుతా..

ఈ మాట అన్నది ఏ సినిమా స్టారో.. అవినీతిని అంతం చేయాలనుకుంటున్న రాందేవ్ బాబానో, అన్నా హజారేనో కాదు. రాష్ట్ర రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో వివాదాల్ని ఇంటిపేరుగా మార్చుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రాముడి లాంటి వాడినని తనకు తానే కితాబిచ్చుకున్న లగడపాటి అవసరమైతే మాత్రం అపరిచితుడిలా మారిపోతానన్నారు. జగన్ పార్టీ నేతల విమర్శలకు, సాక్షి కథనాలకు ప్రతిస్పందనగా ఈ మాటలను అన్నారు. కేవలం పత్రిక, ఛానల్ ఉన్నాయని జగన్ మిడిసిపడుతున్నాడని, తలచుకుంటే తాను వంద ఛానళ్లు పెట్టగలనంటూ రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్ పెట్టేవాడైతే, జగన్ కొట్టేసే వాడంటూ విమర్శించారు. మడమతిప్పనని జగన్ తరచూ చెప్పే మాటలు నిజమైతే, సీబీఐ విచారణ వద్దంటూ సుప్రీంకు వెళ్లకూడదని సవాల్ విసిరారు. ఉపేంద్ర వారసుడిగా తాను రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే చేరానని, వైఎస్ వెంట రాష్ట్రమంతా కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగానని వివరణ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లే తనకు స్పూర్తనీ చెప్పారు లగడపాటి. సాక్షి కథనాలకు లీగల్ నోటీసులూ అందిస్తానన్నారు.

No comments:

Post a Comment