Thursday, November 24, 2011

ఏడాది కిరణం


ఏడాది కిరణం
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికిస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన ఏడాది దిశగా అడుగుల వేస్తున్నది. ఈ నెల 25తో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కానుండడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది. వైఎస్‌ ఆకస్మిక మరణంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీ ల్లోనూ తీవ్ర సంక్షోభం నెలకుంది. అంతేకాకుండా ప్రత్యేక వాద ఉద్యమాలు ఉవ్వెత్తిన వెగిసిపడ్డాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభ కోరల్లో చిక్కుకొంది. అనంతరం 14 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజెటి బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో పరిస్థి తులు చక్కబడలేదు.
ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో గతంలో మంత్రిగా ఎటువంటి అనుభవం లేకపోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన మార్క్‌ పాలన తో నల్లారి ఏడాది పాలనకు చేరువకావడం ఆయన మంత్రివర్గ సహచరుల సైతం నమ్మశక్యం కావడం లేదు. కేబినెట్‌లో ఒకరిద్దరు తప్ప మెజారిటీ మంత్రులు నల్లారిపాలనకు బ్రహ్మరథం పడుతూ ఆయనపై పూర్వి విశ్వాసం ఉంచడం గమనార్హం. వచ్చే ఎన్నిక ల్లోనూ నల్లారి సారథ్యంలో తమ పార్టీ ముందుకు పోతోందని మెజారిటీ మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్‌ సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలన సంస్కరణలకు అన్ని స్థాయిల్లో పదును పెడుతూ, మరోవైపు ఖాళీ ఖజానాను తిరిగి పట్టాలెక్కించడం బాగా కలిసివచ్చిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గ్రీన్‌ఛానల్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎటువంటి నిధుల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పన్నుల వాత కాస్త ఎక్కువైనప్పటికీ.. మెజారిటీ ప్రజల ఆంక్షాలు నెరవేర్చే దిశగా నల్లారి సర్కార్‌ సంక్షేం దిశగా పరుగులెట్టింది.
రచ్చబండతో ప్రజలకు మరింత చేరువగా…
ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు నల్లారి మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో వైఎస్‌ ఇమేజ్‌ను కూడా నల్లారి క్రాస్‌ చేశారని ఆయన కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు చెబుతున్నారు. లక్ష 16 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, రాజీవ్‌ యువ కిరణాల పేరుతో ప్రైవేట్‌రంగంలో వచ్చే మూడేళ్లల్లో 15 లక్షల ఉద్యోగాల రూపకల్పన నల్లారి ఇమేజ్‌ పెంచింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఈ పథకం ఎంతగానో ఆకట్టుకొన్నది. అదే విధంగా రూపాయికే కిలో బియ్యం పథకం పేద ప్రజలకు ఎంతో ఊరట నిచ్చింది. రెండోవ దశ రచ్చబండతో 35 లక్షల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సామాజిక ఫించన్లు తదితర పథకాలు నల్లారి పాలనా సుస్థిరతకు ఎంతోగానో తోడ్పడినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

No comments:

Post a Comment