Saturday, July 16, 2011

దేశ ఆర్థిక రాజధానిపై ముష్కర పంజా






దేశ ఆర్థిక రాజధాని13-07=2011 బుధవారం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. 2008 నవంబర్‌ 26 నాటి పేలుళ్ల దుర్ఘటన ఇంకా స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే, నిందితులకు శిక్ష పడకముందే… బుధవారం సాయంకాలం ముంబయిలో వరసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించా యి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంభవించిన ఈ పేలుళ్లలో 21 మంది మర ణించారు. వందమంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లో ఇండియన్‌ ముజా హిదిన్‌ ఉగ్రవాద సంస్థ ప్రమేయం వున్నట్లుగా అనుమానిస్తున్నారు.  రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌ను సంప్రదించి పేలుళ్ల గు రించి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేలుళ ్లపట్ల విచారం వ్యక్తం చేశారు.‘సాయంకాలం ఆరు గంటల 45 నిముషాల తర్వాత… కొద్ది నిముషాల వ్యవధిలో జవేరీ బజార్‌, ఒపేరా హౌస్‌, దాదర్‌ లలో వరసగా ఈ పేలుళ్లు సంభవించాయి. కనీసం 21 మంది మరణించారు. 141 మంది గాయపడ్డారు. మూడు పేలుళ్లనూ పోలిస్తే, ఒపేరా హౌస్‌ వద్ద జరిగిన పేలుడు చాలా శక్తివంతమైంది’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ చెప్పారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం మాట్లాడుతూ – ముంబయి పేలుళ్లలో పదిమంది మరణించారని, గాయపడిన 54 మందిని ఆస్పత్రుల్లో చేర్చారని ధ్రువప డిందని చెప్పారు. మృతుల సంఖ్య పెరగవచ్చని ఆయన తెలిపారు. మరే పేలుడు గురించి కానీ, బెదిరింపు గురించి కానీ సమాచారం లేదని చిదంబరం అన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్‌ మాట్లాడుతూ – వంద మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారని తెలిపారు. మూడు పేలుళ్లకు మధ్య ఎక్కువ వ్యవధి లేదని, కొన్ని నిముషాలలోనే సంభవించాయని చిదం బరం అన్నారు. వరసగా పేలుళ్లు జరగడం చూస్తే ఇది ఉగ్రవా దులు పథకం ప్రకారం చేసిన దాడి అని అర్థమవుతోందని హోంమంత్రి చె ప్పారు. ముంబయి పేలుళ్ల సమాచారంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్త మయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు ముంబాయి పేలుళ్ళను ఖండించాయి.
అత్యాధునిక పేలుడు సామగ్రితో…
ఈ పేలుళ్లకు అత్యాధునిక పేలుడు పరికరాలను (ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైసెస్‌- ఐఇడి) లను వినియోగించారు. 2008 ముంబయి పేలుళ్ల నింది తుడు అజ్మల్‌ కసబ్‌ పుట్టినరోజు నాడే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. జవేరీ బజార్‌ ప్రాంతం నుంచి ఒక ఐఇడిని కనుగొన్నట్టు ముంబయి పోలీసులు తెలిపారు.
పేలుళ్లు ఎలా జరిపారు?
మూడింటిలో ఒక పేలుడు మారుతీ ఎస్టీం కారులో సంభవించిందని, మరొకటి మోటార్‌ సైకిల్‌లో జరిగిందని హోంశాఖ కార్యాదర్శి సింగ్‌ తెలి పారు. జవేరీ బజార్‌ పేలుడు బెస్ట్‌ బస్టాప్‌లో ఒక మీటర్‌ బాక్స్‌లోని ఎలక్ట్రిక్‌ కేబినెట్‌లో సంభవించిందని పోలీసులు అన్నారు. మొదటి పేలుడు దక్షిణ ముంబయిలోని జవేరీ బజార్‌ షకీల్‌ మెమోన్‌ వీధిలోని ముంబాదేవి ఆలయం సమీపంలో జరిగింది. ఆ పేలుడులో 25 మంది గాయపడ్డారని ముంబయి పోలీసు ప్రతినిధి నిసార్‌ తంబోలీ తెలిపారు. ఈ బజార్‌లో చాలా నగల దుకాణాలు ఉన్నాయి. ఒపేరా హౌస్‌ దగ్గర్లో ఉన్న డైమండ్‌ మార్కెట్‌ వద్ద జరిగిన బాంబు పేలుడులో దాదాపు 25 మంది గాయపడ్డారు. ఇది కూడా దక్షిణ ముంబాయిలోనే ఉంది.సెంట్రల్‌ ముం బయిలోని దాదార్‌ వెస్ట్‌లో కబూతర్‌ఖానా వద్ద జరిగిన మూడో పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని సెయింట్‌ జార్జి, నాయర్‌, కెఈఎం ఆస్పత్రుల్లో చేర్పించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ చెప్పారు. వరసగా జరిగిన మూడు పేలుళ్లతో నగరంలో హై ఎలర్ట్‌ ప్రకటించారు.
గతంలోనూ జవేరీ బజార్‌పై గురి
2003 నాటి పేలుడులో 54 మంది మరణించిన తర్వాత చాలాసార్లు ఉగ్రవాదులు జవేరీ బజార్‌పై గురిపెట్టారని చవాన్‌ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రాలయ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక బృందం సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు.
చవాన్‌తో ప్రధాని సంప్రదింపులు
పుకార్లను నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరించాలని పృథ్వీరాజ్‌ చవాన్‌ ముంబయి ప్రజల్ని కోరారు.ఇలా ఉండగా, పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికే ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ముఖ్యమంత్రి చవాన్‌తో మాట్లాడారు. జాతీయ భద్రతా దళాల్ని, ఫోరెన్సెక్‌ నిపుణుల్ని హుటాహుటిన బిఎస్‌ఎఫ్‌ విమానంలో ముంబయి పంపించారు. ముంబయి రైలు పేలుళ్లు జరిగి అయిదేళ్లు పూర్తయిన రెండు రోజులకే ఈ పేలుళ్లు జరిగాయి.

No comments:

Post a Comment