Monday, February 2, 2015

తెదేపాలో లోకేష్‌ పైనే చర్చ...!!

టీడీపీలో ప్రస్తుతం ఎన్నికల వేడీ రాజుకుంది. దశాబ్ద కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పార్డీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. టీడీపీలో పార్టీ సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు చట్టసభల ఎన్నికల స్థాయిలో జరుగుతాయి. సమర్థవంతులైన వారికే చంద్రబాబు బాధ్యతలు అప్పగిస్తారు. నాలుగు నెలల పాటు జరిగే ఈ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ ఎన్నికలు జరుగుతాయి. తొలుత గ్రామ కమిటీల ఎంపిక, తర్వాత మండల కమిటీలు… జిల్లా కమిటీలు.. చివరగా రాష్ట్ర కమిటీల నియామకం జరుగుతుంది. అయితే పార్టీలో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. గతంలో సమైక్యాంధ్ర కాస్త ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను ఎన్నుకోవాలి. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఎన్నిక కావడం లాంఛనమే.
అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అందరి దృష్టి యువనేత లోకేష్‌పైనే ఉంది. చంద్రబాబు ఆయనకు ఏ బా«ధ్యతలు అప్పగిస్తారన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా లేదా కొద్ది రోజుల పాటు ఆయనకు వెయిటింగ్ తప్పదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. వచ్చే ఎన్నికల బరిలో లోకేష్ ఉండడం ఖాయంగా కనిపిస్తుండడం… చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి రావడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ ఎన్నికల కోసం ఏపీలో ఉన్న 175 నియోకవర్గాలకు 105 మంది పరిశీలకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మే 29న మహానాడు ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది.
– ఫిబ్రవరి 6-28 గ్రామ, వార్డు స్థాయి కమిటీల ఎన్నికలు
– మార్చి 23-ఏప్రిల్ 7 మండల, పట్టణ, డివిజన్ స్థాయి కమిటీల ఎన్నికలు
– ఏప్రిల్ 20-30 జిల్లా కమిటీ ఎన్నికలు
– మే 27,28,29 మహానాడు, రాష్ట్రాలు, జాతీయ అధ్యక్షుడి ఎంపిక

No comments:

Post a Comment