Sunday, November 6, 2011

విద్యుత్ తీగలే మృత్యుపాశాలు




విశాఖపట్నం: అగనంఫూడీ లొ విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి కుడా విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి మునగఫాక గ్రామానికి చెందిన భేత రాజు 28 ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా భేత రాజు  శనివారం ఉదయ్ం కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అంటూన్నరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం కె జి హె ఛే కు తరలించారు ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు  గాజువాక ఎస్‌ఐ రమన కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇలా ఉండగా  విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి ఆ విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి. ఈ దుర్ఘటనపై మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. కశింకోట మండలం చెరకాం గ్రామానికి చెందిన రొంగలి నాయుడుబాబు (40) ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 20ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా నాయుడుబాబు శనివారం సాయంత్రం అనకాపల్లి మండలంలోని ఊడేరు జంక్షన్‌లో కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు. కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం తరలించారు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా దర్జీనగర్ ప్రాంతంలో పొక్లెయిన్‌తో రోడ్డుపక్కన తుప్పలు తొలగించే పనులు చేస్తున్నారు. అనుకోకుండా పైన ఉన్న ఆర్‌ఈసీఎస్ వైర్లకు పొక్లెయిన్‌కు తగిలి ఆ వైర్లు వాటిపై ఉన్న ట్రాన్స్‌కో వైర్లకు తగిలాయని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా ఆర్‌ఈసీఎస్ వైర్లకు విద్యుత్ సరఫరా జరిగి, ఊడేరు జంక్షన్‌లో పోల్‌పై పనిచేస్తున్న నాయుడుబాబు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని అన్నారు. కాగా ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యతగా మృతుని కుటుంబానికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గంగుపాం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment