Tuesday, May 8, 2012

ఓ వ్యక్తి స్వార్థంవల్లే ఉప ఎన్నికలు


ఓ వ్యక్తి స్వార్థంవల్లే ఉప ఎన్నికలు


-తూర్పుగోదావరిలో సీఎం కిరణ్
దేశంలో సోనియానే పెద్ద క్రిస్టియన్: ధర్మాన
టీడీపీ, టీఆర్‌ఎస్‌తో జగన్ కుమ్మక్కు.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
-తండ్రి మాటను జగన్ విస్మరించారు..
-డీఎల్ పరీక్ష వాయిదాపై విచారణ జరిపిస్తాం.. తూర్పుగోదావరిలో సీఎం కిరణ్
-ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
-కోడ్ వల్ల అభివృద్ధి కుంటుపడింది
క వ్యక్తి స్వార్థం వల్లే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్.. టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కేసీఆర్, కాంగ్రెస్‌కు శత్రువైన చంద్రబాబుతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి ఏ నాడు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయలేదని చెప్పారు. వైఎస్సార్ తన మరణానికి రెండు రోజుల ముందు జరిగిన ఓ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయొద్దని సూచించినట్లు తెలిపారు. ఆ సమావేశంలో జగన్ కూడా ఉన్నారని, అయినా తన తండ్రి మాటను ఆయన ఎందుకు విస్మరించాడో అర్థం కావడంలేదని సీఎం పేర్కొన్నారు. జగన్ అవినీతి సొమ్ముతో 70 గదుల ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రామచంవూదాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలో నిర్వహించిన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టేనని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తాము వీఆర్వో, వీఆర్‌ఏ నియామకాలు చేపట్టామని సీఎం చెప్పారు. ప్రతిభ ఉన్న వాళ్లకే పట్టం కట్టామని తెలిపారు. 2014లో రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రామచంవూదాపురం నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులును భారీ గెలిపించాలని ఓటర్లను కోరారు. సభకు హాజరైన జనాలను చూస్తుంటే త్రిమూర్తులు గెలుపు ఖాయమే అనిపిస్తోందన్నారు. తోట త్రిమూర్తులు గెలుపు కోసమే రామచంవూదాపురం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్, టీడీపీతో కుమ్మక్కైనందువల్లే పిల్లి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి డీఎల్ రవీంవూదాడ్డి పనిలేకనే ఏదో ఒకటి మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. మీడియా సంస్థలు కూడా పనిలేకే ఆ వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్నారు. డీఎల్‌వి చిల్లర రాజకీయాలని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. మంత్రులు తమకు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు. పార్టీలో ఎవరు హద్దుమీరినా అధిష్ఠానంతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. డీఎల్ పరీక్ష వాయిదా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఆదేశిస్తామని సీఎం వెల్లడించారు. జలయజ్ఞం కోసం నిధులు సేకరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా 12 జిల్లాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. ఈ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తోట నరసింహం, పీ విశ్వరూప్, అమలాపురం ఎంపీ హర్షకుమార్, రామచంవూదాపురం కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పిరికిపంద అని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
 ద్రాక్షారామం ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ... 
జగన్ లక్షకోట్లు ఎలా సంపాదించాడో ఇప్పటీకీ సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. అటువంటి వ్యక్తికి ప్రజలు అధికారం ఎందుకు అప్పగించబోరని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని, ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీని చూసి జగన్ చాలా నేర్చుకోవాలని సూచించారు. వారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదులుకున్నారని చెప్పారు. సీఎం పదవి చేప జగన్‌కు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సమాజంపట్ల, ప్రజా సమస్యలపైన జగన్‌కు అవగాహన లేదని విమర్శించారు. జగన్‌కు కాంగ్రెస పార్టీ చేసిన మోసం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. జగన్ ఒక కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారని ధర్మాన విమర్శించారు. దేశంలో అతిపెద్ద క్రిస్టియన్ సోనియాగాంధేనని, క్రిస్టియన్లు ఆమెను కాదని జగన్‌కు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. పాదయాత్ర సందర్భంగా తాను వైఎస్సార్‌తోపాటు 1647 కిలోమీటర్లు నడిచానని, జగన్ ఒక్కరోజు కూడా యాత్రలో పాల్గొనలేదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించాలని ఓటర్లను కోరారు.

No comments:

Post a Comment