Tuesday, May 29, 2012

ముఖ్యమైన 10 వార్తలు…


ముఖ్యమైన 10 వార్తలు…


1.   జగన్ ను విఐపీ ఖైదీగా పరిగణించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదాలు వేసిన పిటీషన్ ను పరిశీలించిన కోర్టు అందుకు అనుమతించింది. దీంతో జగన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అండర్ ట్రైల్ ఖైదీగా జగన్ జైల్లోకి అడుగుపెట్టే వేళకు, అప్పటికే అక్కడ తొమ్మిది మంది విఐపీ ఖైదీలు ఉండటంతో జగన్ పదవ నెంబర్ విఐపీ ఖైదీగా లోపలకు అడుగుపెట్టారు. కాగా, మొత్తం ఖైదీలను లెక్కలోకి తీసుకుంటే జగన్ కు ఇచ్చిన ఖైదీ నెంబర్ 6093.

2   చంచల్ గూడ జైలు అధికారులు, జగన్  విఐపీ అండర్ ట్రైల్ ఖైదీ కావడంతో ఆయనకు  మెరుగైన సౌకర్యాలే కల్పించారు . సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ జగన్ కు సోమవారం రాత్రి నిద్రపట్టలేదు. అర్థరాత్రి దాటినా ఆయన గదిలో లైట్ వెలుగుతూనే ఉన్నదనీ, ఆయన బెడ్ మీద పడుకోకుండా కుర్చీలో కూర్చునే ఉన్నారననీ,  జగన్ జైలులోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ముభావంగానే ఉన్నారని  జైలు సిబ్బంది అందించిన సమాచారం. తెల్లవారుఝామున 3-00 గంటల దాకా జగన్ నిద్రలోకి జారుకోలేదు. ఆ తర్వాత కాసేపు పడుకున్నా, ఆరు గంటలకే ఆయన నిద్రలేచారు. ఉదయం పాలు తాగారు. ఆ తర్వాత తనకు పేపర్లు తెప్పించి ఇవ్వమని జైలు సిబ్బందిని కోరారు. ఇంగ్లీష్ , తెలుగు పత్రికలు మొత్తం 14 పేపర్స్ ను ఆయన తెప్పించుకున్నారు.

3. విఐపీ అండర్ ట్రైల్ ఖైదీ కావడంతో అల్పాహారం దగ్గర నుంచి భోజనం వరకూ అన్నింటిని ఆయన ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. సాదారణంగా ఈ సౌకర్యం ఉన్నప్పుడు ఖైదీలు తమ ఇంటి నుంచో లేదా బంధువుల ఇళ్ల నుంచో ఆహారపానీయాలను తెప్పించుకుంటారు.

4.  జగన్ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్‌ఫోర్స్ మెంట్ (ఈడి) బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత జగన్ ను ఇంటరాగేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

5.  జగన్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ ఈవేళ (మంగళవారు) మరోసారి పిటీషన్ దాఖలు చేయబోతున్నది.

6. హైదరాబాద్ లోని కొండాపూర్ లోని లగడపాటి రిసార్ట్ లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది.  ప్లాసిడా పేరిట ఈ రిసార్ట్ ను లగడపాటి భార్య పద్మ నిర్వహిస్తున్నారు. తెలంగాణవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అక్కడ కరపత్రాలు లభిస్తున్నా, ఈ పని వారు చేయలేదనీ, జగన్ వర్గమే చేసిఉంటుందని లగడపాటి భావిస్తున్నారు.

7 . న‌టుడు, ద‌ర్శకుడు ఏవీయ‌స్ ప్రక‌టించిన ‘బ్లాగ్ బ‌స్టర్ అవార్డ్స్‌’కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం ద‌క్కింది.

8. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
విజ‌య‌మ్మలోట‌స్ పాండ్ వద్ద చేప‌ట్టిన దీక్షను విర‌మింప‌చేశారు.

9 సోమవారం ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించింది.

10  .తీవ్రవాదులు హింసామార్గాన్ని విడనాడి, శాంతిబాటన సాగాలని యుపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ మరోమారు పిలుపునిచ్చారు. తీవ్రవాదుల్లో పరివర్తన రావాలనీ, దేశసమగ్రాభివృద్దిలో వారు కూడా భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు.

No comments:

Post a Comment