Wednesday, May 25, 2011

తీరుమార్చుకో .. పార్టీ శ్రేణుల్ని ‘చే’జారనివ్వవద్దు – సిఎంకు సోనియా క్లాస్‌

తీరుమార్చుకో .. పార్టీ శ్రేణుల్ని ‘చే’జారనివ్వవద్దు – సిఎంకు సోనియా క్లాస్‌
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంపై కేంద్రీకరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడిక్కడ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో త్వరలో తిరిగి ఉధృతమౌతుందని భావిస్తున్న తెలంగాణ ఉద్యమం, కడప ఉప ఎన్నికల ఫలితాలు, జగన్‌ వర్గం ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చాలాకాలంగా ఖాళీగా ఉన్న పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యవహార శైలిపై వస్తున్న ఫిర్యాదులపై దాదాపు అరగంటకు పైగా లోతుగా చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.  రాష్ట్రంలో క్రమేపీ దిగజారుతున్న కాంగ్రెస్‌ పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్న అధిష్టానం బహుశా, వచ్చే నెలలో రాజస్థాన్‌లో నిర్వహించనున్న చింతన్‌ శివిర్‌ (మేధో మథన సదస్సు)లో వివరంగా చర్చించి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఈలోగా పరిస్థితి పూర్తిగా చేజారిపోకుండా చూసే ఉద్దేశంతో రాష్ట్ర పర్యటన తర్వాత గులాంనబీ ఆజాద్‌ పార్టీ అధ్యక్షురాలికి సమర్పించిన నివేదిక ప్రాతిపదికగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకోవాలని, పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రులు, లెజిస్లేటర్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నాయకులు పలువురు ముఖ్యమంత్రి పనితీరును తీవ్రంగా దుయ్యబడుతూ ఆజాద్‌కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని సోనియాగాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రికి కేంద్రం నుండి అవసరమైన అన్నిరకాల సహాయ, సహకారాలుంటాయని హామీ ఇచ్చిన అధిష్టానం పార్టీ నాయకత్వం ఆశిస్తున్న ఫలితాలను తెచ్చే బాధ్యతను గుర్తించి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ నాయకులతో సమన్వయాన్ని మెరుగుపరిచే విషయంలో అవసరమైతే ఇప్పటికే ఏర్పాటైన పిసిసి-ప్రభుత్వ సమన్వయ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని కూడా వాగ్దానం చేసినట్లు తెలియవచ్చింది.

కాంగ్రెస్‌ పార్టీని సంస్థాపరంగా పటిష్టం చేసి, ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసే చర్యలలో భాగంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటున్న పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ శనివారంనాటి చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియవచ్చింది. ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి, శాసనసభ స్పీకర్‌ పదవులకు తగిన నేతలను ఎంపిక చేసే విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, అధిష్టానం నేతల ఆలోచనలకు పొంతన కుదరడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన డి.శ్రీనివాస్‌ స్థానంలో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్‌ మంత్రి, వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు బొత్స సత్యనారాయణను ఎంపిక చేయాలన్నది అధిష్టానం ప్రతినిధుల అభిప్రాయంగా కనిపిస్తుండగా ఈ పదవిని తెలంగాణకు చెందిన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన సీనియర్‌ నాయకుడు సంభాని చంద్రశేఖర్‌ లేదా మాజీ మంత్రి కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి పేర్లను కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రతిపాదిస్తునట్లు సమాచారం. వీరిద్దరి పేర్లతో పాటు తెలంగాణకే చెందిన మరో సీనియర్‌ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలి, కోస్తాకు చెందిన మరో సీనియర్‌ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.
అలాగే, శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా తనకు సన్నిహితుడైన తెలంగాణ ప్రాంత సీనియర్‌ శాసనసభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికే కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కోరుకొంటున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, స్పీకర్‌ పదవి ఖాళీ అయినప్పటి నుంచి శాసనసభ కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ప్రమోషన్‌ ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకునికే ఉపముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు అధిష్టానం గతంలోనే ప్రకటించినప్పటికీ పిసిసి సారథిగా ఎంపికయ్యే నేతను బట్టి రాష్ట్ర మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్థానంలో మరో ప్రాంత నాయకునికి ఈ పదవి దక్కే అవకాశాలు లేకపోలేదని అభిజ్ఞవర్గాల కథనం.
పదవుల భర్తీ, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో శాసనమండలి సభ్యుల ఎంపిక తదితర అంశాలన్నింటిపై మరో నెల లోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదని, శనివారంనాటి చర్చలు ఎక్కువగా రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనను గాడిలో పెట్టడంపైనే, పార్టీ… ప్రభుత్వం మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే కేంద్రీకృతమైనట్లు ఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అధిష్టానం పిలుపుపై శనివారం ఉదయమే ఇక్కడికి చేరుకున్న ఆయన కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుసుకొన్న తర్వాత సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుండే ఆజాద్‌తో కలిసి పార్టీ అధ్యక్షురాలి నివాసం, 10-జన్‌పథ్‌ చేరుకుని సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలితో చర్చల అనంతరం ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడడానికి ఇష్టపడకుండా రాత్రి బసకోసం ఎపి భవన్‌కు వెళ్లిపోయారు.  ఆదివారం ఉదయం ఇక్కడ నుండి బయలుదేరి బెంగళూరు మీదుగా అనంతపురం వెళ్లనున్న ముఖ్యమంత్రి అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై సాయంత్రానికి ఢిల్లీ తిరిగి వస్తారని, కేంద్రంలో రెండవసారి యుపిఎ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన అధికార నివాసంలో యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు, పార్లమెంట్‌ సభ్యులు, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు ఇవ్వనున్న విందుకు హాజరౌతారని అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ విందు సమావేశంలో యుపిఎ రెండేళ్ల పాలనపై ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేయనున్న విషయం విదితమే.

No comments:

Post a Comment