Sunday, July 17, 2011

ఆర్.ఇ.సి.ఎస్ ద్వారా వినియోగదారుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

విశాఖపట్నం:ఆర్.ఇ.సి.ఎస్ సంస్థ ద్వారా ఐదు మండలాల్లో ఉన్న వినియోగదారుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసేందుకు తమ పాలకవర్గం నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, కశింకోట, తాళ్లపాలెం డైరక్టర్లు పెంటకోట శ్రీనివాసరావు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, సంస్థ ఎం.డి ఎన్.ఎన్ అప్పారావులు స్పష్టం చేసారు. స్థానిక సంస్థ ప్రధాన కార్యాలయంలోజూలై 16 శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 2010-11 సంవత్సరం నుండి 10వ తరగతిలో 500 మార్కులు పైబడిన వినియోగదారుల పిల్లలకు 2000 రూపాయలు స్కాలర్ అందజేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఈ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థినివిద్యార్థులకు తమ బోర్డు ఉన్నంతకాలం రెండువేల రూపాయలను అందజేస్తామని తెలిపారు. అలాగే ఐదు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థివిద్యార్థులకు బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముగ్గురు విద్యార్థులకు ఒక బెంచ్ వంతున ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందిరకరుణ తరంగణి చెక్కు లు 453 ఉన్నాయని వాటిని ఈనెల 20 నుండి అందజేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రతిపాదించిన పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది రాష్ట్రంలో ఫస్ట్‌మార్కులు సాధించగా ర్యాంక్‌లో 13 వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్.ఇ.సి.ఎస్‌లలో మాత్రమే పాలిటెక్నికల్ కళాశాలలను ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఏర్పాటు చేసారన్నారు. ఈ ఏడాది పాలిటెక్నికల్‌లో ఇ.సి.ఇ కోర్సుకు కూడా అనుమతి పొందామన్నారు. విద్యార్థివిద్యార్థుల నుండి ఈ ఏడాది పాలిటెక్నికల్‌కు 213 దరఖాస్తులు అందాయని వాటిలో 23 దరఖాస్తులు తొలగించామని, మిగిలిన 190 దరఖాస్తులకు కౌన్సిలింగ్ ఎప్పుడు అనే విషయమై పత్రికలద్వారా,్ఫన్‌ద్వారా, పోష్టుకార్డులద్వారా సమాచారాన్ని అందజేస్తామని చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment