Thursday, May 24, 2012

పెట్రో....మంటలు......


పెట్రో....మంటలు......

 పెట్రోల్‌ రేటు సెంచరీని చేరడానికి ఎగిసెగిసి పడుతోంది. డాలర్‌ బూచీ చూపి కేంద్రం ఒకేసారి లీటర్‌కు ఆరు రూపాయలకు పైగా పెంచడంతో పెట్రోల్‌ రేటు కొండెక్కి కూర్చొంది. స్థానిక పన్నులతో కలిపి హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 81కి చేరింది. పెట్రో ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరకు నిరసనగా రాష్ట్ర ప్రజానికం రోడ్డెక్కింది. ర్యాలీలు, ఆందోళనలతో నిరసన తెలిపారు.పెట్రో ధరలను భారీగా పెంచి యూపీఏ సర్కార్‌ జనానికి షాక్‌ ఇచ్చింది. సామాన్యుడి నడ్డి విరుస్తూ.. లీటర్‌ పెట్రోల్ ధరను ఒక్కసారిగా 8 రూపాయలు పెంచడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఏడాదిలోనే రెండోసారి పెట్రో ధరలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

పెట్రోల్‌ ధరల పై ప్రతిపక్షాలు ఫైర్‌ అయ్యాయి. పెట్రోధరల పెంపుకు నిరసనగా యూపీఏ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్థున్నారు కేంద్రం ఒక ప్రణాళిక లేకుండా పాలిస్తోందని, సామాన్య ప్రజలపై ధరల భారం మోపుతోందని దుయ్యపట్టారు. పెంచిన పెట్రోల్‌ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అంటున్నారు.పెట్రోల్‌ రేట్ల పెంపుపై వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. సీపీఎం, సీపీఐ కార్యకర్తలు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యూపీఏ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ర్యాలీలు, ఆందోళనలతో నిరసన తెలిపాయి.పెట్రోల్‌ ధర పెరిగిందన్న వార్తలతో వాహనదారులు బంకుల ముందు క్యూ కట్టారు. మరోవైపు పెరిగిన రేట్లను క్యాష్‌ చేసుకునేందుకు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు,

No comments:

Post a Comment