Sunday, May 6, 2012

సమాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రవదన్


మాచార వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తా:చంద్రవదన్
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు సమాచార వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తానని సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. 
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా డాక్టర్ ఆర్.వి. చంద్రవదన్  04-05-2012 తేది శుక్రవారం  బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన ప్రచారం కల్పించడంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కీలకమైన భూమిక నిర్వహిస్తుంది. ఈ పదవిలో గత పదిన్నర నెలల నుంచి కొనసాగిన వెంకటేశం ను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ, ఆయన స్థానంలో చంద్రవదన్‌ను ఇటీవలే ప్రభుత్వం నియమించింది. చంద్రవదన్ గతంలో పనిచేసిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో, రాజీవ్ విద్యా మిషన్ (సర్వశిక్షా అభియాన్) లో తనదైన శైలిని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా సిఎం ప్రత్యేకంగా చంద్రవదన్‌ను ఎంపిక చేశారు. 2014 సాధారణ ఎన్నికలతో పాటు, ఈలోగా జరిగే ఇతర ఎన్నికల్లో ప్రభుత్వానికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని భావిస్తున్నందు వల్ల చంద్రవదన్‌ను సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా నియమించినట్టు విశ్వసీయవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను మీడియా ద్వారా గ్రామీణ ప్రజలకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తానన్నారు. సమాచారాన్ని ప్రజలకు మరింత తొందరగా చేరవేసేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటామని చంద్రవదన్ తెలిపారు.

No comments:

Post a Comment